61. సారోచ్చారు…
అప్పటికే ఫుడ్ సర్వ్ చేసి ఉంది. క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ ఒకరికొకరు నోట్లో పెట్టుకుంటున్నారు. తను రాగానే ఆపేశారు
నిషా మనసులో కాజల్ చెప్పిన విషయం, క్రిష్ పొద్దున్న నిత్య గురించు చెప్పినపుడు నవ్వుతూనే మధ్యలో ఒక అర సెకను బాధగా మొహం పెట్టి మళ్ళి నవ్వాడు. అని గుర్తుకు వచ్చింది.
నిషా తింటూనే “క్రిష్…. నీకొకటి చెప్పాలి” అంది.
క్రిష్ “చెప్పూ” అన్నాడు.
నిషా “నిత్య గురించి….”
క్రిష్ గొంతులో మార్పు వచ్చింది “హమ్ చెప్పూ” అన్నాడు.
నిషా, తన అక్క చెప్పిన విషయం నిజమే అని అర్ధం చేసుకుంది, వెంటనే తను ఏం చెప్పాలో అది చెప్పడం మొదలు పెట్టింది.
నిషా “మనం మొన్న నిత్యని కలిశాం కదా…”
క్రిష్ “హుమ్మ్”
నిషా “నిజానికి నిత్య చాలా సేపటి నుండి అక్కడే ఉంది…. నేను ఏమిటా ఈ అమ్మాయి మన వైపే చూస్తుంది…. అనుకున్నా… తర్వాత నువ్వు అక్క క్లోజ్ గా ఉండడం చూసి, ఎదో విలన్ లా నవ్వుకుని… మన టేబుల్ దగ్గరకు వచ్చింది” అంది.
క్రిష్ నమ్మలేనట్టుగా “వాట్” అన్నాడు.
నిషా “నా ఉద్దేశ్యం… తను నిన్ను మర్చి పోలేక రాలేదు…. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉన్నావని… నీ మీద కోపంతో… అవి నీకూ దూరం చేద్దామని వచ్చింది”
క్రిష్ బిత్తరపోయినట్టు మొహం పెట్టాడు. కాజల్ “అవునా…” అని నోరు తెరిచింది.
క్రిష్ కోపంగా మారిపోయి “నిజమే అయి ఉంటుంది…. పైగా తను ఆ హనీ ట్రాప్ లు చేయడం కూడా మానలేదు అంట నేను కూడా విన్నా…. నా లాంటి వాళ్ళు ఎంత మందో ఉండి ఉంటారు” అని కసిగా అన్నాడు.
నిషా “మా అక్క కాబట్టి ఆ రోజు నీ తరుపు ఉంది… అదే వేరే ఎవరైనా అయితే వదిలేయడమో… నీతో గొడవపడడమో చేసే వాళ్ళు” అంది.
క్రిష్ ప్రేమగా కాజల్ వైపు చూశాడు.
కాజల్ అతని చేతి పై చేయి వేసింది.
బిల్ పే చేసి బోటు దిగి కారు ఎక్కారు, ఇంటికి వెళ్ళడం కోసం…
నిషా కారు నడుపుతూ ఉంటే, కాజల్ తన పక్కన కూర్చొని ఉంది. క్రిష్ వెనక సీట్ లో కూర్చొని ఉన్నాడు.
క్రిష్ అద్దంలో కాజల్ ని చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ ఉంటే… కాజల్ సిగ్గు పడి పోతుంది.
డ్యూయెట్ లు కూడా పాడేసుకుంటూన్నారు.
నిషా వాళ్ళను చూసి తల అడ్డంగా తిప్పి…. విసుగ్గా… గట్టిగా కార్ హార్న్ కొట్టింది.
ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు.
నిషా “అవునూ… అసలు నిత్యకి నీ ఫోన్ నెంబర్ ఎలా తెలుసు” అంది.
క్రిష్ “ఏమో” అంటూ ఆలోచనలో పడిపోయాడు.