రాజ్యం

దాంతో జడ్జ్ గారు “లాయర్ సిద్ధార్థ నీ చాలా రోజుల తర్వాత చూడడం సంతోషంగా ఉంది ఆయన చెప్పిన విషయాలను కోర్టు స్వాగతిస్తుంది కానీ ఈ ప్రక్రియ ఒక్క రాత్రి లో జరిగేది కాదు కావున విద్యార్థుల సంఘం సమక్షంలో ప్రతి గవర్నమెంట్ ఆమోదం ఉన్న యూనివర్సిటీ లో ఈ విషయం పై విచారణ జరిపించాలని ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని కోర్టు ఆదేశం ఇస్తుంది అలాగే విద్యార్థుల తమ హక్కుల కోసం పోరాటం చేయడం లో ఎలాంటి తప్పు లేదు కానీ వాళ్లు చేసిన నిరసన వల్ల కొంత వరకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడటం వల్ల వారిని మందలిస్తు 5 వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఇది చివరి హెచ్చరిక గా ప్రకటిస్తూ వారిని విడుదల చేయడం జరిగింది court is adjourned” అని తీర్పు ఇచ్చారు, కోర్టు లో కేసు గెలిచిన తర్వాత విద్యార్థులు అంతా సిద్ధార్థ నీ తమ భుజాల పైన మోస్తూ కోర్టు బయటికి వచ్చారు ఇది అంత అందరి ఫోన్ లో Facebook లైవ్ లో పెట్టారు అప్పుడు ఆ video మొత్తం viral అయ్యింది.

ప్రధాన మంత్రి కార్యాలయం లోని చీఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఆ video చూసి ప్రధాని చీఫ్ సెక్యూరిటీ కీ ఆ వీడియో చూపించారు అతను ఆ video నీ ప్రధాని పర్సనల్ సెక్రటరీ అయిన “మధు గుప్తా” దగ్గరికి వెళ్లారు అప్పటికే మధు పార్టీ హై కమాండ్ మీటింగ్ లో ప్రధాని తరుపున ఆ మీటింగ్ కి హాజరు అయ్యారు అక్కడ అందరూ తరువాత ప్రధాని అయితే నేను అవ్వాలి అంటే నేను అవ్వాలి అని కొట్టుకుంటూ ఉన్నారు ప్రధాని ఆరోగ్యం చాలా క్షీణించింది ఈవాళ, రేపు అన్నట్లు ఉంది ఆయన పరిస్థితి ఈ విషయాన్ని బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు పార్టీ నాయకులకు రాష్ట్రపతి కీ తప్ప ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్ ఆ video తీసుకుని వచ్చి మధు కీ చూపించారు దాంతో మధు మొహం లో ఒక్కసారిగా రంగులు మారాయి వెంటనే ఆ video నీ పార్టీ అధినేత కీ చూపించారు మధు అది చూసిన పార్టీ అధినేత సరే అని సైగ చేశారు దాంతో మధు సెక్యూరిటీ ఆఫీసర్ తో కలిసి హడావిడి గా హైదరాబాద్ చేరుకొని సిద్ధార్థ ఉంటున్న కాలనీ కీ వెళ్లారు అప్పుడు కాలనీ వాళ్లు అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అప్పుడు మధు లోపలికి వెళ్లి సిద్ధార్థ మందు తాగి పడిపోతే అలాగే ఎత్తుకొని వచ్చి కార్ లో వేసి తీసుకుని వెళ్లాడు అప్పుడు కాలనీ వాళ్లు అంతా సిద్ధార్థ ఇంట్లోకి వెళ్లి చూశారు అక్కడ గోడ మీద చాలా ఫొటోలు, సర్టిఫికేట్ లు ఉన్నాయి అందులో ఒక ఫోటో చూసి అందరూ షాక్ అయ్యారు అది మన ప్రధాని తో సిద్ధార్థ కలిసి దిగిన ఫోటో దాని కింద “Best father in the world” అని రాసి ఉంది.

