హాట్ అండ్ స్పైసీ End

నేను లాస్ట్ టైం ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత నా తర్వాత ప్లాన్లు గురించి ఒకరోజు బాలతో డిస్కషన్ పెట్టుకున్నాను. ఇప్పుడు కాంట్రాక్టుల ద్వారా సంపాదించిన డబ్బులో మున్నాగాడి వాటా వాడికి వదిలేసి మాకు వచ్చిన సొమ్ముతో ఇక్కడ కొంత ఆస్తులు ఏర్పాటు చేసుకునే ఆలోచన చేశాను. ఎందుకంటే ఈ కంపెనీ ఇప్పుడే ప్రారంభమవుతుంది ముందు ముందు కాలం గడిచే కొద్ది ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇలాంటి పెద్ద కంపెనీలు ఏర్పాటైనప్పుడు వాటి చుట్టుపక్కల చిన్నచిన్న అనుబంధ కంపెనీలు ఏర్పడటం సహజం. అందుకు ల్యాండ్ అనేది చాలా ముఖ్యమైన అవసరం అందుకే ఇప్పుడే వీలైనంతవరకు ల్యాండ్ కొని పెట్టుకుంటే ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందనేది నా ఆలోచన.

మాకు మెయింటెనెన్స్ కాంట్రాక్టులు దక్కి నా ఉద్యోగం పోయినా మేము ఇక్కడికి వచ్చి స్థిరపడి ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం యధాతధంగా ఉంటే మేము చందకలో ఉంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కాంట్రాక్ట్ పనులు పర్యవేక్షణ చూసుకోవడానికి కూడా వీలవుతుంది. ఈ విషయంలో మాకు అత్యంత ఆప్తులైన నవాబు గారి సహకారం కూడా ఉంటుందని ఇలా ఆలోచించాను. అదే విషయాన్ని బాలతో డిస్కస్ చేయగా తను అంతా విని, మీరేం చేస్తారో మీ ఇష్టం మీరు ఏం చేసినా నాకు ఓకే,,, అని సింపుల్ గా తేల్చి చెప్పేసింది. నా ఢిల్లీ ట్రిప్ కోసం బాసుల దగ్గర నుంచి పిలుపు కంటే ముందు నవాబు గారు ఫారిన్ నుంచి రిటర్న్ వచ్చారు. అప్పుడు నేను అనుకుంటున్న విషయం గురించి ఒకరోజు ఆయనతో కూర్చొని వివరంగా డిస్కస్ చేశాను.

అందుకు ఆయన కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, మంచి ఆలోచన చేసుకున్నావు అని మెచ్చుకొని కంపెనీకి దగ్గరలో ఉండే ప్రాంతాల్లో భూముల గురించి ఎంక్వయిరీ చేపించి తొందరగానే నీ కోరిక తీరేటట్టు చేస్తానని మాట ఇచ్చారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా ఇటువంటి ఆలోచన ఉన్నట్టు నా దగ్గర ప్రస్తావించారు. వాళ్లకి ఆల్రెడీ మీట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ నడుపుతున్న అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏర్పడుతున్న కంపెనీకి అనువైన విధంగా మరొక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసి ఈ ప్రాంతం మీద తమకు ఉన్న పట్టు మరింత పటిష్టం చేసుకోవాలని అలాగే తమ ప్రాంత వాసుల కోసం తామే ఉద్యోగాలు కల్పించే విధంగా అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ కంపెనీ మీద పూర్తి అవగాహన ఉన్న నేను వాళ్లతో భాగస్వామిగా చేరితే మరింత ఉపయోగం ఉంటుంది కాబట్టి అది కూడా ఆలోచిద్దామని నాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఆయన చెప్పినట్టే సరిగ్గా వారం రోజుల్లో కంపెనీకి దగ్గర్లో ఉన్న ఒక 30 ఎకరాల భూమిని చాలా తక్కువ ధరకు చూపించారు. మా కాంట్రాక్టులకు సంబంధించి ఫైనల్ బిల్లులు ఇంకా రావలసి ఉన్నప్పటికీ ఇప్పటిదాకా సమకూరిన డబ్బుతో ఆ భూమి కొనుగోలుకు సిద్ధమయ్యాను. సరిగ్గా అదే సమయానికి నాకు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో భూమి కొనుగోలుకు సంబంధించిన పనులన్నీ పూర్తిగా నవాబు గారికి వదిలేసి మున్నా గాడిని దగ్గరుండి చూసుకోమని బాధ్యతలు అప్పజెప్పి ఢిల్లీకి ప్రయాణమయ్యాను. ఈ ట్రిప్పు సుమారు అయిదారు రోజులు ఉంటుంది పైగా ఆ విశ్వేశ్వర్ గాడితో ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని బాల కొంచెం ఆందోళన చెందడంతో ఏం జరిగినా మన మంచికే అని తనకు ధైర్యం చెప్పి వివరాలతో రెడీగా ఉన్న కొంతమంది స్టాఫ్ తో కలిసి ఢిల్లీకి చేరుకున్నాను.

