ఎవరో సార్ క్లాస్ చెప్పి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగాడు…. వెనుక నుంచి ఎవడో కో ఎడయుకేషన్ ఎప్పుడు పెడ్తారు సార్ అని అడిగాడు….. దానికి క్లాస్ అంత నవ్వారు…..సార్ కూడా నవ్వి 5 ఇయర్స్ కి ముందు ఉండేది బాబు…అని నవ్వుతూ చెప్పాడు…. మరి ఎం అయింది సార్ అని అడిగార అంత…. సార్ నవ్వి అదో కథ రేపు చెప్పుకుందాం అని వెళ్ళిపోయాడు…. ఫైనల్ బెల్ మోగింది.
రాత్రి భోజన సమయం
నాన్న : ఎలా ఉంది కాలేజ్
నేను : బాగుంది
నాన్న : క్లాస్ లు అవి బాగా జరిగాయా
నేను : హా
నాన్న : ఎక్కడ కూర్చున్నావు.
అమ్మ : అబ్బబ్బా తిన్నప్పుడు కూడా ఏంటండీ మీ గోల
నాన్న అమ్మ వైపు ఎర్రగా చూసాడు……
అమ్మ : ప్రశాంతం గా తిన్నాక అడగొచ్చు కదా అని.
నేను : అమ్మ ఆ సుందరరావు ఇలాగే తిన్నప్పుడు అడిగే వాడు ఎమో…. ఎందుకు ఆయన్ని సతాయిస్తావ్…. పాపం అడుగుతుంటే.
*****************
రాత్రి పడుకునే సమయం 9:30
అదే నేను కాదు మా పేరెంట్స్ నేను 11:00 వరకు చదివి ఆ తర్వాత పడుకోవాలి.
నాన్న : అడ్వాన్స్ ఇవ్వమని ఇచ్చాను… ఇచ్చవా…
అమ్మ : హా వెళ్ళా అండి…. ఇంటిగాలోలు (ఓనర్స్) ఎవరు లేరు…ఒక పాప ముసలావిడ మాత్రమే ఉన్నారు….
(మేము ఉన్నది పెంట్ హౌస్ లాంటి ఇంట్లో….మా కింద ఇంట్లో మా ఓనర్స్ ఉంటారు…..)
నాన్న : హా మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఎదో షాప్ చుస్కుంటారు అంట…. పొద్దున్నే నేను వెళ్తున్నప్పుడే వాళ్ళు కూడా వెళ్తున్నారు.
నేను : అబ్బా ఇక్కడ చదువు కోవాల ఒద్ద నేను మీరు అలా మాట్లాడకండి…. డిస్టర్బ్ గా ఉంది…..(నా కోపాన్ని ఈ రకంగా చూపిస్తా చదువు విషయంలో వాళ్ళ మీద….ఈ okka విషయం లో నన్ను ఏమి అన లేరు)..
నాన్న : వాడికి రేపు ఆ రూం సర్దేసి ఇవ్వు…
అమ్మ : రేపు మొత్తం క్లీన్ చేస్తా నాన్న ఈ ఒక్క రోజు ఇలా చదువుకో……
నేను : హా సర్లే ఇంక పడుకో
కాసేపటికి
అమ్మ నాన్న …. గుర్ర్ గుర్ అని గురకలు పెడుతున్నారు….. నేను వాళ్ళ వంక చూసి దీని కంటే మీరు మాట్లాడుకుంటే నే బెటర్ ఎమో అని చెవులు ముస్కొని మరి చదువుకుంటున్న….
*************************
Bagundhi Andi story ilane continue chyndi
Ilanti chettapuku stories post chestaru
Very interesting where is the next parttt
Nice plz continue waiting for next parts
Nice story plz continue waiting for next parts