సిద్ధార్థ ప్రధాని రమేష్ ఠాకూర్ కొడుకు అని తెలిసి అందరూ షాక్ అయ్యారు అప్పుడు ఒక అబ్బాయి గూగుల్ లో సిద్ధార్థ గురించి కోడితే కొన్ని వివరాలు వచ్చాయి “అందరూ ఇలా చూడండి సిద్ధార్థ NLU ఢిల్లీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ల నాన్న ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నపుడు ఫైనాన్షియల్ లా advisor గా ఉన్నాడు ఆ తర్వాత ఎప్పుడైతే రమేష్ గారు prime minister అయ్యారో సిద్ధార్థ నీ కూడా లోకల్ యూత్ లీడర్ నీ చేశారు ఆ తర్వాత సిద్ధార్థ vancross University Lindbergh లో చాలా మంది వరల్డ్ politicians పిల్లల తో పాటు తను కూడా politics గురించి డిగ్రీ పొందాడు అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు సిద్ధార్థ ఒక controversy లో ఇరుకున్నాడు ఆ తర్వాత తను ఎక్కడికో మాయం అయిపోయాడు” అని సిద్ధార్థ గురించి మొత్తం వివరాలు చెప్పాడు.

ఇది ఇలా ఉంటే మధు సిద్ధార్థ నీ chartered flight లో తిరిగి ఢిల్లీ తీసుకుని వెళుతున్నాడు అప్పుడు ఫ్లయిట్ లో తన బెడ్ మీద ఉన్న సిద్ధార్థ కీ మెలుకువ వచ్చింది అప్పుడు flight attendant వచ్చి “your juice sir” అని చెప్పింది దాంతో ఆమె గొంతు గుర్తు పట్టిన సిద్ధార్థ మత్తులోనే “థాంక్ యు జూలియట్” అని చెప్పాడు తరువాత సిద్ధార్థ కీ అనుమానం వచ్చి లేచి చూస్తే తన రెండు చేతులకు బేడీలు వేసి ఉన్నాయి అది చూసిన సిద్ధార్థ “సింగ్ జి నువ్వు బయట ఉన్నావు అని నాకూ తెలుసు వచ్చి handcuffs తీయి” అని కోపం గా అరిచాడు ఇది అంత బయట నుంచి వింటున్న సిద్ధార్థ బాడిగార్డ్ సింగ్ లోపలికి వెళ్లాలి అంటే భయపడుతున్నాడు, “రేయ్ వినోద్ నా కొడక నువ్వు కూడా ఉన్నావు అని నాకూ తెలుసు వచ్చి handcuffs తీయి రేయ్ వినోద్” అని అరిచాడు సిద్ధార్థ దాంతో వినోద్ కీ కోపం వచ్చి లోపలికి వెళ్లి సిద్ధార్థ నీ నాలుగు పీకి “మూసుకొని కూర్చో” అని అన్నాడు (వినోద్, సిద్ధార్థ ఇద్దరు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు అంతేకాకుండా సిద్ధార్థ సెక్యూరిటీ వింగ్ లో వినోద్ చీఫ్) అప్పుడే లోపలికి వచ్చిన మధు నీ చూసిన సిద్ధార్థ “ఆల్ఫ్రెడ్ నేను ఎవరో తెలిసి కూడా ఇలా చేయడం తప్పు ఆల్ఫ్రెడ్” అని అన్నాడు (సిద్ధార్థ కీ బ్యాట్మాన్ అంటే చాలా ఇష్టం అందుకే మధు నీ చిన్నప్పటి నుంచి బ్యాట్మాన్ కీ అసిస్టెంట్ అయిన ఆల్ఫ్రెడ్ పేరుతోనే పిలుస్తాడు) “చూడు సిద్ధు నేను మీ నాన్న సెక్రటరీ మాత్రమే కాదు ఫ్రెండ్ నీ కూడా నా ఫ్రెండ్ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు తన చివరి కోరిక నువ్వు తన ముందు ఉండాలి అని నేను నా స్నేహం కోసం చేస్తున్న నువ్వు ఇష్టం గా వచ్చిన ఎలా వచ్చిన నువ్వు నాతో రావాలి అంతే వినోద్ వాడు నీకు ఫ్రెండ్ అయ్యి ఉండవచ్చు కానీ తను నీ బాస్ show some blooty respect” అని చెప్పి వెళ్లిపోయాడు.