ఆమె కాజల్ చేతికి కార్డు ఇస్తూ “మీరు ఇది మర్చి పోయారు మేడం” అంది.
కాజల్ తీసుకొని తన పర్సులో పెట్టుకొని హమ్మయ్యా అని అనుకుంది.
మొదటి సర్వర్ గర్ల్ క్రిష్ మరియు కాజల్ ని ఉద్దేశించి “మీ ఇద్దరి జంట బాగుంది” అంది.
ఇద్దరూ చిన్నగా నవ్వారు.
మొదటి సర్వర్ గర్ల్ క్రిష్ వైపు చూస్తూ “ఇక నుండి నవ్వుతాను అన్నయ్య” అని నవ్వుతూ వెళ్ళింది.
నిషా “నీ ఇంటెంన్షన్…. తప్పుగా అనుకోలేదు… గుడ్” అంది.
కాజల్ “పాటం నేర్చుకుంది” అంటూ క్రిష్ వైపు తిరిగింది.
క్రిష్ కార్ ఆన్ చేస్తూ ఆ పెద్దాయన చెప్పిన మాట ‘మనసును చూసినపుడు తెలుస్తుంది’ అనేది గుర్తు తెచ్చుకుంటూ “నా మనసును చూసింది కాబట్టి చెడు అభిప్రాయం లేదని తెలిసింది” అన్నాడు.
ముందు సీట్ లో కాజల్ మరియు క్రిష్ లు ఇద్దరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలలో ఉంటే, నిషాకి బోర్ అనిపించి “సినిమాకి వెళ్దామా” అంది.
క్రిష్, కాజల్ వైపు చూడను కూడా లేదు ఫోన్ తీసుకొని దగ్గర లోని దియేటర్ సెర్చ్ చేసి చూశాడు.
కాజల్ “ఈ సినిమా చూద్దాం” అంటూ ఒకటి చూపించింది.
కార్ ముందుకు నడిచింది.
దియేటర్ లోకి నడుస్తూ వెళ్లి సీట్ లలో కూర్చున్నారు.
కాజల్ మధ్యలో కుర్చోగా అటూ ఇటూ క్రిష్ మరియు నిషా కూర్చున్నారు. ఆమె సంతోషంగా నవ్వుతూ తన చెల్లెలు నిషాతో మాట్లాడుతుంది.
మళ్ళి ఆ పెద్దాయన మాటలు “మనసును చూసినపుడు తెలుస్తుంది” అనేది గుర్తుకు వచ్చింది.
క్రిష్ “అవునూ…. నేను కాజల్ వైపు చూడకుండానే ఎందుకు ఫోన్ లో మూవీ చెక్ చేశాను… వెళ్దామా అని తనను నేను ఎందుకు అడగలేదు” అనుకుంటూ ఆమె వైపు చూశాడు.
కాజల్ తన వైపు చూసి “ఏంటి?” అంది.
క్రిష్ ఏం లేదు అన్నట్టు తల ఊపాడు.
క్రిష్ “నాకు తెలుసు” అనుకున్నాడు.
సినిమా టైటిల్ పడింది.
మళ్ళి తల పక్కకి తిప్పి కాజల్ వైపు చూశాడు.
కాజల్ తనని చూడకుండానే “ఏంటి?” అంది.
మళ్ళి తల అడ్డంగా ఊపి సినిమా వైపు చూశాడు.
మళ్ళి ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె అందంగా కాదు చాలా అందంగా కనిపిస్తుంది. అలా చూస్తూనే ఉన్నాడు.
ఆమె అతని చెంప పై చిన్నగా కొట్టి సినిమా చూడు అంది.
క్రిష్ ఈ సారి సినిమా చూస్తూ ఉంటే.. ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి.
ఒకమ్మాయి అటు వైపు తిరిగి ఉంది
క్రిష్ ఆమెను చూస్తూ “నేను నిన్ను ప్రేమించాను కదా… నిన్నూ నమ్మాను కదా… మరి నన్నెందుకు వదిలి వెళ్లావు”
ఆమె వెనక్కి తిరిగి క్రిష్ ని నవ్వుతూ చూసింది.
ఆమె పేరు……………
33. తోలి ప్రేమ(లు) – 1
(గతం) మూడు సంవత్సరాల ఆరు నెలల క్రితం
రైల్వే స్టేషన్
నాన్న “బాగా చదువుకో” అన్నాడు. నాన్న కళ్ళలో నీళ్ళు లేవు కాని బాధ పడుతున్నాడు అని మాత్రం తెలుస్తుంది.
అమ్మ “మీ నాన్న అంతే అంటారు…. చదువు తర్వాత అయినా చదువుకోవచ్చు… బాగా తిను… ఏంటో ఇక్కడ ఉంటే బాగుండేది… దూరం వెళ్తున్నావ్”
వదిన “ఎందుకురా…. ఈ చదువులు… పెళ్లి చేస్తాం అంటే విన్నావు కాదు”
అన్నయ్య “ఊరుకో… ఎప్పుడు పెళ్లి పెళ్లి అంటావ్… నాకు అయింది ఏం సాధించాను” అంటూ వదిన మీద అరుస్తూ మాట్లాడాడు.
వదిన “ఇద్దరూ పిల్లలు ఉన్నారు సరిపోదా” అంటూ ఒండ్రించింది.
