కాలేజ్ బాయ్ Part 26 Like

కాజల్ “ఎవరికైనా చెబితే… సందీప్ సూసైడ్ చేసుకుంటా అన్నాడు. ఏం చేయమంటావ్….?” అంది.

క్రిష్, తన వైపు చూసి “చేసుకుంటే” అన్నాడు.

కాజల్ “…”

క్రిష్ “నేను చెప్పేదా….”

కాజల్ “…”

క్రిష్ “నువ్వు సందీప్ ని లవ్ చేయలేదు, నన్ను లవ్ చేయలేదు, మీ పేరెంట్స్ ని లవ్ చేయలేదు, ఎవ్వరిని లవ్ చేయలేదు… ఒక్క నిన్ను నువ్వు తప్పా….” అన్నాడు.

కాజల్ “…”

క్రిష్ “ఆమె తన చెల్లెలు కోసం అక్కడే ఉండిపోయింది, ఎంత ఇబ్బందులు పడ్డా… అందరిని నవ్వుతూ పలకరించింది… ఇప్పటికి కూడా తనని తానూ ప్రేమించుకోవడం కంటే ఎదుటి వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తుంది” అన్నాడు.

కాజల్ “మరి సెల్ఫ్ లవ్ అంటే అదే కదా…”

క్రిష్ చిన్నగా నవ్వి “సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం గౌరవించడం… ఎదుటి వాళ్ళను కూడా గౌరవించడం….. అంతే కానీ మనల్ని మనం ప్రేమించుకుంటూ ఎదుటి వాళ్ళను వాడుకొని వదిలేయడం కాదు” అన్నాడు.

కాజల్ “…”

క్రిష్ “నీ కంటికి నేను ఎప్పుడూ మనిషిలా కనిపించలేదు… అవసరానికి వాడుకునే వదిలేసే ఒక వస్తువుని అంతే….” అన్నాడు.

కాజల్ “సెక్స్ విషయంలో” అంది.

క్రిష్ మౌనంగా ఉన్నాడు.

కాజల్ కి గాడంగా ఉన్న అనుమానం అదే…

క్రిష్ “తనతో కలిసి ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడుని” అన్నాడు.

కాజల్ అమాంతం అతడి మీద పడిపోయింది.

క్రిష్ తను ఇంకా రష్ అనుకుంటూ తోసేయబోయాడు. కొద్ది సేపటి తర్వాత ఆమె మెడ వంపుల నుండి వస్తున్నా స్మెల్ పీలుస్తూ ఉంటే అది కాజల్ అని అర్ధం అయింది. అలాగే తన రహస్యం తెలిసిపోయినందుకు భయ పడ్డాడు.

కాజల్ “లవ్ యు రా…. లవ్ యు సో మచ్…” అంటుంది.

క్రిష్ తనని తోసేశాడు.

మరుసటి రోజు రాత్రి… క్రిష్ కోలుకున్నాడు.

క్రిష్ “రష్….” అన్నాడు.

“హుమ్మ్ చెప్పూ…” అని వినపడింది.

క్రిష్ కళ్ళు తెరిచి చూశాడు.

ఎదురుగా రష్ నవ్వుతూ కనపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *