“తనను వదిలేసి నన్ను పెళ్లి చేసుకో….”
క్రిష్ “పిచ్చి కాని పట్టిందా…..”
“…”
క్రిష్ “ఏయ్….”
“…”
క్రిష్ “ఏయ్…. ఇటూ చూడు”
“…”
క్రిష్ “పూజ….”
“…”
క్రిష్ “ఏయ్….”
పూజ “అవునూ రా పిచ్చి పట్టింది అందుకే నీకు మూడు వందల కోట్లు ఇచ్చాను” అని అరిచింది.
క్రిష్ “తు…. తు…. ఏంటి ఆ అరవడం….”
పూజ “చెప్పా కదా… నువ్వంటే పిచ్చి పట్టింది”
క్రిష్ “అయినా నీ మూడు వందల కోట్లు నీకు ఇచ్చేసా కదా… ఇంకా ఆ విషయం ఎందుకు చెబుతున్నావ్… అందరికి ఇలానే చెబుతున్నావా….”
పూజ ఏడుస్తూనే “నీకు అసలు ఆడపిల్లలను అర్ధం చేసుకోవడమే రాదు…. నీ కోసం నేను అంత దూరం నుండి వస్తే….. డబ్బు గురించి మాట్లాడుతున్నావ్…” అంటూ క్రిష్ మీద పడిపోయి ముక్కు తుడుచుకుంది.
క్రిష్ “ఆ మూడు వందల కోట్లు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే సంక నాకి పోయాయా….” అన్నాడు.
పూజ “నువ్వు మళ్ళి డబ్బు గురించి మాట్లాడుతావ్… నేను నీకు డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా….”
క్రిష్ “లేదు…. లేదు…. నువ్వు చాలా మంచి దానివి…”
పూజ “మ్మ్” అంటూ క్రిష్ చాతీ మీద తన మొహం అలానే ఉంచింది.
క్రిష్ “ఇంతకి ఎక్కడ పెట్టావ్ డబ్బులు ఉన్నాయా…. లేక పోతే ఉష్ కాకినా…..”
పూజ సీరియస్ గా క్రిష్ ని చూస్తూ “కొంచెం నష్ట పోయాను… మిగిలింది సేఫ్….” అంది.
క్రిష్ “సరే… నీ డబ్బు నేను తెప్పిస్తా కాని నా వైఫ్ ని సేఫ్ గా రప్పించు….”
పూజ “నువ్వు ఇలా మాట దాటేస్తున్నావ్ ఎందుకు? మనం పెళ్లి చేసుకుందాం…. తనని వదిలేయ్” అంది.
క్రిష్, పూజ గొంతు పట్టుకున్నాడు.
పూజ “వద్దు… వద్దు… తను సేఫ్ గా ఉంది. సేఫ్ గానే ఉంది” అంది.
క్రిష్ “రప్పించు….” అన్నాడు.
పూజ సరే అంటూ ఫోన్ మాట్లాడింది.
క్రిష్, కాజల్ ని చూశాడు కాని తను ఎప్పటిలా నవ్వుతూ కాకుండా ఏడుస్తూ కనపడింది.
పూజ వైపు సీరియస్ గా చూస్తూ, కాజల్ ని అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు.
పూజ “ఓయ్…. నాకు మాట ఇచ్చావ్…. డబ్బు తెప్పిస్తా అని…” అంది.
క్రిష్ వెనక్కి తిరిగి “ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు… ఆరు నెలల తర్వాత… ఇండియాలో అడుగు పెట్టావ్…”
పూజ “నన్ను ఎవడు ఏం చేస్తాడు?” అనుకోని చేతులు కట్టుకుని ఉంది.
కాజల్ మరియు క్రిష్ ఇద్దరూ బెడ్ పక్కనే కూర్చొని ఉన్నారు.
క్రిష్ బీర్ ఓపెన్ చేసి ఇచ్చాడు, కాజల్ క్రిష్ ని చూస్తూ ఉంది.
క్రిష్ “ఇప్పటి వరకు నువ్వు తెలుసుకున్న నా జీవితం నాణానికి ఓకే వైపు మాత్రమే….. ఇప్పుడు తెలుసుకునేది మరో వైపు….” అన్నాడు.
కాజల్, బాధ పడుతూ క్రిష్ ని చూస్తూ ఉంది.
క్రిష్ “ముందు తను ఏం చెప్పిందో చెప్పూ…. తర్వాత నేను చెబుతాను…. నాకు తెలిసి ఎదో సోది చెప్పినట్టు ఉంది అందుకే నువ్వు ఇంతగా బాధ పడుతున్నావ్…”
మంచం పక్కన కింద క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ఉన్నారు.
క్రిష్ పక్కనే అప్పటికే ఏడూ బీర్లు తాగేసిన బాటిల్స్ ఉన్నాయి.
కాజల్ ఎదురుగా ఒకే ఒక్క బాటిల్ సగం తాగేసి ఉంది. కాని ఆమె మొహం ఎర్రగా మారిపోయి ఉంది. ఏడ్చి ఏడ్చి ఉంది.
ఎదురుగా ఫోన్ నుండి వీడియో కాల్ లో నిషా ఇద్దరినీ చూస్తూ ఉంది.
నిషా “నీ యంకమ్మా…. కిడ్నాప్ అంటే ఏమయిందో అని భయ పడి చచ్చాను…. ఇద్దరూ ఎదురు ఎదురుగా కూర్చొని సెక్స్ స్టోరీస్ చెప్పుకున్నారా!”
కాజల్ “ప్చ్…..”
నిషా “ఏంట్రా….. ఏంటి? నీ గురించి చెప్పారనే కదా….. అయినా ఆ కధ నీ కధ కాదు, ఆ పూజ ఇంటర్నెట్ లో చదివి చెప్పింది”
కాజల్ కళ్ళు తుడుచుకొని కోపంగా నిషాని ఫోన్ లో నుండే “నీకెలా తెలుసే….. అది ఇంటర్నెట్ లో కధ అని….. ” అని అడిగింది.
నిషా “అంటే అది….. ” అంటూ చిన్నగా దగ్గుతుంది.
కాజల్ “రోజు రాత్రి దుప్పటి మొత్తం కప్పుకొని ఫోన్ లో ఇవి చదువుకుంటూ ఉండే దానివి కదా….. ”
నిషా తల అడ్డంగా ఊపింది కానీ లేదు అనే మాట తన నోటి నుండి రావడం లేదు.
క్రిష్ కూడా నవ్వాడు.
కాజల్ “నీ సంగతి ఏంటి? నీ గురించి చెప్పుకున్నాం అని సంబర పడుతున్నావా! అసలు ఎవరది? కిడ్నాప్ ఏంటి కిడ్నాప్….. ఏమనుకుంటుంది అది….” అంటూ కళ్ళు పెద్దవి చేసుకొని కోపంగా క్రిష్ కాలర్ పట్టుకొని అడిగింది.
క్రిష్ కళ్ళకి కాజల్ కోపంగా కనపడ్డా అందంగానే కనిపిస్తుంది పైగా తాగి ఉండడంతో క్రిష్ అలా చూస్తూ ఉండి పోయాడు.
నిషా “అది అక్కా అలా అడుగు…. కడిగిపారేయ్…..” అంటుంది.