అన్నయ్య “మీ వదిన గోల ఎప్పుడు ఉండేదే లే…. చదువుకొని ఏదైనా సాధించు… అర్ధం అయిందా…”
క్రిష్ “హుమ్మ్”
నాన్న “ఏమిటా ఆ కబుర్లు, ట్రైన్ కదులుతుంది… ఎక్కు…” అని అరిచాడు.
క్రిష్ “సరే, వెళ్లొస్తాను” అంటూ ట్రైన్ ఎక్కి చేతులు ఊపాడు.
వదిన “రన్నింగ్ బస్ లు గట్రా ఎక్కకు అయ్యా, జాగ్రత్త” అని అరిచింది.
అన్నయ్య “నిన్ను నలుగురులో అరవద్దు అని ఎన్ని సార్లు చెప్పాను. బర్రె గొంతు వేసుకొని అరుస్తావ్”
వదిన “అయ్యో రామా… జాగ్రత్త చెబుతున్నాను. అయినా నేను బర్రె అయితే తమరు దున్నపోతు అవుతారు”
అన్నయ్య “వీళ్ళు ఇద్దరూ దోడలా” అంటూ ఇద్దరి కొడుకులను చూపించాడు.
వదిన “హహ్హహ్హ… అవునూ” అంది.
అన్నయ్య “సరే, ఇంటికి పదా, పాలు తాగుతా”
వదిన “నలుగురులో ఉన్నాం అని కూడా కూడదు.. బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది”
ట్రైన్ కదిలి ఒక ఊరు దాటేసింది, తన బ్యాగ్ లు అన్ని తన సీట్ దగ్గర సర్దుకొని పైకెక్కి కూర్చున్నాడు.
అమ్మ “బాగా తిను” అనే మాటలు, నాన్న “చదువుకో” అనే మాటలు, వదిన “జాగ్రత్త” అనే మాటలు, అన్నయ్య “సాధించు” అనే మాటలు …
ఇవేవి నా తలకు ఎక్కలేదు. నేను సిటీకి వస్తుంది ఒకటే లక్ష్యం కోసం… అమ్మాయిలు…
ఇప్పుడు నా ఎదురు సీట్ లో అమ్మాయి రాబోతుంది. రాత్రి అంతా నా పక్కనే ఉంటుంది.
తోలి బోణి ట్రైన్ లో నుండి స్టార్ట్ చేయాలి.
ట్రైన్ ఆగింది. ఆ అమ్మాయి వస్తుంది అని ట్రైన్ దిగాను. కాలేజ్ సెలక్ట్ అయిన ఫోటోస్ లో ఆ అమ్మాయి ఫోటో చూశాను. చాలా బాగుంది.
త్వరగా రా…. త్వరగా రా…. త్వరగా రా…. అనుకుంటూ ఉన్నాను.
ఒక అమ్మాయి, తల్లిదండ్రుల జాగ్రత్తతో ట్రైన్ ఎక్కుతుంది. కళ్ళు మూసుకొని అవతలికి తిరిగి పడుకున్నాను.
ఆ అమ్మాయి కూడా వచ్చింది. బ్యాగ్ లు సర్దుకొని పైకి ఎక్కింది.
నా మనసు ఒర్రూతలు ఊగుతుంది. ఇప్పుడు నేను అటు తిరగగానే అందాల రాశి నా ముందు ఉండబోతుంది. పరిచయం చేసుకోవాలి.
మేమిద్దరం ఒకటే కాలేజ్, నాలుగు సంవత్సరాలు ఇలాంటి ట్రైన్ ప్రయాణం కలిసి చేయాలి.
ఆ తర్వాత తనని కాలేజ్ లో కలేసి, మెలేసి ఆ తర్వాత కాలేసి, తోసేసి తీసేసి, చెట్టాపట్టాలేసుకొని పట్నం అంతా తిరిగేసి, పెళ్లి కాకుండానే వాంతులు తెప్పించేసి… ఓహ్…
అనే ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి.
న్యాచురల్ గా అటు తిరిగినట్టు తిరిగాను. కళ్ళు తెరుస్తున్నాను. తెరుస్తున్నాను. మనసులో, ఒక సారి దేవుడుకి దండం పెట్టుకొని కళ్ళు తెరిచాను.
….షాక్…
ఓసి నీ యమ్మా కడుపు మాడ… ఇలా ఉన్నావ్ ఏంటే…. అసలు ఆ ఫోటో తీసిన వాడిని తన్నాలి. ఫోటో లో అప్సరసలా, సినిమా హీరోయిన్ లా ఉంది ఇక్కడేమో పాకి దానిలా ఉంది.
పైగా రసం మామిడి కాయ తింటుంది. మూతికి, ముక్కుకి కూడా అయింది.
నేను ఇక ఈ దారుణం చూడలేక, మెల్లగా కిందకు దిగి బాత్రూం వైపు పరిగెత్తి వ్యాక్…. వ్యాక్… అని వాంతు చేసుకున్నాను.
వెనకాల ఎవరో వచ్చారు. పాప మూతి కడుక్కోడానికి వచ్చింది. నేను వాంతు చేసుకోవడం చూసి ఆమె “ఏమయింది అండి…. అయ్యో” అంటూ రెండు చేతులు నా చెవి దగ్గర పెట్టింది. చెవి దగ్గర గుజ్జులా తగిలింది.