కాలేజ్ బాయ్ Part 28 Like

బాయ్2 “నువ్వెవరో నాకు తెలీదు…. నాకు ఏమయినా అయిందని తెలిసింది అంటే….” అంటూ ఆగిపోయాడు.

వైభవ్ మరియు కేశవ్ ఇద్దరూ అందరిని తప్పించుకొని ముందుకు వచ్చి చూడగా సుహాస్ ముందు ఆ బాయ్2 నిలబడి మాస్టర్ అన్నాడు.

సుహాస్ “నీ వల్ల ఇంత మందికి దెబ్బలు తగిలాయి… అంటూ హాస్పిటల్ స్టాఫ్ ని చూపిస్తూ… అందుకే ఆ కిటికీ నుండి దూకేసేయ్…. కింద పడ్డాక మళ్ళి పైకి వచ్చి మళ్ళి అలానే దూకేసేయ్… అలా మొత్తం పది సార్లు” అన్నాడు.

బాయ్2 “అలాగే మాస్టర్” అంటూ కిటికీ ఎక్కి ముందుకు దూకేశాడు.

వైభవ్ “ఓయ్…. ఓయ్…. అలా దూకేశాడు…. ” అని ఆశ్చర్యపోయాడు.

కాజల్ మరియు నిషా చూస్తూ ఉండగా, తల నుండి రక్తం కారుతూ బాయ్2 వాళ్ళను తప్పుకొని మెట్లు ఎక్కి పైకి వెళ్లి మనుషులను తప్పుకొని ముందుకు వెళ్లి కిటికీ నుండి మళ్ళి దూకాడు.

కాజల్ మరియు నిషా ఇద్దరూ అతన్ని చూసి దడుచుకున్నారు, పెద్దగా “ఆ! ఆ! ఆ!….. ” అని అరిచారు.

వైభవ్ కి కూడా అతన్ని చూసి షాక్ అయ్యాడు.

అంతలోనే బాయ్2 మళ్ళి పైకి వస్తున్నాడు, కాజల్ మరియు నిషా అతన్ని చూసి దడుచుకొని మెట్లు ఎక్కి పరిగెత్తుకుంటూ పై ఫ్లోర్ లోకి వచ్చారు.

అంత మందిని కొట్టించి, ఇద్దరినీ చావు బ్రతుకుల్లో పడేసి కూడా సుహాస్ చాలా ప్రశాంతంగా ఉండడం చూసి అందరూ షాక్ గా ఉన్నారు.

కాజల్ అక్కడ కేశవ్ మరియు సుహాస్ లను చూసినా పలకరించలేకపోయింది.

సుహాస్ అందరిని తప్పించుకోని లిఫ్ట్ లోకి వెళ్తూ, అందరిని చూసి “అందరూ జాగ్రత్తగా ఇక్కడే ఉండండి… ‘నూతన్’ ని చంపి వస్తాను…” అంటూ లిఫ్ట్ లోకి వెళ్ళాడు.

లిఫ్ట్ డోర్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యాయి.

సుహాస్ కళ్ళలో కోపం కసి చూస్తుంటే అందరికి కొత్తగా ఉన్నా ఎవరూ ఆపలేదు.

‘ఫైనల్ ఫ్లోర్’ అని లిఫ్ట్ సౌండ్ వచ్చింది, లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది.

221. ఫైనల్ ఫ్లోర్: కాఫీ విత్ క్రిష్

లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే సుహాస్ కి ఎదురుగా కనపడ్డ దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది.

కొన్ని నిముషాల క్రితం…

నూతన్ “ఏం చేసినా ఎంత చేసినా నిన్ను వశం చేసుకోలేకపోతున్నాను….” అంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు.

ఎదురుగా క్రిష్ ని చూసి “నవ్వుకుంటున్నావ్ కదా….” అంటూ పళ్ళు నూరాడు.

క్రిష్ నూతన్ ని హాల్ లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి, ఇక్కడే కూర్చో అని అక్కడే ఉన్న ఫ్లాస్క్ లోని కాఫీ రెండూ కప్పులలో పోసి ఒకటి నూతన్ చేతికిచ్చాడు.

నూతన్, క్రిష్ ని ఏదైనా కలిపి ఉంటాడా అన్నట్టు అనుమానంగా చూశాడు.

క్రిష్ ని అలా చూస్తూ ఉంటే అతని పథ స్నేహితుడుని కలిసిన సంతోషం ఉంది కానీ శత్రువుని కలిసిన కోపం లేదు.

కాని తనకు మాత్రం ఆ కాఫీలో ఏదైనా ఉందేమో అనిపించింది, తను గమనించినంత వరకు క్రిష్ ఒకటే ఫ్లాస్క్ నుండి పోసాడు అని అర్ధం అయి కప్ ల వైపు అనుమానంగా చూశాడు.

