కాలేజ్ బాయ్ Part 8 57

క్రిష్ “ముందు తిందాం రండి” అన్నాడు.

ఇద్దరూ మళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు.

59. నీకూ ఏమనిపిస్తుంది?

హుస్సేన్ సాగర్…. మధ్యలో బుద్ధ విగ్రహం… ట్యాక్ బండ్…. నక్లెస్ రోడ్… రొమాంటిక్ వాతావరణం…

కాజల్, క్రిష్ చేతులను పట్టుకొని లాక్కొని వెళ్తుంది.

క్రిష్ “ఎందుకు ఇటూ తీసుకొని వచ్చావ్…. మీ చెల్లికి కనపడక పోతే గొడవ చేస్తుంది”

కాజల్ “అదేం చిన్నపిల్ల కాదు… మనం దొరక్క పోతే…. ఫోన్ చేస్తుంది”

క్రిష్ “సరే…”

కాజల్ “నువ్వు రా….” అంటూ అతని చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంది.

క్రిష్ “ఎక్కడికి… అటూ… ఇటూ… ఇప్పటికే మూడు సార్లు తిప్పావ్…”

కాజల్ “హుమ్మ్… ఇక్కడ బాగుంది ఇక్కడ నిలబడదాం”

క్రిష్ “హుమ్మ్” అని ఇద్దరూ నిలబడి సాగర్ కాంతులను, అందాలను చూస్తున్నారు.

కాజల్ “ఇవ్వాళ చాలా……… బాగుంది. కదా…”

క్రిష్ “హుమ్మ్,,,,,, చల్లగా ఉంది.”

కాజల్ “క్రిష్..”

క్రిష్ “హుమ్మ్…”

కాజల్ “నిన్నొకటి అడగాలి”

క్రిష్ “అడుగు”

కాజల్ “సమాధానం నన్ను చూస్తూ,, నా కళ్ళలోకి చూస్తూ చెప్పాలి”

క్రిష్ తల తిప్పి ఆమెను చూశాడు. ఆ స్ట్రీట్ లైట్ కాంతులు మరియు అక్కడ అప్పుడప్పుడు వెళ్ళే వెహికల్స్ హెడ్ లైట్ కాంతులలో ఆమె మొహం సంతోషంతో పెరిసిపోతుంది.

క్రిష్ ఆమె అందాన్ని చూస్తూ అలాగే ఒక క్షణం ఉండిపోయాడు, వెంటనే తల పక్కకు తిప్పుకొని “అడుగు…. నీ కళ్ళలోకి చూసి చెబుతాను” అన్నాడు.

కాజల్ వచ్చిన దగ్గర నుండి అతన్నే చూస్తుంది, అతన్ని కూడా తననే చూడమని తన గురించి మాట్లాడమని, తన డ్రెస్, తన అందం, అతని ముద్దు కోసం అర్రులు జాస్తున్న ఆమె పెదవుల గురించి మాట్లాడమని తన కళ్ళతో చెబుతుంది.

కాని వచ్చిన దగ్గర నుండి క్రిష్ ఆమెను తప్ప మిగిలిన ప్రపంచం చూస్తున్నాడు.

కాజల్ “నా కళ్ళలోకి చూడు…. అడగడం మొదలు పెడతాను… రెండు నిముషాలు టైం ఇస్తాను… అప్పటి వరకు కూడా నన్నే చూడాలి… రెండు నిముషాలు తర్వాత సమాధానం చెప్పాలి… నువ్వు గెలిస్తే….”

క్రిష్ చిన్నగా నవ్వేసి “ఆమె వైపు చూసి సరే అడుగు…” అన్నాడు.

కాజల్ “నన్ను చూడు” అంది.

క్రిష్ ఆమెను చూస్తూ “హుమ్మ్…. చూశా….”

కాజల్ “ఇలా పై నుండి కింద వరకూ…. ముందు వెనక…. మొత్తం చూడు….”

క్రిష్ ఆమెను చూస్తూ నవ్వి “హుమ్మ్…. చూస్తా…. నీ ప్రశ్న ఏంటి?”

కాజల్ “ప్రశ్న అదే…. రెండు నిముషాల పాటు నన్ను చూస్తూ ఉండి… ఆ తర్వాత నీకూ నన్ను ఎక్కడెక్కడ ఏం చేయాలని అనిపిస్తుందో….. చెప్పూ” అంది.

క్రిష్ ఆమెను చూస్తూ నవ్వి “సరే స్టార్ట్” అన్నాడు.

కాజల్ ని చూస్తూ ఉన్నాడు.

క్రిష్ మనసులో “ఏమని చెప్పను… ఎలా చెప్పను…. చూసిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకూ నా మనసు నుండి వెళ్లి పోవడం లేదు… అందం… అభినయం… అన్నింటికి మించి ఆమె దైర్యం… పక్కనే ఉన్నా ఏమనుకుంటుందో అని, ఆమెను చూడలేక పోతున్నాను. అందానికి మించిన అందం నా పక్కనే ఉన్నా…. తన చూపుతో చూపు కలప లేక పోతున్నాను. నా గుండెలో గుచ్చేసే తన నవ్వు… ఆరాటంగా ఆక్రమించుకోవాలనిపించే తన బ్యాక్… ఎలా చెప్పను… అందంగా ఉన్నావ్ అని చెప్పినా బహుశా అది అబద్దమే అవుతుంది… ఎందుకంటే తను అందంగా లేదు… అంతకు మించి…. అప్సరసలా ఉంది”

అతని చూపులు ఆమెను తినేస్తు ఉంటే…. అతని ఊపిరి భారం పెరగడం చూస్తూ ఉంది….. రెండు నిముషాలు గడవక ముందే…. “చెప్పూ” అంది.

క్రిష్ తల దించుకొని “ఏం చెప్పాలి” అన్నాడు. అవునూ ఆమె అందం అతని మనసును నిపేసింది.

కాజల్ “నేన్ను ఏం చేయాలని అనిపిస్తుంది”

క్రిష్ తల దించుకున్నాడు.

కాజల్ అతనికి దగ్గ్రరగా నించొని “ఇప్పడు చెప్పూ…. చిన్నగా” అంది.

క్రిష్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ “ఎలా ఇంత అందంగా పుట్టావ్…. ”

కాజల్ “తల దించుకుంది”