కంపెనీ నిర్మాణం కొలిక్కి వచ్చిన తర్వాత ఇటువంటి మీటింగులు సాధారణమే. ఈ విషయంలో నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి టెన్షన్ లేకుండా ప్రజెంటేషన్ కి రెడీగా ఉన్నాను. కానీ నాతో పాటు వచ్చిన స్టాఫ్ లో కొంతమంది ఇంజనీర్లకి ఇటువంటి సిట్యువేషన్ కొత్త కాబట్టి వాళ్లందరితో కోఆర్డినేట్ చేసుకోవడానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది. ఏదేమైనా అంతా ముందే ఫిక్సయిన షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్ సాగిపోవాల్సిందే కాబట్టి అంతా నేనై నడిపిస్తూ మా బాసులకి అన్ని విషయాలను వివరిస్తూ సుమారు నాలుగు రోజులు చాలా బిజీ బిజీగా గడిపేసాను. మిగిలిన రెండు రోజుల్లో కొంతమంది మేనేజ్మెంట్ స్టాఫ్ మరియు నేను మాత్రమే మీటింగ్స్ లో పాల్గొన్నాము.

ఈ ఆరు రోజుల చర్చల్లో విశ్వేశ్వర్ ఒక్కరోజు మాత్రమే పాల్గొన్నాడు. అప్పుడు కూడా వాడు చాలా చిన్న చిన్న పాయింట్లు కూడా పెద్దదిగా చేసి చూపుతూ ఎక్స్ప్లనేషన్ అడుగుతూ చాలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. చివరి రోజు మాత్రం మా బాసులు కేవలం నన్ను పి ఆర్ టీం తో మాత్రం స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి కంపెనీ ఓపెనింగ్ కార్యక్రమాల గురించి చర్చించారు. అందులో భాగంగా ఇంతకుముందు కంపెనీ నిర్మాణం ఆగిపోవడం గురించి అక్కడ జరిగిన గొడవల గురించి ఆ తర్వాత వాటిని అధిగమించి ఇప్పుడు కంపెనీ నిర్మాణం పూర్తయ్యే వరకు నా పర్సనల్ అభిప్రాయం గురించి అడిగారు. నేను కూడా సిన్సియర్ గా నాకు కనబడిన లోపాల గురించి వివరించే ప్రయత్నం చేశాను.

అప్పుడు జరిగిన గొడవల తర్వాత పి ఆర్ టీం అన్నింటినీ చక్కదిద్దింది కాబట్టి నేను చెప్పిన అభిప్రాయాలను చాలా వరకు ఏకీభవిస్తూ నాకు మద్దతుగా నిలిచింది. అలాగే ఇకమీదట కంపెనీలో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే అనే ప్రశ్నకు కూడా నేను సమాధానం ఇస్తూ కొంతమంది కాంట్రాక్టర్లను పర్మినెంట్ గా బ్లాక్ లిస్టులో పెట్టమని అలాగే ఇకమీదట లోకల్స్ నే ఎక్కువగా ప్రోత్సహించమని సూచనలు చేశాను. ఈ విషయంలో బాసులు చాలా సీరియస్ గా ఉండడంతో నా సూచనలు పరిగణలోకి తీసుకునేటట్టే కనబడ్డారు. అదే సమయంలో పి ఆర్ టీం అక్కడ ఉంది కాబట్టి ఈ విషయంలో ఇనిషియేటివ్ స్టెప్ కింద లోకల్ పెద్ద మనుషులను కంపెనీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేలా చొరవ తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చాను.