క్రిష్, నూతన్ చూపుని గమనించి… కప్ లలో ఉన్న కాఫీని అందులో నుండి ఇందులోకి… ఇందులో నుండి అందులోకి… కలిపి ఒకటి తీసుకొని నోటి దగ్గర పెట్టుకొని నూతన్ వైపు నవ్వుతూ చూశాడు.

నూతన్ కూడా కాఫీ తీసుకొని నోటి దగ్గర పెట్టుకొని క్రిష్ ని చూశాడు.

క్రిష్ కాఫీ తాగాడు, నూతన్ మాత్రం క్రిష్ ని చూస్తూనే ఉన్నాడు. క్రిష్ గొంతు పట్టుకొని “హ… హ… ” అంటూ పడిపోయాడు. నూతన్ ఆ కాఫీని దూరంగా పెట్టి క్రిష్ ని దగ్గరకు వెళ్లి చూశాడు.

క్రిష్ అమాంతం పైకి లేచి నూతన్ ని చూస్తూ పగల బడి నవ్వాడు. నూతన్, క్రిష్ తనని ఆట పట్టిస్తున్నాడని అర్ధం అయి క్రిష్ భుజం మీద ఫ్రెండ్లీ గా చరిచి వెళ్లి తన సీట్ లో కూర్చున్నాడు.

క్రిష్ వెంటనే “నీకు గుర్తు ఉందా…” అంటూ ఆహ్లాదకరమైన పాత జ్ఞాపకం ఒకటి గుర్తు చేశాడు.

నూతన్ కి క్రిష్ ని ఏదైనా చేయాలి, క్రిష్ తన శత్రువు అని అనిపిస్తున్న కూడా క్రిష్ తో ఆ సరదా సంభాషణ నుండి తన మనస్సుని తప్పించలేకపోయాడు.

క్రిష్ ఇంకా ఇంకా మాట్లాడుతూ ఉంటే, నూతన్ కూడా నవ్వేసి తన జ్ఞాపకాలు పంచుకున్నాడు.

తామిద్దరి మధ్య గతం చాలా మంచిగా జరిగినా అదంతా ఒక ప్లాన్ గా మోసం చేయాలనే దృక్పధంతోనే మొదలయ్యాయి.

క్రిష్ తనని గతంలో ఎంతగానే అభిమానించేవాడు, అదంతా గుర్తు వస్తూ ఉంటే నూతన్ కి సడన్ గా గిల్టీగా అనిపించింది.

క్రిష్ గతంలో సత్య అనే అమ్మాయితో అబ్బాయి అనుకోని మాట్లాడేవాడు, వారిద్దరి మధ్య చాలా నాళ్ళు ఆ సంభాషణ సాగింది. తను మాట్లాటే సత్య ఒకమ్మాయి అని తెలిసి క్రిష్ ఆమెను బ్లాక్ చేసేశాడు, తిరిగి కలిసే ప్రయత్నం కూడా చేయలేదు.

కాని నూతన్ తనకి సత్య నచ్చకపోవడానికి కారణం క్రిష్ ని భావించి అతడిని చాలా నాళ్ళు హింసించాడు.

ఇద్దరి మధ్య గతం గురించి సంభాషణ పూర్తీ అవ్వగానే, ప్రస్తుతం లోకి వచ్చారు.

క్రిష్ “ప్రభు పేరిట తొమ్మిదికి పైగా కంపనీలు ఉన్నాయి, అలాగే ప్రభు మరియు అతన్ని నమ్మి సుమారు పది వేల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ప్రిన్సిపల్ సిద్దంగా ఉంటుంది, పైగా అనాధ శరణాలయం నుండి ప్రతి సంవత్సరం దత్తత తీసుకోవడంతో వాళ్ళు అందరూ ప్రభు కంపనీలో ఇంకా అనేక కంపనీలలో మంచి పొజిషన్ లకు వస్తున్నారు అందరూ కూడా ‘ప్రభు’ అంటే అంకుల్ కి మరియు ‘నూతన్’ అంటే నీకు లాయల్ గా ఉన్నారు. వాళ్ళు అందరూ నువ్వు ఏం చెబితే అది చేస్తారు. డబ్బు బలం, అండ బలం నీ వెనక యువకుల బలం… ఇదంతా వదిలేసు కొని ఎక్కడకు వెళ్లావు…. ఎందుకు వెళ్లావు… సరే ఎటూ తిరిగి వచ్చావ్ కాబట్టి వచ్చేసేయ్…” అన్నాడు.

నూతన్ క్రిష్ నోటి నుండి అలాంటి సంభాషణ ఊహించలేదు, శత్రువులా అనుకుంటాడు అనుకుంటే, పాత స్నేహితుడులా సలహా ఇస్తుంటే ఏం చేయాలో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.

క్రిష్ “తిరిగోచ్చేయ్ భయ్యా…” అన్నాడు.

