కాలేజ్ బాయ్ Part 9 30

కాజల్ “సరే.. బాయ్…”

కాజల్ “ఏంటి? లవ్ యు చెప్పాలా…. నేను చెప్పను” అని ఫోన్ కట్టేసింది.

సుహాస్ “హుమ్మ్… మొత్తానికి పాపం చిన్న పిల్లాడిని చేసి ఆడిస్తున్నావ్..”

కాజల్ నవ్వడం ఆపేసి “సుహాస్… అదీ… అదీ… అతను నా కంటే చిన్నవాడే…”

సుహాస్ “ఓహ్… జాబ్ చేస్తున్నాడా…. పోనీ… బిజినెస్…”

కాజల్ తల దించుకొని “ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు”

సుహాస్ “వాట్…”

కాజల్ “లవ్ బ్రేక్ అయ్యాడు…. నా గురించి కూడా చెప్పాను…. ఇద్దరి మనసులు కలుసుకున్నాయి”

సుహాస్ “హుమ్మ్”

కాజల్ కంగారుగా “ఓకే కదా” అంది. సుహాస్ పర్మిషన్ అవసరం లేదు కాని బయట వాళ్ళు ఎలా చూస్తారో అన్న భయం ఉంది.

సుహాస్ “మంచి వాడే కదా”

కాజల్ “చాలా మంచి వాడు…. వాళ్ళ ఆంటీకి కూడా మా విషయం తెలుసు…. ఆవిడ కూడా గ్రీన్ సిగ్నల్ యిచ్చింది”

సుహాస్ “ఓహ్… మరి మీ సిస్టర్…”

కాజల్ “తనకు కూడా ఓకే”

సుహాస్ “అతను…. అంటే… ఫ్యూచర్…”

కాజల్ “ఆ ప్రాబ్లం లేదు… మెరిట్… మంచి మేచ్యురిటి ఉన్నవాడు…. అయినా నేను ఉంటా కదా…” అంది.

సుహాస్ “అలా…. తనకు ఓకే నా….”

కాజల్ కొంచెం భయంగా “మ్మ్” అని తల ఊపింది.

సుహాస్ “ముందు ఒకరిని ఒకరు అర్ధం చేసుకోండి. తర్వాత మిగిలిన సంగతులు…..

కాజల్ తల ఊపుతూ అక్కడ నుండి లేచి వెళ్లి వర్క్ లోకి కూర్చుంది.

క్రిష్ నుండి మెసేజ్ “ప్రియాతి ప్రియమైన ప్రేయసికి….. మీ ప్రేమికుడు వ్రాయునది ఏమనగా…. ఐ లవ్ యు సో మచ్….. ఈ మెసేజ్ అందుకున్నారని ఆశిస్తూ…. మీ ప్రేమ ఖైది”

కాజల్ ఆ మెసేజ్ చూస్తూ “మీ టూ” అని మెసేజ్ చేసి వర్క్ లోకి వెళ్ళిపోయింది.

ఆ కన్వర్సేషన్ మొత్తం…. ఈషా విని సుహాస్ దగ్గరకు వెళ్లి “మీ పద్దతి ఏం బాలేదు సర్…. పెళ్లి అయినా ఆమ్మాయికి ఎఫైర్ పెట్టుకోమని ఎలా చెబుతారు” అంది.

సుహాస్ “ఎక్సక్యూజ్ మీ” అన్నాడు.

మిగిలిన కొంత మంది కొలీగ్స్ కూడా వాళ్ళ మాటలు విన్నారు వాళ్ళు కూడా సుహాస్ వైపు చూస్తూ “అవునూ సర్…. ఆమెకు మీ సపోర్ట్ వద్దు.. తన లాంటి క్యారక్టర్ లెస్ మనుషులతో మీరు ఉండొద్దు” అన్నారు.

సుహాస్ “ప్చ్” అని విసుక్కొని అందరిని రమ్మని కాఫీ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు.

కాజల్ వాళ్ళను పట్టించులేదు. వాళ్ళ మాటలు వినలేదు. చెవిలో మ్యూజిక్ వింటూ వర్క్ చేసుకుంటూ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *