ఊహల్లో Part 2 117

మరీ డాక్టర్స్ ఏమంటున్నారు…

ప్రాబ్లం ఏమీ లేదు.. కొందరికి లేట్ గా కూడ పుడతారు… నీది ఇంకా చిన్న వయస్సే కదా… దాని గురించి దిగులు పడకండి అంటున్నారు…

అవునా…. ఇద్దరు చెక్ చేపించుకున్నార… ఇద్దరికి ఎవరిలో ప్రాబ్లం లేదంటనా….

ఆయన చెక్ చెపించుకోలేదు… నన్ను మాత్రమే చెక్ చేయించారు …అలా అడిగితే ఆయనకు చాలా కోపం వస్తుంది…. ఆయనకు కోపం కలిగించే పని ఏమి చేయను…మాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ మా ఆయనను చూపించుకోవచ్చు కదా అని మాత్రం అడుగును….

మీ ఆయన మీద నీకు చాలా ప్రేమ ఉందని నాకు బాగా తెలుస్తుంది….నీలాగ అర్థం చేసుకునే వారు ఇంతగా ప్రేమించే వారు దొరకడం నిజంగా శేఖర్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో….మీరే అందంగా ఉన్నారు అనుకుంటే….మీ మనసు కూడ చాలా అందంగా ఉంది ….ఆ చందమామ లాంటి అందం , వెన్న లాంటి మనసున్న వారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళతో ఈ క్షణం నేను ఉన్నాను, మాట్లాడుతున్నాను అంటే ఒకరకంగా నేను కూడా లక్కీ అని చెప్పాలి…

ఇంతవరకు జయంతిని తన అందం గురించి ఎవరు పొగిడింది లేదు.. మొదటిసారి క్రిష్ణ పొగడంతో ఆ పొగడ్తకు జయంతి చాలా సంతోష పడింది తన మనసులో తనకే తెలియని ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది…. క్రిష్ణ మీద కొంచెం అభిమానం పుట్టుకొచ్చింది

అలా ఇద్దరూ చాలా వరకు మాట్లాడుతునే …. వంట రెడీ చేయడం, భోజనం తినడం కూడ అయిపోయింది…. ఇంతవరకు జయంతిని పొగడటమే పనిగా పెట్టుకున్నాడు ఏదో రకంగా తనని పొగుడ్తునే తన అభిమానాన్ని పొందుతున్నాడు…..

ఆ రాత్రి చాలా వరకు వర్షం పడుతునే ఉండటం వల్ల క్రిష్ణ కూడ అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది ….అలా చాలా సేపు వాళ్ళ సంభాషణ సాగింది చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడుతు క్లోజ్ అయిపోయారు.. ఎంతంటే ఒకరినోకరు పేర్లతో పిలుచుకునెంత క్లోజ్ అయిపోయారు…

సుమారు ఐదు ఆరు గంటల తర్వాత వర్షం కొంచెం తగ్గింది…. అంతవరకు మాట్లాడుతునే చాలా విషయాలు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు…

అయ్యో…టైం చూసావా ఒంటిగంట..ఒకే జయ వర్షం తగ్గినట్లు ఉంది…. నేను వెళ్తాను… నీతో మాట్లాడుతుంటే సమయమే తెలియటం లేదు

అవునా…. నేను కూడ ఒంటరిగా ఎలా ఉండగలనో అనుకుంటుంటి మీరు చాలా వరకు నాకు తోడుగా ఉన్నారు చాలా థాంక్స్….ఇది ఒకసారి ఫోన్ ఇవ్వు ఆయనకు కాల్ చేస్తాను ఆయన అక్కడ ఎలా ఉన్నాడో ఏమో…..

రెండు మూడు సార్లు చేసింది కానీ శేఖర్ లిఫ్ట్ చేయలేదు….ఏమైందబ్బా అనుకుంటూ మళ్ళి మళ్ళి చేసింది కానీ నో రెస్పాన్స్ …

ఒకే జయ నేను వెళ్తున్నాను…. నువ్వు జాగ్రత్తగా ఉండు… ఉదయం శేఖర్ వస్తాడులే… ఒకవేళ రాకపోతే నేను ఫోన్ లో మాట్లాడిస్తాను….

ఊ…. అంటూ తలూపుతుంది…. జయంతి

ఏమిటీ ఇంతవరకు బాగానే ఉన్నావు ఒకసారిగా మౌనం….

ఇంతవరకంటే మీరు తోడుగా ఉన్నారు…. నువ్వు వెల్తే ఒంటరిగా ఎలా ఉండగలనో అని ఆలోచిస్తున్నాను…అదికాక శేఖర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు…ఏమెందోనని ఆందోళనగా ఉంది

ఓ….. అయితే ఒకపని చేయ్….ఈ మొబైల్ ఇక్కడే పెట్టుకో… నాకు ఇంట్లో ఇంకో మొబైల్ ఉంది… శేఖర్ కి ఏమి కాదు తను చాలా క్షేమంగా ఉంటాడు… కొంచెం సేపు ఉన్నాక మళ్ళి ఫోన్ చేసి కనుక్కో…. ఒకవేళ నీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందిగా ఉంటే దీంట్లో నా నెంబర్ ఉంది ఫోన్ చేయ్ …. జయంతికి ఫోన్ ఇచ్చి తన నెంబర్ చూపించి… వెల్తుంటే

క్రిష్ణ అనిపిలిచింది జ……

వెనక్కి తిరిగి ఏమిటి….. అన్నట్టు కళ్ళతోనే సైగ చేసాడు…

జయంతి ఏమిలేదని తలూపుతు… సమాధానం చెప్పింది….

సరే వెల్తున్న అంటూ సైగ చేసాడు….

ఏమో నీ ఇష్టం అన్నట్టు సమాధానం ఇచ్చింది సైగలతో….

ఒకే… బై అంటూ వెళ్లిపోయాడు….

3 Comments

  1. Chala bagundhi broo update kaani madhyalo verey verey valla topics kuda vastunnayi avi konchm clear ga explain chesi konchm gap ichi rayandi baguntundhi

  2. Nice story, pls continue

  3. Bro miru copy paste lu chese pani ayithe aa story motham chadhivi aa story ki ending untene rayandi lekhapothe ending miru rayagalanubani anikuntene post cheyyandi. Ee story ki ending ledhu.

Comments are closed.