కాలేజ్ బాయ్ Part 28 Like

పైకి లేచి చుట్టూ చూడగా వేరే బెడ్ ల మీద క్రిష్, కేశవ్ మరియు వైభవ్ లు కనిపించారు. అలాగే ఆ రోజు ఇబ్బంది పడ్డ మిగిలిన వ్యక్తులు కూడా అక్కడే ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉన్నారు.

కాజల్ వచ్చి సుహాస్ చేతిని పట్టుకొని “అన్నయ్యా…” అని పిలిచింది.

సుహాస్ ఆమె చేతిని తోసేసి సరాసరి క్రిష్ దగ్గరకు వెళ్లి “నూతన్… ఆపుదాం… ఆపుదామన్నావ్… నాకు మాట ఇచ్చావ్….” అని అరుస్తాడు.

అంతలో ఒక నర్సు తనకు సేడేటివ్ ఇవ్వడంతో మళ్ళి స్పృహ తప్పుతాడు.

223. సుప్రీమ్ మాస్టర్

క్రిష్ మంచం మీద హెడ్ బోర్డ్ కి ఆనుకొని కూర్చొని ఉన్నాడు.

కాజల్, క్రిష్ ని చూస్తూ ఉండగా… క్రిష్ “ప్రస్తుతం నాతో ఉండడం… చాలా పెద్ద రిస్క్… దూరంగా వెళ్ళిపో…” అన్నాడు.

కాజల్ “నువ్వు నా కంటే అయిదు సంవత్సరాలు చిన్న వాడివి” అంది.

క్రిష్ ఓరకంటితో కాజల్ వైపు చూశాడు.

కాజల్ “నాకు తెలుసు… వయస్సు గురించి మాట్లాడితే నీ మేల్ ఇగో ఒప్పుకోదు అని… అందుకే ఎప్పుడూ నీ ముందు ఆ మేటర్ తీసుకు రాను…”

క్రిష్ “నేనేం చిన్నపిల్లాడిని కాను… ”

కాజల్ “నాకు తెలుసు… ఎప్పుడూ నువ్వు మెచ్యూర్ గానే ఉంటావ్… ఏ సమస్య వచ్చినా చేసేద్దాం అన్నట్టు ఉంటావ్…” అంది.

క్రిష్ కి కొంచెం గర్వంగా అనిపించింది.

కాజల్ “ఒక్క ఇప్పుడు తప్ప” అని బయటకు వెళ్ళిపోయింది.

క్రిష్ ఆలోచనలలో పడిపోయాడు.

ఇంతలో వైభవ్ మరియు నిషా ఇద్దరూ గదిలోకి వచ్చారు.

నిషా “కిటికీ నుండి దూకావు ఏంటి రా….”

క్రిష్ చిన్నగా నవ్వి “మీ ఆయన కుడా దూకాడు కదా… ఓహ్… నువ్వు తోసావా…”

నిషా కోపంగా చూస్తే, క్రిష్ నవ్వేశాడు, వైభవ్, నిషా చేయి పట్టుకొని బయటకు వెళ్ళమని సైగ చేశాడు.

క్రిష్ వైభవ్ ని చూస్తూ ఉండగా… వైభవ్ “అతన్ని మొత్తం తీసుకో అన్నావ్… అతను ఇవ్వమని అంటే… ఇచ్చేసే వాడివా…”

క్రిష్ తల పైకెత్తి, వైభవ్ ని చూస్తూ “నువ్వేం అనుకున్నావ్” అన్నాడు.

వైభవ్ ఏమి మాట్లాడలేదు, అలానే ఉన్నాడు.

క్రిష్ “నిన్న ఆ సుహాస్ చేయి విరిచావు కదా…. ఎందుకు?” అన్నాడు.

వైభవ్ కోపంగా క్రిష్ వైపు చూస్తూ “నేనా…” అన్నాడు.

క్రిష్ “మిస్టర్ వైభవ్… ఇది చాలా డేంజెర్ గేమ్… వద్దు” అని తల ఊపుతూ అన్నాడు.

వైభవ్ నోట మాట లేదు, నూతన్ ని చూస్తూ అడుగు వెనక్కి వేయాలని తనకు లేదు. కాని క్రిష్ చెప్పింది అబద్దం కాదు ఇది నిజంగా డేంజెర్ గేం…

వైభవ్ “నాకు చాలా డౌట్స్ ఉన్నాయ్” అన్నాడు.

క్రిష్ పైకి లేచి తన చాతీ మీద కట్టిన కట్లుని కవర్ చేసుకుంటూ చొక్కా తొడుక్కున్నాడు.

సుహాస్ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కేశవ్ కూర్చొని ఉన్నాడు.

కేశవ్ “మైండ్ దొబ్బిందా… ఆ రకంగా ఎగేసుకొని తిరుగుతున్నావ్… ఇప్పటికే రెండూ సార్లు ఆ చేతి కట్టు మార్చారు” అన్నాడు.

సుహాస్ తన చేతి వైపు కూడా చూసుకోవడం లేదు, ఆవేశంతో అతని చాతీ ఎగిరెగిరి పడుతుంది.

కేశవ్ చెప్పే మాటలు వినిపించుకోకుండా అలా గాల్లోకి చూస్తూ ఉన్నాడు.

కాజల్ దూరంగా నిలబడి అతన్నే చూస్తుంది, జాబ్ జాయిన్ అయిన మొదట్లో అతను తనకు చాలా హెల్ప్ చేశాడు.

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అతన్ని చూసే తను ఇప్పుడు ఇలా మారిపోవడం చూస్తూ ఉంటే బాధగా అనిపించింది.

క్రిష్ ఆ గది దగ్గరకు వచ్చాడు, కాజల్ క్రిష్ ని చూసి ఎదురు వెళ్ళి మరి అతని చేయి పట్టుకుంది.

ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని చిన్నగా నవ్వాడు, ఎందుకో క్రిష్ నవ్వగానే తనకు చాలా సంతోషంగా అనిపించింది.

అప్పుడు గుర్తు వచ్చింది క్రిష్ అలా నవ్వి చాలా రోజులు అవుతుంది. బహుశా పెళ్లి అప్పుడా…. లేదా హనీమూన్ లోనా….

తన ఆలోచనలను చెరిపేస్తూ క్రిష్ ఆమె నుండి దూరం జరిగి సుహాస్ ముందుకు వెళ్ళాడు.

సుహాస్ “నిన్న నువ్వు చెప్పిన మాటలు నేను విన్నాను… అతడిని ఆపుదాం… మనం ఒక గ్రూప్ గా మారి అతడిని ఆపుదాం… ”

క్రిష్ అతన్నే చూస్తూ ఉన్నాడు.

కేశవ్, సుహాస్ వైపు చూస్తూ “ఇలా తయారు అయ్యావ్ ఏంటి రా…. నువ్వు ఆపుదాం అంటున్నా నీ కళ్ళు చంపుదాం అనే వినపడుతుంది” అన్నాడు.

సుహాస్ తన రహస్యం బయట పడ్డందుకు భయపడలేదు, అతడిని తప్పేంటి… అన్నట్టు చూశాడు.

అప్పుడే అక్కడకు వచ్చిన వైభవ్, అందరిని తప్పుకుని ముందుకు వచ్చి “సారీ బాస్…. నిన్న…”

సుహాస్ “వైభవ్… మిస్టర్ వైభవ్ రాజ్… బిగ్ షాట్… అతడిని చంపుదాం… ఆ నూతన్ ని చంపుదాం… ” అన్నాడు.

వైభవ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు.

సుహాస్ కి వాళ్ళలో తనకు కావాల్సిన భావం కనిపించకపోయే సరికి కోపం వచ్చి వాళ్ళను చూస్తూ పెద్దగా నవ్వాడు.

కేశవ్ కోపంగా “నీకేమైనా పిచ్చా… గన్ తీసుకొని అతన్ని చంపడానికి వెళ్లిపోయావ్… అతనికి ఏదైనా అయి ఉంటే ఏమయ్యేదో తెలుసా!” అన్నాడు.

సుహాస్ “అతను కాదు… నూతన్… నరరూపరాక్షసుడు… ఎదో నలుగురిని పది నిముషాలు మైండ్ కంట్రోల్ చేసే వాడిలా కనిపిస్తున్నాడా! హహ్హహ్హ” అని నవ్వాడు.

సుహాస్ “నూతన్… నూతన్ ఒక సుప్రీమ్ మాస్టర్…”

అందరూ సుహాస్ ని చూస్తూ ఉన్నారు.

నూతన్ కి ఈ పవర్ ఉన్నా… ఆ రెండు గంటలు లేదా మూడు గంటలు మాత్రమే ఆ మనిషి నూతన్ మైండ్ కంట్రోల్ లో ఉంటారు.

అలాగే ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఒకే సారి కొంత మందిని మాత్రమే కంట్రోల్ చేయగలడు. ఎక్కువ మందిని ఒకే సారి మైండ్ కంట్రోల్ చేసినా వాళ్ళు మనుషులు లాగా కాక జాంబీలు లాగా ప్రవర్తిస్తారు.

నూతన్ ఎప్పటి నుండో దీని మీద ప్రయోగాలు చేసేవాడు, అయితే… క్రిష్ మరియు నూతన్ నీళ్ళలో పడ్డప్పుడు తమను కాపాడిన CM కొడుకు విజయ్ తన మనుషులతో కాపాడాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *