” ఇక్కడ బోర్ కొడుతుంది రా 10 వరకి రెఢీ ఉంటా రా ఎటైనా పోదాం ”
” సరే వస్తా ”
.
.
.
.
.
.
“ హా వచ్చినా రా బయటకి. ”
“ కార్ తెచ్చావు bike లేకుండే నా? ”
“ ఎదో ఒకటి ఎక్కు ”
” పోనియ్యి ”
.
.
” ఏమైంది అలా బిగుసుకుపోయి చూస్తావు పోనివ్వూ ”
” ఎక్కడికే ”
” ఏమో ఎటో, ఎటైనా పోనివ్వు, ఇవాళ నీతో ఉండాలని ఉందిరా ”
” ఎలా ఉన్నారా డ్రెస్ బాగుందా? ”
” నీకంటే నువ్వు ఎదేసుకున్నా బానే ఉంటావు ”
” నీకు yellow ఇష్టం కదరా, చున్నీ అందుకే yellow ”
” హ్మ్మ్…. ”
” ఏం చేస్తున్నావురా, ఇక్కడే ఉంటున్నవా? ”
” మొన్నే చెప్పిన కదా మళ్ళీ అడుగుతావే ”
” హ్మ్మ్….. సరే ఇప్పుడు మనం ఎటు పోతున్నాము ”
” ఏమో నాకేం తెలుసు, నువ్వు పొమ్మనవ్ పోతున్న, వరంగల్ హైవే లో ఉన్నాం. ”
” ఎక్కడైనా ఆపు, restaurant, hotel ”
.
.
.
.
.
.
” హా హోటల్ అన్నవుగా కూర్చో నేను కాఫీ తీసుకొస్తా ”
” నువ్వు టీ తెచ్చుకున్నావు ”
” నీకు తెలుసు కదా, హా…చెప్పు ఏమైంది ఎందుకు ఇలా సడెన్ గా ఎటైనా పోదాం అన్నావు ”
” ఏమో, నాకు అక్కడ ఉండబుద్ది కావట్లేదు, ఇంటికి పోవాలి లేదా టూర్ కి పోవాలి అనిపిస్తుంది. ”
” మరి పోదామా? ”
” ఎటూ? ”
” నీ ఇష్టం ఇండియా లో ఎక్కడికైనా పోదాం ”
” ఇండియా లో ఎందుకు ప్రచాంచంలో ఎక్కడికైనా పోదాం అను ”
” అనొచ్చు కానీ, నాకు పనుంది కదా ”
” అంటే నాకంటే పనే ఎక్కువైందా ”
” ఓయ్ నీకు తెలీదా, అలా అంటావు ”
” సరే సరే, నీతో ఉండాలి అని ఉందిరా ”
” ఏమైందమ్మా నీకు ఇవాళ ”
” అలా అంటావెంట్రా, అన్నీ మరచిపోయావా? ”
” ఇలాగే అంటావు తల్లి నువ్వూ, మళ్ళీ నీకో జాబ్ లేదు, గాలేదవ, నన్ను ఏం పెట్టి పోసిస్తావు, మా వాళ్ళు ఏంచేస్తాడు అని అడుగుతే ఏం చెప్పాలి, తొక్క తోటకూర అని సోది ”
” అదీ….”
” ఇగ వాడు, వాడి బాధ ఏంటే, నేనేం అన్నా అని ”
“ వాన్నేం అనకు చెప్తున్నా “
” సరే ఇప్పుడెందుకులే, అయినా నా జీవితం ఇలా రాసుంది, ఎదో చేద్దాం అనుకుని చెప్పింది చెయ్యాల్సివస్తుంది. ”
” ఏయ్ ఇక ఆపు, ఏదైనా ఇంటరెస్టింగ్ గా మాట్లాడు ”
” ఇంటరెస్టింగ్ గా ఏముందీ ”
” అవునూ నన్ను మీ అన్న వాళ్ళింటికి తీసుకెళ్లవా? ”
” వాళ్ళు లేరు ఇప్పుడు ”
” ఎటు వెళ్ళారు ”
” ప్రపంచానికి దూరంగా, ఒక పనికిమాలిన పని పెట్టుకుని ఎదో పనిచేసుకోవడానికి పోయారు ”
” సక్కగ మాట్లాడావారా నువ్వు ”
” హహహ….. వాళ్ళ గురించి ఎందుకే మనం ఏం చేద్దాం చెప్పు ”
” అదే ఆలోచిస్తున్నా… మ్…. ”
” రా వెళ్తూ మాట్లాడుకుందాం ”
” హేయ్ వస్తున్నా కదా లాక్కపోతావే ”
” నువ్వు రామప్ప కి పాయినవా ఎప్పుడైనా? ”
” పోలే..”