నా సూచనకి సలహాకి బాసులు ఇంప్రెస్ అయినట్టే కనబడ్డారు కానీ ఆ తర్వాత నాతో పర్సనల్ మీటింగ్ అని పి ఆర్ టీం ని బయటికి పంపి నాతో మాట్లాడుతూ, విశ్వేశ్వర్ నీ గురించి కొన్ని రిమార్క్స్ మా ముందు పెట్టాడు వాటి గురించి నువ్వేమైనా చెప్పుకోవాల్సింది ఉందా? అని అడిగారు. …. బాసులు ఈ విషయం గురించి నాతో ఇలా డైరెక్ట్ గా మాట్లాడతారని నేను ఊహించలేదు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఫైనల్ డెసిషన్ వాళ్ళదే, ముఖ్యంగా వాళ్లు విశ్వేశ్వర్ ని బాగా నమ్ముతారు కాబట్టి నేను ఏం మాట్లాడినా ఉపయోగం ఉండదనేది నా భావన. అందుకే నేను ఏం మాట్లాడకుండా కామ్ గా ఉండిపోయాను. …. బాసులు మళ్ళీ మాట్లాడుతూ, చూడు గోపాల్,,, సాధారణంగా ఇలాంటి విషయాలు మేము డిస్కస్ చెయ్యము.

కానీ నీ ట్రాక్ రికార్డు, ఇంకా ఇంతవరకు ఎప్పుడు నీ మీద రిమార్క్స్ లేకపోవడంతో నీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాము. విశ్వేశ్వర్ కొంచెం యారగెంట్ అని మాకు తెలుసు కానీ అతను మాకు నమ్మకస్తుడు. అప్పుడప్పుడు తన మీద కూడా ఏదో ఒక రూమర్ వింటూ ఉంటాము కానీ అతనంటే కిట్టని వాళ్లు ఏదో చెబుతూ ఉంటారులే అని కొంచెం లైట్ గా తీసుకున్నాము. కానీ ఇప్పుడు నీలాంటి వాడి మీద తను చెబుతున్న రిమార్క్స్ చూస్తుంటే మీ మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే తెలుసుకోవాలని నీకు ఛాన్స్ ఇస్తున్నాము అని చెప్పారు. …. నేను కొంచెం ఆలోచనలో పడ్డాను ఎందుకంటే ఈ విషయం బాసులతో డిస్కస్ చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు.

అందుకే బాసులకి రిప్లై ఇస్తూ, ఈ విషయం గురించి నేను మీతో చర్చించాల్సిన అవసరం ఉందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది కంపెనీకి సంబంధించిన అంశం కాదు ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఇష్యూ,,,, మీకు ఏది సరైనది అనిపిస్తే అది చేయండి నేను ఫేస్ చేయడానికి సిద్ధం అని సిన్సియర్ గా చెప్పాను. …. ఎందుకో తెలియదు గానీ బాసులు ఓ రెండు నిమిషాలు సైలెంట్ గా ఉండి, ఓకే గోపాల్,,, యు కెన్ లీవ్ నౌ,,, మనం మళ్లీ ఓపెనింగ్ రోజు కలుద్దాం. అందర్నీ కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రోగ్రామ్ జరిగేటట్లు చూసుకో అని చెప్పి నన్ను వదిలేశారు. నేను కూడా మొత్తం భారం దిగిపోయినట్టు తేలికగా ఊపిరి తీసుకొని ఢిల్లీ నుండి తిరుగు ప్రయాణం అయ్యాను. కానీ ఇప్పటికీ నా ఉద్యోగం విషయంలో మెడ మీద కత్తి వేలాడుతుంది అని నాకు అనిపిస్తుంది.

నేను ఢిల్లీ నుండి బయలుదేరేముందు బాలకి కాల్ చేయగా మరుసటిరోజే రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉందని చెప్పి నేను కూడా సమయానికి వచ్చేస్తున్నందుకు చాలా సంతోషపడింది. మరుసటి రోజు నేను చత్తర్పూర్ లో ట్రైన్ దిగే సమయానికి మున్నా బిల్లు కలిసి నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాగా నేను కూడా అందరితో కలిసి దగ్గరుండి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చూసుకున్నాను. మా పట్ల తమ ఆత్మీయతను చూపిస్తూ సాక్షి సంతకాలు పెట్టడానికి వచ్చిన రసూల్ గారు, ఫరీదాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. కానీ కంపెనీ ప్రారంభోత్సవ పనుల్లో బిజీగా ఉంటాను కాబట్టి ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమం తర్వాత పెట్టుకుందామని వాయిదా వేశాను.

