సిటీ లో ఉండే పెద్ద మనుషులు తరచూ వెళ్ళే క్లబ్ అది..
బాగా డబ్బు ఉన్న వారి పెళ్ళాలు,ఆఫీసర్లు ఆ రోజు కూడా అలాగే కలుసుకున్నారు.
కొందరు జిమ్ లో వర్కవుట్ లు చేస్తుంటే కొందరు బార్ లో తాగుతున్నారు.
ఏదైనా ఫంక్షన్ చేసుకోడానికి సరిపోయేలా అన్ని ఏర్పాట్లు ఉంటాయి ఆ ఇరవై ఎకరాల క్లబ్ లో.
“క్లబ్ కి కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకోవాలి”అన్నాడు జాన్.
అతను బిజినెస్ మాన్…వాల్ల తాత ల కాలం నుండి ఆ క్లబ్ లో మెంబర్ షిప్ ఉంది..
“ఆఫ్కార్స్ ఈ సారి నేను కూడా పోటీ చేస్తాను”అంది మాలిని.
ఈమె ఒక హీరోయిన్..ప్రస్తుతం పెద్ద సినిమాలు లేక..చిన్న చిన్న…b గ్రెడ్ సినిమాలు చేస్తోంది..
ఇద్దరు డబ్బు ఉన్న వారిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది..మూడేళ్ల గ్యాప్ లో.
వాళ్ళు భరణం కింద ఇచ్చిన కోట్ల డబ్బు ఉంది..మేడం వద్ద.
ఆ హల్ లో ప్రతి టేబుల్ వద్ద ముగ్గురు నలుగురు కూర్చుని ఉన్నారు తాగుతూ తింటూ..
అందరూ మెంబెర్స్ కాదు..కొందరు కేవలం అతిథులు కూడా ఉన్నారు.
ప్రస్తుత ప్రెసిడెంట్ ఇబ్రహీం ఇస్తున్నాడు ఈ పార్టీ..
“ఏది ఏమైనా రెండేళ్లుగా నేను ప్రెసిడెంట్ గా ఉండటానికి మీరు సహకరించడం సంతోషకరం”అన్నాడు.
కొద్ది సేపటికి మ్యూజిక్,డ్యాన్స్ అన్ని మొదలు అయ్యాయి.
“మీ అబ్బాయి ఎందుకు ఎప్పుడు..అల దూరం గా కూర్చుని ఉంటాడు.. సమీర గారు”అన్నాడు ఇబ్రహీం..
ఆమె వస్తున్న ఇబ్బంది ఆపుకుంటూ”పదహారేళ్ళ టీనేజ్..ఏదో మొహమాటం”అంది సమీరా.
ఆమె కొడుకు తపన్ దూరం గా ఒక మూల కూర్చుని..ఎవరు చూడకుండా కొకైన్ పీలుస్తూ ఉన్నాడు..
“ఇక మనం వెళ్దామా”అడిగింది తల్లి..తనకొడుకు లాయర్..అజయ్ ను..
“అరే వీళ్లలో కొందరు నాన్నగారికి క్లైంట్స్..కొద్ది సేపు ఉందాం”అన్నాడు అజయ్..
అతను చుట్టూ చూసాడు..మాధవి కోసం..
వేరే టేబుల్ వద్ద కూర్చుని..ఎవరితోనో మాట్లాడుతూ…అజయ్ ను చూసి నవ్వింది ఆమె..
అది గమనించి”నువ్వు దాన్ని ఇంకా ప్రేమిస్తున్నావా.. వేస్ట్..అది ఇంకోడిని పెళ్లి చేసుకుంది..వాడు ఆక్సిడెంట్ లో చనిపోయాడు..అది నిన్ను పెళ్లి చేసుకోదు..
ఎందుకంటే నువ్వు మిడిల్ క్లాస్..కేవలం నాకు ఇక్కడ కొందరు క్లయింట్ లు ఉండటం వల్ల నువ్వు కూడా వచ్చావు”అన్నాడు తండ్రి అజయ్ తో..
ఆ క్లబ్ లో యాభై ఏళ్లుగా పని చేస్తున్న గుప్త..ను చూసి దగ్గరికి వెళ్లింది మాధవి.
“రండి అంకుల్ డ్యాన్స్ చేద్దాం”అని..ఆయన తో కలిసి డ్యాన్స్ చేసింది కొద్ది సేపు..
అది చూసి”గుప్త కి డెమ్నిసియా వచ్చింది..రెండేళ్లుగా..అన్ని మర్చిపోతున్నాడు “అన్నాడు అది చూసిన ఇబ్రహీం..
వారం రోజుల తర్వాత ఉదయం క్లబ్ లో కలిశారు మాధవి,సమీరా,rinki ఆంటీ.
“నేను జిమ్ చేసి వారం అవుతోంది”అంది రింకీ ఆంటీ.
“మీరు తాగడం తగ్గించాలి..”అంది మాధవి.
ముగ్గురు జిమ్ లోకి వెళ్లి..ఫ్రిజ్ లో తెచ్చుకున్న జ్యూస్ బాటిల్స్ పెట్టీ..”ఈ ట్రైనర్ జావేద్ గాడు ఎక్కడ”అంటూ చుట్టూ చూశారు.
“ఎందుకు మీ ఇద్దరు ఆ జావేద్ గాడి కోసం చూస్తున్నారు..ఇంకా ఇద్దరు ఉన్నారు కదా”అంది రింకి.
సమీరా,మాధవి ఇద్దరు జవాబు ఇవ్వకుండా జిమ్ మొత్తం చూస్తూ..ఒక చోట జావేద్ డెడ్ బాడీ చూసి”కెవ్వ్ “అంటూ అరిచారు..
****
***
కొద్ది సేపటికి ఈ విషయం లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్ కి తెలిసి ఆ ఎలైట్ క్లబ్ కి వచ్చారు.
ఈ విషయం కమిషనర్ కి తెలిసి..
సీఐడీ చీఫ్ కి ఫోన్ చేసాడు..”చూడు బ్రో..ఆ క్లబ్ లో అందరూ పెద్ద మనుషులు..నువ్వు మీ వాడిని ఎవినైన పంపు..లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్ కి హెల్ప్ గా”అని చెప్పాడు.
చీఫ్ విసుక్కుంటూ శృతి కి ఫోన్ చేసాడు..
“ఏమిటి అమ్మాయ్ ఏమి చేస్తున్నావు”అడిగాడు..
శృతి “ఇప్పుడే పూజ అయ్యింది..సర్..టిఫిన్ తయారు చేస్తున్నాను”అంది.
“ఎలైట్ క్లబ్ లో ఏదో డెడ్ బాడీ ఉంది ట..మన హెల్ప్ అడిగారు వెళ్ళు”అని ఫోన్ పెట్టేసాడు.
శృతి కొద్ది సేపటికి సల్వార్ , కమీజు వేసుకుంటూ”వాడిని మీరు దింపండి..కాలేజ్ వద్ద..నాకు పని వచ్చింది”అంది.
“ఏమైంది “అడిగాడు.
ఆమె స్కూటీ కీ తీసుకుని బయటకు వెళ్తూ”ఏదో బాడీ దొరికింది ట”అంది..
శృతి స్కూటీ మీద ఆ క్లబ్ గేట్ వద్దకు వెళ్ళేసరికి..ఇంకో అరగంట పట్టింది.
ఆమె id కార్డు చూసి గేట్ తెరిచారు..గార్డ్స్.
లోపల జిమ్ దగ్గరకి వెళ్ళడానికి స్కూటీ మీద రెండు నిమిషాలు పట్టింది..
చాలా మంది బయట చెట్ల కింద టేబుల్స్ ముందు కూర్చుని..జ్యూస్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు..
చలి కాలం కావడం తో..వాతావరణం లో వేడి లేదు..
ఆమె జిమ్ లోకి వెళ్లి లోకల్ si ను కలిసింది..
“వీడు పడుకుని ..చేతులతో ఈ రాడ్ ను పైకి కిందకి ఊపుతూ ఎక్సర్సైజ్ చేస్తుంటే..అది కిందపడినట్టుంది..
రెండు వైపులా బరువు ఉండేసరికి మెడ మీద ఒత్తిడికి..ఎముకలు విరిగి చనిపోయాడు”అన్నాడు .
శృతి కూడా ఫోటోలు తీసుకుని”పోస్ట్ మార్టం కోసం పంపండి”అంది.
తర్వాత బయటకి వచ్చి”మీరేనా ప్రెసిడెంట్..ఫస్ట్ ఎవరు చూశారు”అడిగింది ఇబ్రహీం ను.
“సమీరా,మాధవి, రింకు ఆంటీ చూశారు..ఆ టేబుల్ ముందు కూర్చుని..జ్యూస్ తాగుతున్నారు “అన్నాడు.
ఆమె అటు వెళ్తుంటే”ప్లీజ్ మేడం..ఇక్కడ అందరూ డబ్బున్న..గొప్పవారు..కొంచెం చూసుకుంటూ మాట్లాడండి “అన్నాడు..
శృతి వెళ్లి కూర్చుని”హై I am శృతి “అంది..
“ఓహ్ నాపేరు రిన్కు..నా హస్బెండ్ కి రెండు ఫ్యాక్టరీ లు ఉన్నాయి..”
“నా పేరు సమీర..”.
“నా పేరు మాధవి..”
“ఓహ్ జావేద్ గారు..అన్యాయం గా చనిపోయారు”అంది శృతి వాటర్ తాగుతూ.
“యా..వెరీ నైస్ మాన్”అంది మాధవి.
“ఎలా జరిగి ఉంటుంది”అంది శృతి.
“ఏమో మేడం..మేము వచ్చేసరికి ఇలా ఉన్నాడు”అంది సమీరా.