ప్రేమ కాటులు 191

గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్,

కరీంనగర్, తేది * డిసెంబర్ 1994. సమయం 8:10 AM,

(పాట) TV: జగమే మాయ……. బ్రతుకే మాయ……. వేదాలలో సారం ఇంతేనయ విధి ఇంతేనయా……

ఒకరు: అమ్మా కాస్త వార్తలు పెట్టు.

TV: ఈనాటి ముఖ్యాంశాలు, పోయిన నెల విజయవంతంగా టెస్టింగ్ పూర్తి చేసుకున్న డిఫెన్స్ ఆర్గనైజేషన్ ద్వారా తయారుచేయబడ్డ ఉపరితలం guided missiles మొదటి విడతగా ఆరు మీ కి ఇవ్వబడింది. దీనికి ఇంకా సాంకేతికంగా రెండవ దశ మిస్సైల్ కూడా త్వరలోనే ఆవిష్కరిస్తాం అని తెలియచేశారు. ఇది డిఫెన్స్టెక్నాలజీ కి ఒక కొత్త బాటగా పేర్కొన్నారు.

1st floor లో,

Operation theatre బొడ్డు కోసి పసి కందు ని శుభ్రం చేసి బయటకి తీసుకొస్తుంది నర్సు. వెంకటేశ్వర్కన్నుల్లోసంతోషంతో నీళ్ళు తిరిగాయి.

నర్స్: అబ్బాయి పుట్టాడు

వెంకటేశ్వర్ తన కొడుకుని ముట్టుకుందాం అని ముందడుగు వేసాడు. చెయ్యి అడ్డు పెడుతూ ఆగుఅనిబెదిరించింది. ఆశ్చర్యపోయాడు, తట్టుకోలేకపోయాడు.

నుర్స్: బాబు చాలా బలహీనంగా ఉన్నాడు, 20 రోజులు బాబు ముట్టుకోవడానికి వీల్లేదు. జరగండి

అంటూ తోసుకుంటూ వెంకటేశ్వర్ కళ్ళ ముందే అదేదో lab లోకి వెళ్ళింది. నుర్సుని నోరు విప్పిపిలవబోతుఆగిపోయాడు. వెంకటేశ్వర్ తండ్రి దగ్గరకు వచ్చి, భుజం మీద చెయ్యేసి, ” ఎంది కొడకా అట్లాపోతుంది ఆ పిల్ల ” అని అడిగాడు. వెంకటేశ్వర్ అసలేం జరుగుతోంది అర్థం కాలేదు. హఠాత్తుగా ఇంకా భయంపెరిగిపోతుంది, తనబిడ్డని ముట్టుకోనిచ్చేది లేదు అని నర్స్ చెప్పి వెళ్ళింది, ఇంకా డాక్టర్ బయటకి రావట్లేదు, తన భార్యకి ఏదైనాసమస్యా, ఏదైనా జరగకూడనిది ఏమి కాలేదు కదా అని కాళ్ళు వణికిపోతున్నాయి, వెంకటేశ్వర్ ని చూసి వాళ్ళనాన్న పెద్దాయన ఇంకా గుబులు పడుతున్నాడు.

అప్పుడే డాక్టర్ బయటకి వచ్చింది, వెంటనే డాక్టర్ దగ్గరకు పోయి నిలదీశాడు. ” ఏమైంది, నా భార్యకిఏమైంది? “, అది విని డాక్టర్ ” ఏం కాలేదు ఎలాంటి ఇబ్బందీ లేదు, కానీ…. ” అని మాట ఆగింది. అలామాట ఆగడం ఏమోకానీ వెంకటేశ్వర్ ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్టు ఉన్నాడు.

డాక్టర్: మీ బాబు ఒక కిలో 200 గ్రాములు మాత్రమే ఉన్నాడు. ఒక శిశువు అంత తక్కువ బరువుతో పుట్టడంనేనుఎప్పుడూ చూడలేదు. ఆ ఒక్క విషయంలో నేను మీకు హామీ ఇవ్వలేను. క్షమించండి.

ఇద్దరికీ ఇంకా భయం పెరిగింది. వాళ్ళ కళ్ళలో భయం టెన్షన్ చూసి, డాక్టర్ వెంకటేశ్వర్ తో

డాక్టర్: భయపడకండి, మా ప్రయత్నం మేము చేస్తాము. సుమారు 20 రోజులు మా lab లో ఎప్పటికప్పుడుmonitor చెయ్యాలి తప్పదు.

కళ్ళలో నీరు జారుతూ,

వెంకటేశ్వర్: ఒక్కసారి నా కొడుకుని చూసుకుంటా ఒక్కసారి డాక్టర్

డాక్టర్: లేదు ఇప్పుడు కాదు, అంతా సిద్దం చేశాక, పిలుస్తాము ఓపిక చేర్చుకోండి.

ఆ తరువాత గంటకి భార్యని ఆపరేషన్ థియేటర్ నుండి ఒక గదిలోకి మర్లించారు, అంతా సిద్ధం చేసాక. ఇద్దరూలోపలికి వెళ్లారు. లక్ష్మి కళ్ళు తెరిచింది పక్కన తన బిడ్డ లేదు. వెంకటేశ్వర్ ని చూసింది. చెయ్యిపట్టుకుని,

వెంకటేశ్వర్: బాబు పుట్టాడు

ఎక్కడా అన్నట్టు అటూ ఇటూ తలని ఊపుతూ గది అంతా చూస్తుంది.

కంట తడి పెట్టుకుంటు, వెంకటేశ్వర్: ఇప్పుడే కాదు, వాడికేదో టెస్ట్ లు చేస్తారట ఆ తరువాత

లక్ష్మి కాస్త ధైర్యంగా ఉంది, అసలు విషయం తెలీక. అలా రెండు గంటలు గడిచాయి, హాస్పిటల్ సిబ్బందివాళ్ళువెంకటేశ్వర్ ని రమన్నారు. లక్ష్మి మూడు రోజులు బెడ్డు మీద నుంచి లేవ కూడదు అని అక్కడే ఉంది. వెంకటేశ్వర్ గబగబా ఒకవైపు భయపడుతూ, ఇంకో వైపు కొడుకుని చూస్తున్నా అన్న సంతోషంలో పరిగెత్తాడు. వెంకటేశ్వర్ ని, ముసలాయన్ని ఇద్దర్నీ లోపలికి పంపించారు. కానీ ముట్టుకోకూడదు అని, 3 అడుగుల దూరంనుంచే చూడాలిఅని షరతులు విధించారు. ఊ అని లోపలికి వెళ్ళి తన కొడుకుని కళ్ళారా చూసుకున్నాడు.

తన అరచేతి అంత ఉన్నాడు శిశువు, కళ్ళు మూసుకుని, తన ఇప్పుడే తయారవుతున్న దుమ్ము రేణువుమందంచర్మం, నరాలు బయటకి కన్పిస్తున్నాయి, ఆ చిన్న చేతులకి ఆ చేతి కంటే పెద్ద సలైన్ సూదులు గుచ్చి, మూతికిఆక్సిజన్ మాస్క్ పెట్టి, మొహం కూడా సరిగ్గా కనిపించడం లేదు. తల గుండు మాత్రమే కనిపిస్తుంది. ఎడుచుకుంటూ కూర్చున్నారు అక్కడే పావుగంట.

అప్పుడు హఠాత్తుగా శిశువు ఏడుపు మొదలు పెట్టాడు, తల్లిపాలు తాగాల్సిన వాడు, సలైన్ మందుగుచ్చుకున్నాడు. నర్స్ ముట్టుకొనివడం లేదు, పిల్లోడు ఉక్క పెట్టి ఏడుస్తూనేఉన్నాడు. ఏమీ చెయ్యలేని పరిస్తితి. ఇంకా 20 రోజులు ఇలాగే. తన కళ్ళ ముందు అలా పసి కందువిలాలలాడుతుంటే గుండె తరుక్కుపోతుంది. తండ్రి ఓదారుస్తూ చేసేదేమీ లేదు అని ఇక ఆ గోష వాళ్ళ కళ్ళతోచూడలేక బయటకి వచ్చేశారు.

హాస్పిటల్ బిల్లు కట్టడం, బాబు మైంటైనన్స్ బిల్లు, మెడిసిన్ బిల్లు అన్ని కట్టాడు. 3 రోజులు గడిచాయి, లక్ష్మిఅస్సలు ఆగట్లేదు, ” నా బిడ్డని చూడాలి చూడాలి ” అని తల్లి పేగు ఘోష హాస్పిటల్ అంతా వినిపించేలాఅరచిగోల చేస్తుంది. అప్పుడు తీసుకెళ్లారు. బాబుని అలా చూసి గుండె ఆగిపోయింది, తట్టుకోలేక పోయింది.

వెళ్లి ఎత్తుకునే ప్రయత్నం చేసింది, కానీ ఆపారు. లక్ష్మి ఏడుపు చూసి, అక్కడున్న నర్సు, డాక్టరు, అందరికల్లెంబడా నీళ్ళు వచ్చాయి. అప్పుడే బాబు మళ్ళీ ఏడ్చాడు, ఇక లక్ష్మి ఆగేలా లేదు శిశువు వైపు అడుగేసింది, ఇద్దరు నర్సులు పట్టుకుని ఆపినా ఆగట్లేదు. వెంకటేశ్వర్ కూడా పట్టుకుని లాగి బయటకి ” ఏం కాదే ఏం కాదు, ఇంకో రెండువారాలు అంతే ” అని చెప్పుకుంటూ బయటకి లక్ష్మి రాకున్నా ఈడ్చుకెల్లాడు. వెంకటేశ్వర్ తమ్ముడివాళ్ళు వచ్చారు, స్నేహితుడు రాజేశం కూడా వచ్చాడు. సంగతి తెలుసుకుని వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నంచేసారు. అలా చిరవరికి20వ రోజున ప్రొద్దున బాబుని అప్పజెప్తాము, ఇంటికి కూడా తీసుకువెల్లవచ్చు అన్నారు, వారి సంతోషానికిఅవదులు లేవు. కానీ అప్పుడే ఇంకా కొన్ని షరతులూ జాగ్రత్తలూ. బాబు ని ముద్దుపెట్టుకోకూడదు అని, తల్లి తప్పఎవరూ ముట్టుకోవద్దని. అతి ముఖ్యంగా బాబు మెదడు, పుర్రె బొక్కలుబలహీనంగా ఉన్నాయని, తల మీద దెబ్బతాకడం కాదు, చిన్నగా ఒత్తిడి కూడా కాకూడదు అని హెచ్చరించారు.