నేను : హా
రోహిత్ : నువు ఒకటి చెప్పలేదు.
నేను : ఎంటి
రోహిత్ : అదే నువ్వు ఎవర్నో చూసి భయపడ్డా అన్నావు కదా ఎవరు??????
కాలేజ్ నుంచి ఇంటికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న…. రోడ్ మీద మనుషులని గమనిస్తున్న…. ఒకడు ఫుట్ పాత్ మీద కూర్చుని బీడి తాగుతున్నాడు….ఇంకోడు చెట్టు కింద బెంచ్ మీద కూర్చుని సేద తీరుతున్నాడు…. మరొకడు ఎవరో అమ్మాయి తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు…. ఇలా ఎవరెవరో స్వేచ్ఛ జీవులు కనిపించారు….. నిజం గా ఆనందం అంటే మనిషికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉన్నప్పుడే కదా…. అలాంటి స్వేచ్ఛ ని వీళ్ళు ఎంత హాయిగా అనుభవిస్తున్నారు…. బీడి కాలిస్తే పొగ తప్ప ఏమి రాకపోవచ్చు…. కానీ వాడు చేసే ఆ పని ని వద్దు అని అడ్డు చెప్పటానికి ఎవరూ లేరు…. అది వాడి స్వతంత్రం…….ఆ బెంచ్ మీద చెట్టు కింద కూర్చున్న వాడికి ఎలాంటి లక్ష్యం ఉందో లేదో నాకు తెలీదు…. కానీ ఆ క్షణం వాడి మొహం చాలా ప్రశాంతం గా ఉంది…. బహుశా ఇక్కడ ఎం చేస్తున్నావ్ రా వెధవ ఇంటికి వెళ్ళి పుస్తకం తీయు అని తిట్టే తండ్రి వాడికి లేకపోవచ్చు….. ఇంక అమ్మాయి తో మాట్లాడే వాడు….. అలాంటి ఆలోచన ల జోలికి కూడా ఎప్పుడూ పోలేదు…. అని సైకిల్ తొక్కటం వేగం పెంచి ఇంటికి పోతున్న.
అయినా రోహిత్ గాడు అంత లా అడుగుతున్న ఎందుకు చెప్పలేకపోయాను….. నేను చూసింది ఒక అమ్మాయిని అని…. అమ్మాయిని చూడటమే కాదు అమ్మాయిల గురించి చర్చించటం కూడా నేరం మా నాన్న రాజ్యాంగం లో…. మనిషికి కళ్లెం వేయొచ్చు కాని మనసుకి వెయ్యలేడు గా నాన్న…. నేను ఎం చేసినా ఆయన కనుసన్నల్లో జరగాలి… కాని నేను ఎం ఆలోచించిన ఆయన చూడలేడు గా…. ఓహ్ ప్రశాంత్ నీకు కూడా స్వేచ్ఛ ఉంది అని మర్చిపోకు రా …. పూర్తిగా అంతరంగిక స్వేచ్ఛ…. అనుకుంటూ….మొన్న అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి…”ఆ ఇంట్లో ఒక పాప ముసలావిడ ఉన్నారండి” అని…. పాప అంటే గౌన్ ఎస్కునే పాప అనుకున్నాను కాని మిడి ఎస్కున్న అమ్మాయిని కూడా పాప అంటారు అనుకోలేదు…. నేను చూసింది తననే…. చాలా దగ్గరగా కిటికి కి మొహం ఆనిచ్చి… నన్నే గమనిస్తూ మౌనం గా ఉంది….. నాకు దెబ్బ తగలటం చూసి అయ్యో అన్నట్లు సైలెంట్ గా ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చినట్లు గా గుర్తు…. ఏది ఏమైనా నేను అక్కడ ఎక్కువ సేపు లేకుండా తనని మళ్ళ ఒకసరి
చూసే ప్రయత్నం కూడా చేయకుండా నొప్పి తో నే అలా వచ్చేసాను….. నొప్పి అంటే గుర్తొచ్చింది…ఆ రావు బామ్ ఎదో బాగా పనిచేసింది గా ఒకటి కొనుక్కుందాం అని ఇంటి కి దగ్గర్లోనే ఒక పచారి కొట్టు ఉంటే సైకిల్ ఆపి వెళ్ళాను….. షాప్ లో ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు…. అన్నదమ్ములు లా ఉన్నారు ఒకే లా…. నాకు బామ్ ఇస్తు ఎవరు భయ్య నిన్ను ఎప్పుడు చూడలేదు ఇక్కడ అని ఒకడు అడిగాడు…. కొత్తగా వచ్చాం అని మేము ఉండే ఇంటిని దూరం నుంచి వేలు పెట్టి చూపించ….. మరొకడు ఓహ్ సత్య వాళ్ళ ఇళ్ల అని వాళ్ళలో వల్లే కొంటె గా చిన్న నవ్వు నవ్వుకున్నారు….ఆ నవ్వుకి అర్థం ఎంటో నాకు అర్ధం కాలేదు కాని సత్య ఎవరై ఉంటారు…. అబ్బాయి పేరా అమ్మాయి పేర…. ఒక వేళ అంకుల్ పేరు సత్యనారాయణ అయి ఉంటుంద…. అల అయితే సత్య గారు అనే వాడు గా…. ఎదో తన వయసు వాళ్ళని అన్నట్టు గా సంభోదించాడు అంటే పొద్దున్న నేను చూసిన ఆ అమ్మాయే నా…. తన వయసు ఈ షాప్ లో కుర్రాళ్ళ వయసు దాదాపు ఒకటే ఉంటుంది…. ఇన్ని ఆలోచనల్లో ఇళ్లు వచ్చేసింది….
***************
Bagundhi Andi story ilane continue chyndi
Ilanti chettapuku stories post chestaru
Very interesting where is the next parttt
Nice plz continue waiting for next parts
Nice story plz continue waiting for next parts