అమ్మ : నాన్న చెప్పిన రూట్ గుర్తు ఉంది కదా…. మొదటి రోజు కాలేజ్ జాగ్రత్తగా వెళ్ళమన్నారు…. లేని పోని ఫ్రండ్షిప్ లు చేస్తే తెలుసు గా మీ నాన్న తో పడలేం…..(లంచ్ బాక్స్ ఇస్తు అమ్మ వార్నింగ్ ఇస్తుంది).
నేను మారు మాట్లాడి ఏమైనా అంటే ఆ సుకో (సుందరరావు కొడుకు) గాడి ప్రస్తావన ఎక్కడ వస్తుందో అని గట్టిగా గాలి పీల్చుకొని…వదిలేసా.
******************
తెలీని ఊరు తెలుసుకొని వెళ్ళేసరికి క్లాస్ అంత నిండిపోయింది….. లాస్ట్ బెంచ్ లో ఎక్కడో కాస్త చోటు ఉంటే కూర్చున్న…..క్లాస్ అంత తేరి పారి చూస్తున్నా…..నా లాగే ఇంకో వంద మంది చదువు బిడ్డలు డిసిప్లిన్ గా కూర్చున్నారు… క్లాస్ లో అమ్మాయి లు గురించి ఏమైనా వర్ణిస్తా అనుకుంటున్నారా….. హహహ అలాంటి పప్పు లు ఉడకవ్ అండి…. ఈ కాలేజ్ లో ఆడ పురుగు అనేది ఉండదు…. అంత లో ఒక పొట్టి సార్ ఒకడు వచ్చాడు.
*********************
సార్ : అబ్బాయిలు పీరియాడిక్ టేబుల్ మొత్తం ఎవడు చెప్తార్ర మీలో.
క్లాస్ అంత సైలెంట్ గా ఉంది….. నేను అనుకున్నాను గుంపు gaa చేతులు ఎత్తెస్తరు
ఎమో నేను కూడా ఎత్తేయలని కంగారు లో ఎత్తేసాను…. తీరా చూస్తే నా చెయ్యి మాత్రమే లేచింది….. లాస్ట్ బెంచ్ నుంచి…. ఎదో శంకర్ దాదా లో చిరు ఎత్తినట్లు…. మాస్టారు ఇక్కడ… పొట్టోడు కదా కనిపించలేదు అని…..
సార్ : శబాష్ చెప్పురా
నేను : hydrogen helium lithium berilium……….. గుక్క తిప్పుకోకుండా మరి చెప్పేశా….. క్లాస్ అంత నన్నే చూస్తూ ఉండిపోయారు….. పీరియాడిక్ టేబుల్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని అలా చెప్పేశాను…. అంతే క్లాస్ అంత మళ్ళ నిశబ్దం…. నిశబ్ధన్ని బ్రేక్ చేస్తూ…. సార్ chappatlu కొట్టాడు… మిగతా వాళ్ళు కూడా…..
సార్ : బ్రిలియంట్ వెనక ఎం చేస్తున్నావ్…. నీ లాంటి వాడు ముందు బెంచ్ లో ఉండాలి… ఇలా రా
*****************
హాయ్ నా పేరు రోహిత్ అంటూ మొదటి బెంచ్ లో పక్కనున్న చదువు బిడ్డ ఒకడు పలకరించాడు….
నేను : ప్రశాంత్
రోహిత్ : పీరియాడిక్ టేబుల్ బలేగా ఈజీగా చెప్పేశావు.
నేను : దాని వెనక అమ్మాయి లు పీరియడ్స్ లో ఫేస్ చేసే నొప్పి కంటే ఎక్కువ నొప్పి నేను అనుభవించ….ఆ బాధ వీడికి ఎలా తెలుస్తది…. మా నాన్న తొడలు ఎలా గిల్లి చడివించాడో.
********************
Bagundhi Andi story ilane continue chyndi
Ilanti chettapuku stories post chestaru
Very interesting where is the next parttt
Nice plz continue waiting for next parts
Nice story plz continue waiting for next parts