నూతన్ ఒక్క సారిగా విసుగ్గా చూస్తూ “ఎందుకు… ఎందుకు… ఎవడు వింటాడు నా మాట… ” అన్నాడు.

క్రిష్ “ఏమంటున్నావ్ భయ్యా… ఎవడు నీ మాట కాదన్నాడు…”

నూతన్ “ఆల్రెడీ బిజినెస్ పార్టనర్ మీటింగ్ చూసే ఉంటావు కదా… ఒక్క సారి అంటే ఒక్క సారి కూడా ఒక్కడు కూడా మాట వినడు… అలాంటి వాళ్ళతో మనం బిజినెస్ ఎలా చేస్తాం… నాకు సాయంత్రానికి తల బొప్పి కట్టేది… వాళ్ళ అందరిని పిచ్చ కొట్టుడు కొట్టి ముందుకు అడుగు వేయించాలి అనిపించేది… ఇప్పుడు నాకు ఉన్న ఈ శక్తితో ఎవడైనా నా మాట వింటారు… ఇక ఆ బొక్కా పార్టనర్ మీటింగ్ నాకు వద్దు…” అన్నాడు.

క్రిష్ “సరే… సరే… నేను నీకు తోడూ ఉంటాను… నేనే కాదు, నువ్వు పిలిస్తే చాలా మంది నీకు తోడూ వస్తారు… ప్లీజ్.. ఏ తప్పు జరగక ముందే, ఈ రాంగ్ రూట్ నుండి బయటకు వచ్చేసేయ్…” అన్నాడు.

నూతన్ ఆలోచనలలో పడిపోయాడు.

ఇంతలోనే డోర్స్ ఓపెన్ అయ్యాయి.

సుహాస్ వస్తూనే కోపంగా ఇద్దరినీ చూస్తూ చేతిలో ఉన్న కత్తిని నూతన్ మీదకు విసిరేశాడు, నూతన్ అమాంతం తప్పుకోవడంతో అది పక్కకు పడిపోయింది. సుహాస్ మరో చేత్తో కత్తులను తీసుకొని విసిరుతూ ఉన్నాడు, క్రిష్ మరియు నూతన్ ఇద్దరూ సోఫా వెనక దాక్కున్నారు.

సుహాస్ “రేయ్…. రాక్షసుడా…. నీ వల్ల నా ప్రియ… నా భార్య…., నన్ను, రెండేళ్ళ నా బిడ్డని ఇద్దరినీ వదిలేసి సూ సైడ్ చేసుకొని చనిపోయింది…. నిన్ను వదలను రా…. నిన్ను వదలను రా…. నూతన్” అంటూ సోఫా వెనక్కి వెళ్లి కత్తి తీసుకొని నూతన్ దగ్గరకు వెళ్లి పొడిచాడు.

నూతన్ చేయి అడ్డం పెట్టుకోవడంతో అతని భుజంలోకి దిగబడి రక్తం బయటకు వచ్చింది.

నూతన్ “ఆహ్” అంటూ పైకి లేచి, సుహాస్ ని చూస్తూ ఉండిపోయాడు, సుహాస్ కళ్ళలో తనని చంపాలన్న కోపం చూస్తూ ఉంటే అదోలా అనిపించింది.

సుహాస్ ఆలస్యం చేయకుండా చిటికే వేసి అక్కడున్న స్టాఫ్ ని నిద్రలేపి నూతన్ ని సరౌండ్ చేయించాడు.

క్రిష్ వద్దు వద్దు అని చెబుతూ సుహాస్ కి అడ్డం వస్తున్నాడు. నూతన్ అప్పటి వరకు క్రిష్ మాటలు…. విని అతను చెప్పినట్టుగా ఊహించుకున్నాడు బాగా అనిపించింది, కానీ సుహాస్ కోపం…. చూస్తూ ఉంటే తనకు ఆ అవకాశం లేదని తెలుస్తుంది. తన జీవితాన్ని పాడు చేసుకున్నందుకు తన మీద తనకే కోపం వచ్చింది.

క్రిష్ మరియు సుహాస్ ఇద్దరూ అరుచుకుంటూ తోసుకుంటూ ఉన్నారు.

ఇంతలో టాప్ ఫ్లోర్ కి కేశవ్, వైభవ్ మరియు కాజల్, నిషా కూడా వచ్చారు.

వాళ్ళ వెనకే…. వైభవ్ తో వచ్చిన మనుషులు కూడా వచ్చారు.

సుహాస్ తను క్రిష్ మీద గెలవలేడు అని అర్ధం అయి అతన్ని తోసేసి “నా భార్య… ప్రియ…. తనకు రోజు పీడకల వచ్చేది… అది పీడ కల కాదు ఈ త్రాస్టుడు చేసిన ఘాతుకం… నా భార్య తట్టుకోలేక చచ్చిపోయింది” అంటూ ఏడుస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *