ప్రేమ కాటులు Part 11 116

” హే…దగ్గరికి రాకు మా అన్నకి చెప్తా ”

” ఆ చెప్తే ఏం పీకుతాడే వాడు ”

” వెనక గోడ ఉంది నేను ఇంకా వెనక్కి వెళ్ళలేనూ, ఆగు ”

” ఆగను ”

” వద్దూ…. నేను పోతాను. ”

” ఎక్కడికి పోతావు ”

” అబ అటూ ఇటూ చేతులు వేస్తే నేను తప్పించుకొని అనుకుంటున్నావా ”

” మరి….”

” ఇగో ఇలా వంగి జారీ తప్పించుకుంటా, హెహే ఇప్పుడు పట్టుకో ”

” ట్రింగ్ ట్రింగ్….. ఆర్డర్ సార్ ”

” ఇటు ఇవ్వు, థాంక్స్ ”

” తిందాం రా ఆకలేస్తుంది. ”

” దా నాకుడా అక్కడ ప్లేట్స్ ఉంటాయి తీసుకురా. ”

.
.
.
.
.
.

” ఇది నువ్వే వెస్కొరా నాకు చాలు ”

” ఎందుకే తినూ ”

” నువ్వే తిను నాకు చాలు అంటున్నా కదా ”

” 4 అవుతుందే, అటూ ఇటూ తిరుగుతూ ఉంటే టైం ఏ తెలియలే ”

” నీళ్లన్నీ తాగేసావా, ఆగు ఇంకో బోటల్ తెస్తా ”

.
.
” అరేయ్ ఫ్రిడ్జ్ లో వోడ్కా ఎందుకు ఉంది, అంటే నువ్వు తాగుతావా ”

” అవును ఏ తప్పా ”

” అయితే నేను కూడా తాగుతా ”

” ఎంది షట్….ఆగు ”
.
.
.
” ఇగో రా నువ్వు కూడా తాగు ”

” ఒసేయ్ అది వోడ్కా కాదే pure ethyl alcohol ”

” అయితే ఎమైతది? ”

” హే….. ఉఫ్ పడిపోయింది. ”
.
.
.
.
.
.
.
.
.
.
.

” 10 ఐతుంది ఇది ఇంకా లేవట్లేదు, శా…”

” ఉమ్… హ్వా… ఏమైంది రా అలా కూర్చున్నావ్, అవును నేను బెడ్ లో ఎందుకు ఉన్నా, ప్యాంట్ ఎదిరాshorts వెస్కున్నవ్, నా చున్నీ లేదు, నా watch, అమ్మా……ఆ….”

” ఒసేయ్ ఒసేయ్ ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు ”

” పెళ్లి దాకా ఆగలేవా నాచేత వోడ్కా తాగించి, మమ్మీ నన్ను రీప్ చేసాడు, ఆ..ఆ….”

” నేనేం చెయ్యలేదు అరె నేనేం చెయ్యలే…. నువ్వే పడిపోయావు ఇక్కడ పడుకోపెట్టిన ”

” లేదు నువ్వు నన్ను మందు తాగించి పెళ్లికి ముందే… ఆగు మా అన్నకి చెప్తా…..”

” చుప్…. ఏం చెయ్యలే అంటే ఒర్రుతవ్ ”

” నిజంగా ఏం చెయ్యలేదా ”

” అదే కదా నేను మొత్తుకునేది ”

” ఒక ముద్దు కూడా పెట్టుకోలేదా? ”

” లేదు…..”

” Useless…. నువ్వు దేనికి పనికి రావు ”

” ఏంటి? ”

” నీతో ఇలా వచ్చాను చూడూ వేస్ట్ ”

” అంటే…. ”

” అంటే అంటా అంటే, అవకాశం వచ్చినప్పుడు వాడుకునే తెలివి లేదు కానీ బిత్తిరోడా. అమ్మాయి దగ్గరకి వస్తూబండి తేకుండా కార్ తెచ్చావు, unromantic fellow. ”

” ఆగు ”

” ఏ లే… నా చెయ్యి వొదులు, నేను పోవాలి నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చెయ్యి ”

” ఆగు తిని పో ”

” హ్మ్మ్…..”

కొన్ని రోజుల తరువాత, దీపా వచ్చి కాజల్ ని ఆమె పెళ్ళి షాప్పింగ్ కి తీసుకెళ్ళింది. అప్పుడు గంగ కోసం ముప్పై లక్షలు కావాలి అని శివ గౌతమ్ ని డబ్బులు అడిగితే ఆరోజే గీత తెచ్చి ఇచ్చింది. గీత డబ్బులు అప్పజెచ్చి వెళ్ళిపోయాక శివ ధనుష్ ని రమ్మన్నాడు. ధనుష్ వచ్చాక, డబ్బుల బ్యాగ్ చేతికిచ్చాడు.

శివ: నికు లొకేషన్ షేర్ చేసా, అక్కడ గంగా అని నా ఫ్రెండ్ ఇచ్చిరా సరేనా ?

ధనుష్: ఇవాళా కాలిగానే ఉన్నావు కదా నువ్వే పోవచ్చు కదా అన్న?

శివ: నేను పోతే వేరే సమస్య రా నువ్వే పో, ఇచ్చి ఇక్కడికే రా

ధనుష్: సరే అన్న

ధనుష్ బయటకి తిరుగుతూ ఉంటే,

శివ: ఇంకోటి, పో, డబ్బులు ఇవ్వు, రా. అంతే తనతో మాట్లాడకు. ఒకవేళ ఇక్కడికి వస్తా అంటే వద్దూ అని చెప్పు

ధనుష్: సరే అన్న

ధనుష్ బ్యాగ్ తీసుకొని, శివ కార్లో పెట్టుకొని బయల్దేరాడు. లొకేషన్ ఇరవై ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది. అక్కడికి వెళ్ళాక హైవే పక్కన పెద్ద వేప చెట్టు కింద సోడా బండి కొట్టు దగ్గర శివ స్నేహితురాలు గంగ, గ్రీన్ కాటన్ చీర కట్టుకొని, ఫాన్సీ జాకెట్ వేసుకొని ఉంది. కళ్లకు గ్రీన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి తనని చూసి బ్యాగు తీసుకొని దగ్గరికెల్లాడు.

గంగ ధనుష్ ని కిందకి నుంచి పైకి చూసింది. గంగ మొహం కొంచెం బెంగగా అనిపించి ధనుష్ కి. అది బయటకి కనిపించకూడదు అని గ్లాసెస్ పెట్టుకుంది అనుకున్నాడు.

ధనుష్: గంగ….?

గంగ: యా ఇట్స్ మీ.

ధనుష్: ఈ బ్యాగ్ లో నలబై లక్షలు ఉన్నాయి.

అంటూ చేతికి ఇచ్చాడు.

గంగ బ్యాగ్ తీసుకోకుండా ధనుష్ చెయ్యి పట్టుకుంది. ఎంటా అని గంగని చూసాడు.

గంగ: ఏకడుంటున్నవు ఇప్పుడు?

ధనుష్: ఇక్కడే హాస్టల్ లో ఉంటున్న. బ్యాగ్ తీసుకోండి నేను వెళ్ళాలి.

అప్పుడే ఇంకో చేత్తో కళ్ళకు ఉన్న గ్లాసెస్ తీసింది. గంగ మొహం నిండుగా చూసి ధనుష్ షాక్ అయ్యాడు.

ధనుష్: ను…. నువు…. నువు….

గంగ: హ్మ్మ్….. నేనే……..

బ్యాగ్ వదిలి టక్కున హత్తుకున్నాడు.

ధనుష్: నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు, ఐలాండ్ అంత పిచ్చొడిలా తిరిగాను తెల్సా. మళ్ళీ అన్న ఫోన్ చేశాక తెలిసింది.

గంగ: సారీ రా…. నువు నాతో వస్తావు అని అంటావు, నా వల్ల పడ్డ ఇబ్బంది చాలురా నీకు

ధనుష్: లేదు, నువ్వే లేకుంటే నేను ఎలా ఉండేవాడిని అసలు చెప్పు

ఇద్దరూ ఒకరి మొహం చూసుకొని, గంగ ధనుష్ చెంపలు తడుముతూ నవ్వింది. ధనుష్ కూడా నవ్వాడు.

గంగ: ఎలా ఉన్నాను?

ధనుష్: బాగున్నావు.

గంగ: శివ దగ్గరకి తీస్కపోరా

ధనుష్: ఓ…. అది మాత్రం అడగకు. ఇప్పుడు నిన్ను తీస్కపోతే నన్ను ఎస్తడు

కోరగా చూస్తూ, గంగ: హండ్సంగా ఉన్నావురా

ధనుష్: నువు నన్ను ఇన్వాల్వ్ చెయ్యకు

గంగ: అర్థం చేస్కొరా నన్ను, నాతో రా ఇవాళ

ధనుష్: చి చి… నన్ను వదులు, నేను నీకు తమ్ముడి లాంటోన్ని

గంగ: అది అప్పుడు రా ఇప్పుడు కాదు.

దూరం జరిగాడు, ధనుష్: నేను పోతా. ఇందుకే నీతో మాట్లాడకు అని చెప్పాడు అన్న.

గంగ: రేయ్ రేయ్ ఆడదాన్ని ఒక్కదాన్నే వదిలేసి పోతున్నావు

ధనుష్: గివ్వే తక్కువ్వైనయి నీకు.

బ్యాగ్ గంగ కి అందించి వెళ్ళిపోతూ కార్ ఎక్కాడు

గంగ: ఆగురా…..

అయినా ఆగకుండా ధనుష్ వెళ్ళిపోయాడు.


రెండు గంటల తరువాత, సాయంత్రం చీకటి పడుతుంది.

శివ సోఫాలో వెనక్కి ఒరిగి తల పట్టుకున్నాడు.

ధనుష్: అన్నీ చేసి ఇప్పుడెందుకు ఆ బాధ, అయినా ఒక్క ప్రూఫ్ కూడా లేదుగా

శివ: దాని గురించి కాదు. వాడు వస్తే ఎలా అని

ధనుష్: ఏమవ్వుద్ధి, వదినతో చెప్పు జరిగింది. అన్న నువు నా మాట వినవు కానీ చెప్పేసేయు రా, మీరు చేసినదానికి ప్రూఫ్ కూడా లేదు. నువు ఎలాగో బయట పడ్డావు. చాణక్య ఉన్నా ఎవ్వరికీ తెలీదు. మనకి తప్ప. ప్రసాద్ ని చంపేసావు. నా మాట విను. వదినకి చాన్ గురించి చెప్పి, అంతా మర్చిపొమ్మని అడుగు

శివ: అది అంత సులువు కాదు. చాన్ కాజల్ ని కలవకూడదు.

ధనుష్: వచ్చి నాలుగు రోజులు అవుతుంది, నేను వద్ధనా తను రాలేడా చెప్పు.

శివ: అది కాదు చిన్నా, నీకు అసలు విషయం తెలీక అలా అంటున్నావు. నీకు కూడా చెప్పలేదు నేను.

ధనుష్: ఏంటి? ఇంకేం దాస్తున్నావురా. ఇప్పటికే చేసినవి చాలవా, అంత మానుకొని ప్రశాంతంగా ఉంటున్నాము.

శివ మాట్లాడకుండా మౌనంగా తల పట్టుకొని కాళ్ళూ మూసుకున్నాడు. ధనుష్ కూడా ఏం అడగకుండా మౌనంగా ఉన్నాడు.

ఇంటి ముందు కార్ ఆగింది.

ధనుష్: వదిన వచ్చింది. అన్నా కావాలంటే నేను బయటకి పోతాను చెప్పురా. సాయి అన్న చెపుతా అంటేనే నేనే ఆపిన. గంగ వచ్చి చెప్పడం కంటే నువు చెప్పడమే మంచిది. నీ ఇష్టం రా.

కాజల్ కార్ దిగి, ఎవరితోనో, “ రావడం కాదు, భోంచేసి పోవాలి. ” అంటూ మాట్లాడుతూ వస్తుంది.

ఇంకొకరు, “ తప్పదా…. మీ వారు ఏం అనుకొరా ” అంటూ ఒక ఆడగొంతు, అదీ తెలిసిన గొంతు.

ధనుష్ అనుమానంతో లేచి, గుమ్మం దగ్గరికి పోయి నిల్చున్నాడు. ముందు కాజల్ తో పాటు గంగ ఉంది. షాక్ అయ్యి భయమేసి తడబడి పోయాడు.

కాజల్: హేయ్ ధనుష్, ఎప్పుడొచ్చావు?

కాజల్: తను మా శివ తమ్ముడు. ఇక్కడే లోకల్ లో ఉంటాడు.

ధనుష్ ఏం చెయ్యలేడు చూస్తూ ఉన్నాడు.

కాజల్ గంగ ఇద్దరూ లోపలికి వచ్చారు.

శివ అలా మొహానికి మోచేతు అడ్డం పెట్టుకొని అలిసిపోయినట్లు పడుకోవడం చూసి కాజల్ కొంచెం దిగులు పడింది. కానీ గంగ ని చూపించాలి అని పిలిచింది.

కాజల్: దీపా అటునుంచి అటే వెళ్ళిపోయింది. శివ నికో సర్ప్రైజ్ ఎవరొచ్చారో చూడు

అలా చెప్పగానే కళ్ళు తెరిస్తే ముందు గంగ. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనయ్యింది. కళ్ళు పెద్దచేసుకొని కంగారుగా చూసాడు.

కాజల్: ఏమైంది అలా చూస్తున్నావు. నువు హాపీ అనుకున్న మీ ఫ్రెండ్ ని కలిస్తే

ఇంతలో గంగ ముందుకి అడుగేసి శివ చెంప మీద కొట్టింది. కాజల్ కి కోపం వచ్చింది. ఇంకో దెబ్బ కొట్టబోతే ఆపింది.

కాజల్: వాట్ హపెన్డ్