” చెలో రామప్ప దాకా పోయి వద్దాం, చూసినట్టు కూడా ఉంటది ”
” నీ ఇష్టం రా ”
” ఏదైనా మాట్లాడే ”
” ఏమో రా నాకేం మాటలు వస్తలేవు ”
” అసలు నువ్వెప్పుడు సరిగ్గా మాట్లాడేదానివి ”
” కార్ ఎందుకు ఆపినవు? ”
” ఉత్తిగనే..”
” రేయ్ అలా చూస్తున్నావు ఏంట్రా…? ”
” Back seat కి పా…”
” ఎందుకూ? ”
” చెప్తా పా ”
.
.
.
.
.
” సరే చెప్పు… ”
” ఒక్క కిస్ ఇవ్వే ”
” ఆ… నువ్వు ఇదే అడుగుతావు అని తెలుసు, ఇవ్వను ”
” నువ్వెంత బాగుంటావు తెల్సా ”
” భుజం మీద చెయ్యేస్తావు తియ్యు ”
” నన్ను ఓ లవ్ చేస్తున్నా అన్నవుగా ఒక్క ముద్ధివ్వు ”
” సరే….”
” హ్మ్మ్…..”
” ఉమ్మ….”
” ఎంది చెంపకి ఇచ్చావు దీన్ని కిస్ అంటారా ”
” అనరా? ”
” నేను అడిగేదీ”
” స్ఫ్చ… లిప్స్ టచ్ చెయ్యకు నువ్వు ”
” నీ లిప్స్ ఏనే నాకిష్టం ”
” అయితే ఏంటి, ముందు పెళ్లి చేస్కో ”
” ఆ అది అయినట్టే వాడు ఒప్పుకోడు, మీ అయ్య నా బిడ్డకి మంచి జాబ్ ఉన్న వాడు కావాలి అంటడు ”
” మరి జాబ్ చెయ్యిరా ”
” అసలు నేను జాబ్ ఎందుకు చెయ్యాలి చెప్పు, మాకున్న పొలం కౌలుకిచ్చిన, అన్నయ్య ఆల్రెడీసంపాదిస్తున్నాడు. ”
” మీ అన్నని కాదు హీరో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటున్న, నువ్వు జాబ్ చెయ్యాలి ”
” ఏ పోవే 24 ఏళ్లకే జాబ్ చేసి నేనేం పీకాలీ ”
” నన్ను పెళ్ళి చేసుకోరా ”
” అబ్బా పెళ్లి గోల తర్వాత, ఒకటి ఇవ్వే ”
” అన్నీ పెళ్లి తర్వాతే ”
” ఏ కాలమే నీది, అన్ని పెళ్లి తర్వాతే అంటావు ”
” సరే మూస్కొని పదా రామప్ప అన్నావుగా ”
” ఎటూ వద్దులే, అసలు ఏం చేద్దాం ”
” అదే గా నాకు తెలియట్లేదు, ఏం చేద్దాం అని. కాసేపు సైలెంట్ గా ఉండురా ఇక్కడే ఉందాం ఇలాగే నువ్వునేను. ”
” ఇక్కడ వద్దు ఎవరైనా చూస్తే ఏమో అనుకుంటారు నా రూం కి పోదాం పా ”
” సరే…”
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
” కూర్చో, తినడానికి ఏదైనా ఆర్డర్ చేస్తాను. ”
” హా…. Grand Bawarchi paneer butter with roti చెయ్యి సూపర్ ఉంటది ”
” సరే…. నేను కూడా అదే చేసుకుంటా ”
.
.
.
” అలా మొహం కడుక్కుందాం అని వెల్లానో లేదో, నా చున్నీ ఎందుకు పెట్టుకున్నావు, నీకేం పనిరా ”
” నా ఇష్టమే నా పెళ్ళాం చున్నీ నా ఇష్టం ”
” ఏంటీ నీకు పెళ్ళైందా, ఎవరో ఆ దరిద్రురాలు ”
” నువ్వే… ”
” హహహ…అలా చూస్తున్నావ్ ఏంట్రా ”
.
.