మరుసటి రోజు పొద్దున్న 4:30 కి అలారమ్ మోగింది మా నాన్న ఫోన్ లో….. తను లేవటానికి కాదు నన్ను లేపటానికి…. కోడి కూడా కుయ్యని ఇలాంటి ఊర్లో ఇంత పొద్దున్నే లేచే పకోడీ గాడ్ని నేనేమో…..ఒరేయ్ సుకొ గా నీకు దండం రా…. అనుకుంటూ బద్దకం గా లేచాను….. లేచాక అర్థం అయింది అయింది ఇంకా ఒక రోజే గా అది కూడా రాత్రే చదివేసం… ఇంకేం ఉంది లే అని మళ్ళ కాస్త కునుకు పాట్లు పడ్డానో లేదో…..రేయ్ ప్రశాంత్ అని చీకట్లో మా నాన్న అరిచాడు…… నేను టింగ్ మని లేచి కూర్చుని హా లేచేస నాన్న అని అన్నాను… కర్మ రా బాబు అని తిట్టుకుంటూ….. అలాగే లేచి మెల్లగా తలుపు తీసుకొని బయటకి వచ్చాను….. మేడ మీద నుంచి చుట్టు పక్కల అంత కన్పిస్తుంది…. ప్రశాంత్ నగర్ మేము ఉంటున్న ఏరియా….ఆహా నిజం గా ఎంత ప్రశాంతం గా ఉంది…. దూర దూరంగా ఇల్లులు…. మధ్య మధ్య లో కాలి గ్రౌండ్ లు చెట్లు… పెద్దగా జన సంచారం లేని ఏరియా….ఆహా పేరు కి తగట్లే ప్రశాంతం గా ఉంది మా కాలనీ కూడా… హ్మ్మ్ ఈ పేరు మనుషుల కి సెట్ అవ్వదు ఎమో లే …..అని ఒళ్ళు విరుచుకుంటూ మా పక్కిల్లు ని చూసా…. ఒరోరే ఎంది రా ఇది ఇట్లా ఉంది అని ముక్కున వెలేస్కున్న…… తెల తెల వారు చీకట్లోనే….. నేను ఆ ఇంటి ని పరిశీలిస్తున్న…..మా ఇంటికి ఆనుకునే ఉంది…. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ…ఆ గోడ మీద ముళ్ళ ఫెన్సింగ్…. ఇది ఇళ్ల లేక ఏదైనా మిలిటరీ వాళ్ళు ఉండే స్థావరమ అనేట్లు ఉంది…. అబ్బో సీసీ కెమెరా లు కూడా ఉన్నాయి అంటే ఎదో పెద్ద ఆఫీస్ లా ఉంది అనుకొని చూస్తున్నా….
అంతే రేయ్ ప్రశాంత్ అని గావు కేక తో….నా గుండెల్లో గుది బండ పడినట్లు అయింది….. తిరిగి చూస్తే మా నాన్న కరవడానికి రెడీ గా ఉన్న…. మరీ తండ్రి ని అల పోలిస్తే బాగోదు లే…. మీరె అర్థం చేసేస్కొండి….
**************************
పూర్తి గా తెల్లారింది….. నేను రెడీ అయ్యి కాలేజ్ కి వెళ్దాం అని బాక్స్ తీసుకొని అమ్మ కి వెళ్తున్నా అని చెప్పి….. మెట్లు దిగాను…. మెట్లు దిగి ఇక్కడ నా సైకిల్ ఒకటి ఉండాలి కదా ఏమయ్యింది అబ్బా అని అటు ఇటు చూస్తే…. అది కాస్త మెట్ల కింద పెట్టి ఉంది…. ఓహ్ ఇక్కడున్నావా అనుకుంటూ మెల్లగా దూరి కీ లాక్ తీస్తున్నా….. ఒకటి గమనించారా మనల్ని ఎవరైనా చూస్తున్నారు అంటే మనకి ఎలాగోలా తెలిసిపోద్ది…. అలాగే ఆ క్షణం నాకు అన్పించింది…. ఇరుకు గా ఉన్న మెట్లు కింద పక్క గా ఒక కిటికీ లోంచి ఒక వ్యక్తి కిటికి గ్రిల్స్ పట్టుకుని నన్నే చూస్తున్నారు…. నాకు చాలా దగ్గరగా…. అక్కడ ఒకరు ఉన్నారు అని తెలిసి షాక్ లో నేను పైకి లేవగానే…. ధడేల్ మని నా గుండు కి బొక్క పడేలా మెట్టు తగిలింది…..
క్లాస్ లో బెంచ్ మీద తల పెట్టుకొని పడుకున్నాను… మెట్టు తగిలేసరికి తల అంతా దిమ్ము గా అయినట్లు ఉంది…. ఇంక ఎవరూ రాలేదు…. అంత లో రోహిత్ గాడు వచ్చాడు….
రోహిత్ : హాయ్
నేను సగం తెరిచిన కళ్ళ తో వాడిని చూసి హాయ్ అని చెప్పి అలాగే పడుకున్న.
రోహిత్ : ఎం అయింది
నేను : తల నొప్పి గ ఉంది.
రోహిత్ : ఎందుకు ఉంది
నేను : తల కి మా ఇంటి దగ్గర మెట్టు తగిలింది.
రోహిత్ : ఎందుకు చుస్కోకుండ తగులుకున్నావా.
నేను : హా
రోహిత్ : అల ఎలా… అంటే ఇంకేదో చూస్తున్నావ్ ఎంటి అది.
నేను : ఉఫ్ఫ్!!!!!!!
రోహిత్ : చెప్పు చెప్పు ఎం చూసావు
నేను : అవును నా పక్కన ఒకరు ఉన్నారు…. సడన్ గా చూసేసరికి భయపడి గుద్దేస్కున్న.
రోహిత్ : ఎవరు ఉన్నారు
ఇందాకటి నుంచి చూస్తున్నా… ప్రశ్న మీద ప్రశ్న ఆపట్లేదు ఎంటి ఈడు… అయినా ఈడికి ఎందుకు చెప్పాలి అసలే తలనొప్పి తో ఉంటే వీడు ఇంకా తలనొప్పి గా తయారయ్యాడు అని రిప్లై ఇవ్వకుండా అలాగే పడుకున్న…
********************
Bagundhi Andi story ilane continue chyndi
Ilanti chettapuku stories post chestaru
Very interesting where is the next parttt
Nice plz continue waiting for next parts
Nice story plz continue waiting for next parts