నాకు మళ్ళి వాంతు వచ్చింది.
మాళవిక “పులుపు తింటే వాంతు ఆగుతుంది అండి… ఇదిగోండి ఈ మామిడి కాయ తినండి” అంటూ సగం చీకేసిన ఆ రసం మామిడి టెంకె నా కంటి ముందు పెట్టింది. దాని నుండి రసం ఆమె చేతి మీద కారుతూ ఉంది. పైగా దాని మీద ఈగలు…
వ్యాక్…. వ్యాక్…
వద్దు… వద్దు… ఇంక ఆపేసేయ్… అంటూ కాజల్ మరియు నిషా ఇద్దరూ పగల పడి నవ్వుతున్నారు.
నిషా “నువ్వు వాంతులు తెప్పింద్దాం అనుకుంటే నీకే వాంతులు తెప్పించింది”
కాజల్ “అది కూడా వెంటనే”
ఇద్దరూ నవ్వుతూనే ఉన్నారు
పది నిముషాల తర్వాత… క్రిష్ తిరిగి చెప్పడం మొదలు పెట్టాడు.
33. తోలి ప్రేమ (లు) – 2
కాలేజ్ లో జాయిన్ అయ్యాక, నా గురించి అమ్మాయిలూ పడి చస్తారు అనుకున్నా… దీనేమ్మా ప్రతీది కూడా యవాయిడ్ చేస్తుంది లేదా… పల్లె టూరు గుంటలు అయితే అన్నియ్యా… అన్నియ్యా… అంటూ తగలబడుతున్నాయి. నాకేం అర్ధం కావడం లేదు. కొంచెం హైట్ ఉంటా కదా… మా PD సర్ కన్ను పడింది నా మీద. ఒకటే పనిగా పిలిచి కాలేజ్ ఆటల్లో ఆడించే వాడు, ఏ రోజు వదిలే వాడు కాదు. అయితే అక్కడ మోమిన్ అనే బక్క సుందరి తగిలింది. నీ యమ్మా భలే ఉంది అనుకుంటూ అప్రోచ్ అయ్యా, అంతే కతమ్…. తమ్ముడు అనేసింది. నాకు అర్ధం కావడం లేదు. నాతో పాటు జాయిన్ అయిన బచ్చా గాళ్ళు అమ్మాయిలను వేసుకొని తిరుగుతున్నారు. అది ఎలా ఉంది అంటే. ఒక తాళం బుర్ర ఉంది. నెంబర్ లాక్ ఉంది, నేను తప్ప అందరూ ఎవరి లాక్ వాళ్ళు ఓపెన్ చేసి వెళ్ళిపోయారు.
ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్నాయి. ఆన్ లైన్ నుండి ఆఫ్ లైన్ దాకా ఎవరూ నాకు పడడం లేదు.
ఛీ దీనమ్మే ఇక నాకు పడరు లే అనుకుని ఎక్సామ్స్ కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఫోన్ లో ట్రింగ్ అంటూ మోగింది.
“హాయ్ క్రిష్… ఎక్సామ్స్ కి ప్రిపేర్ అయ్యావా….”
చచ్చిపోయింది. చదవాలి అన్న ఉత్సాహం, ఊపు మొత్తం పోయింది.
అమ్మాయే అయి ఉంటుంది. లేదు అయి ఉండదు. నాకే పంపారా… పేరు క్రిష్ అని పెట్టారు.
వద్దు వద్దు రిప్లై పెట్టొద్దు అని బలంగా అనుకున్నా.
క్రిష్ “ఎవరు మీరు?” వద్దు అనుకుంటూనే రిప్లై పంపించాను.
అటు నుండి కూడా రిప్లై వచ్చింది.
నెక్స్ట్ డే నా అప్రోచ్ కాలేజ్ లో మారిపోయింది. ఏ అమ్మాయిని నేను చూడడం మానేశాను. మాట్లాడాలని ప్రయత్నించడం మానేశాను.
సెమ్ ఎక్సామ్స్ అయిపోయాయి.
అమ్మాయిల వెంట తిరిగినా మా బ్యాచ్ నీచ కమీన్ కుత్తే గాళ్ళు అందరూ తప్పారు.
నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను.
నేను ఫోన్ లో ఎదో చేసుకుంటూ ఉంటే, మన బక్క సుందరి మోమిన్ వచ్చి “హాయ్ క్రిష్” అంది.
నేను ఫోన్ లో ఉండి పట్టించుకోలేదు. తను మళ్ళి “హాయ్ క్రిష్” అంది.
నేను తనను చూసి “హా… చెప్పూ” అన్నాను. తను నన్ను నవ్వుతూ చూసి “ఎన్ని మిగిలాయ్” అంది.
బోకడా మొహంది నన్ను కూడా దాని లెవల్ అనుకుంది.
నేను “ఆల్ పాస్” అంటూ దాని గుండెల్లో గునపం దించేసి ఫోన్ లో మెసేజ్ చేస్తున్నాను.
బక్కది “ఫోన్ లో ఎవరూ” అంది.
క్రిష్ “తను నిత్యా….”
బక్కది నన్ను చూస్తూ ఉంది.
క్రిష్ “నిత్యా…. నా గర్ల్ ఫ్రెండ్” అంటు లైన్ పూర్తి చేసి నవ్వాను.
దానికి కాలింది లేచి వెళ్ళిపోయింది.
ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికితే ఇదంతా అవుతుందా అంటే జరుగుతుంది. ఎందుకంటే నా మనసు అప్పటి వరకు ప్రశాంతంగా లేదు కాని అప్పుడు వచ్చింది. నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చినందుకు నేను పాస్ అవ్వలేదు. నా మైండ్ కూల్ అయినందుకు పాస్ అయ్యాను.
ఇక నిత్య విషయానికి వస్తే….
నిత్యాతో రోజు చాట్ చేసే వాడిని పగలు గూడా మార్నింగ్ తో మొదలు పెట్టి, రాత్రి గుడ్ నైట్ వరకు సుమారు వందలలో మెసేజెస్ ఎక్సచెంజ్ అయ్యేవి.
ఒక రోజు నాకు బట్టలు పంపింది.
అలా మా రిలేషన్ నెక్స్ట్ స్టెప్ కి తీసుకొని వెళ్లాం.
తన ఇష్టా ఇష్టాలు…. కష్టాలు అన్ని నాతొ చెప్పేది, నేను కూడా నాకు తెలిసింది చెప్పి, సహాయం చేసేవాడిని, సపోర్ట్ గా ఉండే వాడిని.
వాళ్ళ నాన్న తర్వాత నా మీదే తనకు నమ్మకం అని చెప్పింది.
మా అన్నయ్య కొడుకు ఫ్రెండ్ బర్త్ డే అని నాకు గుర్తు చేసి మరీ చెప్పించింది.
మా అన్నని బావ గారు అని, వదినని అక్క అని పిలిచేది. ఇక అమ్మానాన్నని అయితే తను అత్తమామ అని కూడా కాదు. తనకు కూడా అమ్మానాన్న అనే పిలుస్తాను అలానే చూస్తాను అని చెప్పింది.
అసలు ఒక అమ్మాయి నీ కోసం ఇంత సమయం స్పెండ్ చేస్తుంది… అంటే మనకు ఎంత బాగుంటుంది చెప్పండి.
సరిగ్గా అలాంటపుడు మా జీవితంలోకి విలన్ గాడు ఎంటర్ అయ్యాడు. …..రాజు….
సుమారు సంవత్సరం తనతో చాట్ చేస్తూ ఉంటే, అప్పుడు వచ్చాడు.
గుండె పగిలి పోయే న్యూస్ చెప్పాడు…
క్రిష్ “నిత్య అమ్మాయి కాదు”
నిషా “అబ్బాయా”
క్రిష్ “కాదు”
కాజల్ “అంటే… ఆ…”
క్రిష్ “ఆ… కూడా కాదు”
నిషా “మరీ…”
క్రిష్ పైకి లేచి దీర్గంగా శ్వాస తీసుకొని చెప్పాడు. “వాళ్ళు ఒక గ్రూప్… ముగ్గురు వ్యక్తులు… ఒక గ్రూప్”
నిషా “అదేంటి నిత్య అంటే ఒకళ్ళు కాదా”
కాజల్ “ముగ్గురు ఏంటి?”