ఇక అక్కడ నుంచి మరో రెండు వారాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపాను. పి ఆర్ టీం నా సూచనల మేరకు ఆహ్వానితుల లిస్టులో ఈ ప్రాంతానికి ముఖ్యులైన నవాబు గారిని వారి పార్టనర్స్ ని కూడా చేర్చడం నాకు కొంచెం ఆనందాన్ని కలిగించింది. అలాగే రాజకీయ ప్రముఖులు ప్రభుత్వ అధికారులు ఇలా ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి. పెండింగ్ లో పడిపోయిన ప్రాజెక్టు కాబట్టి దీని ప్రారంభోత్సవం అటు రాజకీయంగాను ఇటు మా కంపెనీ పరువు ప్రతిష్టల దృష్ట్యా చాలా అట్టహాసంగా జరిపారు. మా బాసులు కూడా నన్ను దగ్గర పెట్టుకుని ఈ ప్రాంత ముఖ్యులను కలిసి అందరి మధ్య సుహృద్భావ వాతావరణం పెంచుకునే ప్రయత్నాలు చేశారు.

అందుకు నవాబు గారితో పాటు మరి కొంతమంది పెద్ద మనుషులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసి ముందు ముందు బిజినెస్ డీల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అన్నట్టు మాటలు కలుపుకున్నారు. ఏమైందో తెలియదు గానీ ఈ కార్యక్రమానికి వచ్చిన విశ్వేశ్వర్ మాత్రం కాస్త అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ నాకు దూరంగానే ఉన్నాడు. ఆ తర్వాత యధావిధిగా అవార్డులు రివార్డులతో ఎంప్లాయిస్ ని సంతోషపెట్టి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. బాసులు బయలుదేరేముందు మరుసటి రోజు చత్తర్పూర్ వచ్చి హోటల్లో తమను కలవమని చెప్పి వెళ్లడంతో అలాగే వెళ్లి కలిశాను. అక్కడ నేను ఊహించని విధంగా బాసులు నా టాలెంట్ గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడి ఆశ్చర్యపరిచారు. అలాగే మరో నెల రోజులు ఇక్కడే ఉండి కంపెనీ పనులను ఆర్డర్ లో పెడితే ఈలోపు జనరల్ మేనేజర్ ని డిసైడ్ చేసి పంపుతామని అప్పుడు భాద్యతలు వారికి అప్పగించి నేను చందక వెళ్ళవచ్చని చెప్పి గుడ్ న్యూస్ అందించారు.

నేను బాసుల దగ్గర సెలవు తీసుకుని చత్తర్పూర్ నుంచి తిరిగి ఇంటికి బయలుదేరి ఎంత తొందరగా బాలకు ఈ విషయం చెబుదామా అని ఎక్సైట్ అవుతున్నాను. అసలు ఈ ఉద్యోగం పోయినా పర్వాలేదు అని ముందే డిసైడ్ అయిపోయిన నేను ఇప్పుడు బాసులు చెప్పిన విషయం విన్న తర్వాత నాలో కలిగిన ఆనందం గురించి ఆలోచిస్తుంటే నాకు ఈ ఉద్యోగం అంటే ఎంత ఇష్టమో నాకే తెలిసొస్తుంది. నా జీవితంలో రెండు ముఖ్యమైన విషయాల్లో ఒకటి బాల అయితే రెండోది ఈ ఉద్యోగం. ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడున్న ఈ పొజిషన్ వరకు రావడానికి చాలా నిజాయితీగా కష్టపడ్డాను. బాసులు చెప్పినట్టు ఇంతవరకు ఒక్క రిమార్కు లేకుండా నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తూ చాలా తొందరగానే ఈ పొజిషన్ కి చేరుకున్నాను.

అలాగే కంపెనీ కూడా నాకు ఏ విషయంలోనూ ఎటువంటి లోటు లేకుండా చూసుకుంది. కానీ ఈ విశ్వేశ్వర్ గాడి విషయంలో మాత్రమే నేను కొంచెం కలవరపడ్డాను. బాసులు ఆరోజు ఢిల్లీలో నన్ను ప్రశ్నించిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నాక్కూడా అడిగి తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. కానీ ఈరోజు నా ఉద్యోగం పదిలం అని వారి మాటలను బట్టి అర్థం అవడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటికి చేరిన వెంటనే బాలను బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి ఈ వార్త చెప్పి గట్టిగా కౌగిలించుకున్నాను. నా సంతోషాన్ని అర్థం చేసుకున్న బాల నన్ను ముద్దుల్లో ముంచెత్తి, మీరు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టారు. కానీ మీ నిజాయితీ, హార్డ్ వర్క్ కి తగిన గుర్తింపు లభించింది చూడండి అని మురిసిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *