కాజల్ “అడుగు…”
క్రిష్ “సరే… నీకూ….”
కాజల్ “ఒక్క నిముషం…. కరక్ట్ గా చెబితే నాకేంటి… ”
క్రిష్ “నువ్వు చెప్పలేవు…”
కాజల్ “చెబితే…”
క్రిష్ “ఆల్రైట్ నేనూ…. పెళ్లి చేసుకోనూ… కానీ ఒక వేళ చేసుకునే పరిస్థితి వస్తే…. నిన్ను తప్ప ఇంకేవారిని చేసుకోనూ” అన్నాడు.
కాజల్ నవ్వేసి “సరే” అంది.
క్రిష్ “ఈ ప్రపంచంలో నువ్వు ప్రేమించే ఇద్దరి పేర్లు చెప్పూ”
కాజల్ “అదీ…”
క్రిష్ “రెండు నిముషాలు ఆగాలి”
కాజల్ “హుమ్మ్”
క్రిష్ “రెండు నిముషాలు బాగా ఆలోచించి చెప్పూ”
కాజల్ “అవసరం లేదు… జవాబు నాకు తెలుసు”
క్రిష్ “నువ్వు కచ్చితంగా సరైన సమాధానం చెప్పలేవు”
కాజల్ “నేను ఎవరినో ప్రేమిస్తున్నానో నాకు బాగా తెలుసు”
క్రిష్ “చూద్దాం”
కాజల్ “చెప్పేదా… రెండు నిముషాలు అయిపోయాయ్”
క్రిష్ “ఇంకొక్క ఇరవై సెకన్లు”
కాజల్ “పది.. తొమ్మిది.. ఎనిమిది…”
క్రిష్ “చెప్పూ..”
కాజల్ “ఒకటి నువ్వు…. రెండోది నా చెల్లెలు” అని కరక్ట్ చెప్పినందుకు సెలబ్రేషన్ ఫీల్ లో ఉంది.
క్రిష్ “ఇంకో సారి ఆలోచించుకో….”
కాజల్ “నీ పేరు ముందు చెప్పాలనే కూడా అనుకున్నావ్… చెప్పాను… కదా…”
క్రిష్ “ఇంకో సారి ఆలోచించుకో….”
కాజల్ “ఒకటి నువ్వు…. రెండోది నా చెల్లెలు….. ఇంతే లాక్….”
క్రిష్ “నువ్వు తప్పు చెప్పేసావ్”
కాజల్ “వాట్…”
క్రిష్ “ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించాల్సింది…”
కాజల్ “అమ్మ… కాని మా అమ్మ బ్రతికి లేదు…
దేవుడా… అది భక్తీ ప్రేమ కాదు…
కెరియర్ అంటావా… అది నేనేం వదలను….”
క్రిష్ “ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించాల్సింది… నిన్ను నువ్వు”
కాజల్ “నన్ను నేనా…”
క్రిష్ “అవునూ…”
కాజల్ “అదేంటి?”
క్రిష్ “నిన్ను నువ్వు ప్రేమించుకోక పోవడం వల్లే…. నిన్ను నువ్వు తగ్గించుకోవడం వల్లే…. ఆ వివేక్…. నీ మాజీ భర్త నిన్ను కొడుతుంటే సైలెంట్ గా ఉన్నావ్… అతను నిన్ను తిడుతుంటే భరించావ్.. అదే నిన్ను నువ్వు ప్రేమించుకొని ఉంటే…. నీ వంటి పై దెబ్బ పడనిచ్చే దానివి కాదు… అసలు తప్పు లేకుండా మాట పడే దానివి కాదు”
కాజల్ “…”
క్రిష్ “నీ సమస్యలో వివేక్ ది ఎంత తప్పు ఉందొ… నీది కూడా అంతే తప్పు ఉంది”
కాజల్ “నా తప్పా”
క్రిష్ “నిన్ను నువ్వు ప్రేమించుకోక పోవడమే…. నీకూ నువ్వు వాల్యు ఇచ్చుకోక పోవడమే నువ్వు చేసిన తప్పు…. నువ్వు చేసింది త్యాగం కాదు… నీకూ నువ్వు చేసుకున్న ద్రోహం… మొదటి రోజే నువ్వు బయటకు వచ్చి చెప్పి ఉంటే… ఆగి పోయేది కదా…. ఏంట్రా కొడుతున్నావ్… టీవిలో కానీ…. మీడియాలో కానీ…. చెప్పేస్తా అంటే… ఊరుకుంటాడు కదా… ”
కాజల్ “…”
క్రిష్ “నిన్ను టార్చర్ పెట్టినందుకు ఆ వివేక్ ది ఎంత తప్పు ఉందొ…. నిన్ను నువ్వు తగ్గించుకున్నందుకు నీ తప్పు కూడా అంత ఉంది”
కాజల్ “నేను గాంధి గారి ఫాలోవర్ ని ఒక చెంప….”
క్రిష్ “నోరు ముయ్యి…. గాంధి గారి …. అంట”
కాజల్ “…”
క్రిష్ “ఆయన బలహీనంగా ఉండమనో…. కొట్టుకోండి మీ ఇష్టం అనో చెప్పలేదు…. సరే… కొట్టుకో…. ఇంత కంటే ఏం చేయగలవ్…. అయిపోయాక నేనేం చేస్తానో చూపిస్తా… అనే ఒక చూపు చూస్తూ రెండో చెంప జాపాడు. టోటల్ ఇండియా కదిలి వచ్చింది దండి మార్చ్ కి… ,మీ బలహీనత కప్పి పుచ్చుకోవడానికి ఆయన పేరు చెప్పకండి”
కాజల్ తల దించుకొని ఆలోచిస్తుంది.
46. పందెం గెలిచావ్
కాజల్ ఆలోచించింది తను సరిగ్గా రియాక్ట్ అయి ఉంటే బహుశా…. ఇంత దూరం వచ్చేది కాదేమో అని ఆలోచిస్తూ ఉంది.
క్రిష్ ఇంకేం మాట్లాడకుండా ఆమెను చూస్తూ ఉన్నాడు.
ఇంతలో వెనక నుండి ఒక పెద్దావిడ “ఇలా ప్రపంచంలో నిన్ను నువ్వు తప్ప ఇంకేవారిని ప్రేమించాక పోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి” అంది.
క్రిష్ “అదే కరక్ట్”
పెద్దావిడ “అలా అయితే నువ్వు సన్యాసివి అవ్వాలి… సన్యాసివా” అంది.
కాజల్ తలవంచుకొని నవ్వింది.
క్రిష్ కోపంగా కాదు అన్నాడు.
పెద్దావిడ “నీ మాటలు వింటూ ఉంటే ఎవరో నిన్ను బాగా సంక నాకిచ్చారు అని అర్ధం అవుతుంది” అంది.
క్రిష్ తల దించుకొని మళ్ళి పైకెత్తి తల ఊపుతూ “మోసపోయాను” అన్నాడు.
పెద్దావిడ “అందుకని ఎవరినీ నమ్మలేక పోతున్నావ్…”
క్రిష్ “నమ్మను…. ఎవరినీ ఎప్పటికి నమ్మను” అని కసిగా అన్నాడు.
కాజల్ “కాని క్రిష్” అంది.
క్రిష్ “చూడు… నిజమే… నేనేమి ఎక్కడో కొటేషన్ చదివి చెప్పలేదు…. ఒకప్పుడు నీలాగే నేను కూడా ఉన్నాను. పరితపించాను, ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో నా జీవితం పెట్టి మోసపోయాను. అందుకే అలా ఉండదలుచుకోలేదు. కాని నువ్వు… ఒక సారి పడ్డావ్… నన్ను చూసి మళ్ళి పడడానికి సిద్దం అవుతున్నావ్” అన్నాడు.
పెద్దావిడ “ఆ అమ్మాయి కరక్ట్ గానే ఉంది. నువ్వు తిక్కల తిక్కలగా ఉన్నావ్”
క్రిష్ “ఏం తప్పు… ” అన్నాడు.
పెద్దావిడ “ఒకరి చేతిలో మోస పోయి మొత్తం అంతా ఇలానే ఉంటుంది అనుకుంటే ఎలా….”
క్రిష్ “అసలు అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే సరిపోదా….”
పెద్దావిడ “అక్కడ బియ్యం ఒకే సారి కడుగుతాం… ఒకే సారి పొయ్యి మీద పెడతాం… ఒకే సారి ఉడుకుతుంది… అందుకే ఒక మెతుకు చూసి మిగిలినవి ఎలా ఉంటాయో అంచనా వేస్తాం… కాని నిన్ను ఒక అమ్మాయి మోసం చేసింది కదా….. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకే పరిస్థితుల్లో పెరిగారా…. ఒకేలా ఆలోచిస్తారా… ఒకేలా ఉంటారా… అసలు నిన్ను చూసి ఆ అమ్మాయికి కోరిక పుట్టింది తీర్చుకొని పోయింది… ఈ అమ్మాయికి ప్రేమ పుట్టింది నీతో ఉంటా, కలిసి నడుస్తా అంటుంది…. రెంటికి తేడా లేదా…” అంది.
క్రిష్ “…”
పెద్దావిడ “ఆలస్యం అమృతం విషం అని చెప్పిన మనుషులే….. నిదానమే ప్రధానం అని కూడా చెప్పారు…. ఎక్కడ ఏది వాడాలో తెలుసుకోవడమే జ్ఞానం” అంది.