శివ తిన్నాడు.
లక్ష్మి: ఇక పడుకో నాన్న, జీవితంలో మనం అనుకున్నవి అన్ని జరగవు శివ, ఆ భగవంతుడు కొన్ని ఇచ్చినాకొన్నితీసుకుంటాడు. నాన్న మాట విని రేపటి నుంచి అన్ని పనులు నువ్వే చూస్కో.
అని చెప్పి శివ ని నిద్రపుచ్చి, వెళ్లి పడుకుని,
వెంకన్న: ఏం బతుకే ఇది, ఇంత సంపాదించి, అన్ని ఉంటే వాడు ఎది చెయ్యలేక ఇంట్లో ఉండాలి. నాకుమాత్రంలేదానే వాడు సంతుషంగా ఉండాలి అని.
లక్ష్మి: అవన్నీ మర్చిపోండి, 3 ఏళ్లు ఆగితే వాడికి పెళ్లి చేస్తే అన్నీ అవే సర్దుకుంటాయి.
మరుసటి రోజు ఉదయం, 5 గంటలకు లక్ష్మి లేచి ఇల్లు ఊడుస్తునది.
శివ ఇంట్లో లేడు.
అది సంతగి శివ ఇల్లు వదిలి పారిపోయాడు.
ఊరి అవతల, రమేష్ శివ ని చూసి,
రమేష్: శివ ఇంత పొద్దున్నే ఎటు రా, ఆగు (అని ఆపడానికి ప్రయత్నిస్తే)
శివ పిచ్చి కోపంలో ఉన్నాడు.
రమేష్ ని ఒక్క తోపు తోశడు, రమేష్ వెళ్లి 10 అడుగుల దూరంలో పడ్డాడు.
రమేష్ ఏంటి వీడు ఇలా ఉన్నాడు. వెంటనే ఇంట్లో చెప్పాలి అని ఇంటికి వెళ్లి చెప్పాడు.
శివ ఇంట్లో నుంచి తెచ్చుకున్న డబ్బు తో ఇక IIT కాన్పూర్ వెళ్ళిపోయాడు.
పార్వతి intermediate అయిన తరువాత,
శివ: ఇటు చూడవే…
అని పార్వతి ని బతిమిలాడుతూ,
పార్వతి: పో శివ… నీ కళ్ళలో చూస్తే నాకు ఎదో అవుతుంది.
సిగ్గు పడుతుంది,
శివ: అబ్బా ఒకసారి, చుడు నీ కళ్ళు కూడా చాలా బాగుంటాయి.
పార్వతి చూసింది,
అలా ఇద్దరు ఒకరి కళ్ళలో కి ఒకరు చుస్కుంటూ,
పార్వతి: శివ…
అని తన పెదాలు దగ్గర శివ కి దగ్గర చేస్తూ, వనుకుతుంది,
శివ: ఎంటీ…?
అని సన్నగా అడిగాడు,
పార్వతి: నిన్ను చాలా భాదపెట్టానా?
శివ: లేదు పారు, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నాకు ఇష్టమే.
పార్వతీ: హ్మ్మ్.
శివ: ముద్ధొస్తున్నవే…
పార్వతి: పెట్టుకో రా..
శివ: ఉమ్మ్మ్….
అని పెట్టుకున్నాడు.
శివ కి తల నొప్పి మొదలైంది,
శివ: ఆ నొప్పి… పారు
పార్వతి హఠాత్తుగా బయపడి, కళ్ళలో నీరు వచ్చి,
పార్వతి: ఏమైంది శివ..ఆ?
శివ: ఏం లేదు ఏం లేదు బయపడకు….
పార్వతి: అదేంట్రా…
శివ: నాకేం కాదు. పారు నువ్వెప్పుడు నా పక్కనే ఉంటావ్ గా…
పార్వతి: ఉంటారా…
శివ: నన్ను జాగ్రత్తగా చుస్కుంటావ్ గా?
పార్వతి ఏడుస్తూ,
పార్వతి: ఎందుకు రా అలా అంటావు, నువ్వంటే ఇష్టం రా నాకు. నిన్ను నేను కాపాడుకుంటా.
శివ: అవును పారు… నా పక్కనే ఉం….డు..
అని స్పృహ తప్పి పడిపోయాడు.
పార్వతి ” హా….” అని నిద్రలోంచి లేచి, భారంగా ఊపిరి పేర్చుకుంటూ, ” ఏంటి ఇదంతా కళా, పొద్దున్నే ఆవేస్ట్ గాడు వచ్చాడెంటీ, నేను ముద్దు పెట్టడం ఎంటి, ” అనుకుంది.
ఇలా కొన్ని సార్లు జరిగింది.
ఒకరోజు అర్థరాత్రి కల వచ్చింది, మళ్ళీ లేచి,
పార్వతి ” ఏంటి వీడు, చాలా గుర్తు వస్తున్నాడు, పారు ఏమైందీ నీకు, వాడిగుర్చి ఎందుకు ఆలోచిస్తున్నావు, పడుకో… ” అని తనకు తానే చెప్పుకుంది పడుకుంది.
అయినా తన ఊహల్లో శివ నే కనిపిస్తున్నాడు.
పార్వతి మనసు: పారు నువ్వు వాడిని ప్రేమిస్తున్నావే, ఒప్పుకో ఇక.
మెదడు: లేదు, అస్సలు లేదు, ఆ పిచ్చోడు నీకు సెట్ కాడు. అంతా నీ భ్రమ.
మనసు: లేదు, వాడు నీ మనసులో ఉన్నడు కాబట్టే నువ్వు వేరే మగాడి వంక చూడట్లేదు.
మెదడు: లేదు చదువు మీద ధ్యాస అంతే.
పార్వతి కి ఆలోచనలతో బుర్ర పాడైపోతుంది.
రాత్రంతా నిద్ర లేదు.
ప్రొద్దున్నే లేచి,
పార్వతీ: అమ్మ నేను పేరు మార్చుకుంటాను.
అది విన్న వాళ్ళ అమ్మ, విచిత్రపోయి,
శారద: ఒసి పిచ్చిదాన ఎంటే పొడ్డుపొడ్డునే కల ఏమైనా కన్నవా?
పార్వతి: లేదమ్మా ప్లీజ్ నేను పేరు మార్చుకుంటా.
శారద: నాకు తెలీదు మీ నాన్నని అడుగు.
పార్వతి ” అబ్బా వీళ్ళని ఎలా ఒప్పించాలి, సరే నాన్న నే అడుగుదాం ” అనుకుంది.
సుదర్శన్ టీవీ ముందు కూర్చొని, వార్తలు వింటూ చాయ్ తాగుతూ ఉన్నాడు.
పార్వతి: నాన్న నేను పేరు మార్చుకుంటాను.
సుదర్శన్ ఒకేసారి కలుక్కుమని, ఇటు తిరిగి,
సుదర్శన్: అదేంటి, ఎందుకు?
పార్వతి: ఒకడు శివ అని మన పేర్లు కలుస్తాయి, పెళ్ళిచేసుకుందాం అన్నాడు.
అని అలకాగా చెప్పింది.
ఇది వింటున్న గంగమ్మ అప్పుడే ప్రొద్దున్నే వీళ్ళను కలవడానికి వాస్తు, లోపలికి వచ్చింది. వచ్చీరాగానేపార్వతిమాటలు చెవిన పడ్డాయి.
గంగమ్మ: అయితే నీ బిడ్డకి పెళ్లి ఈడు వచ్చిందిరా తమ్ముడు.
పార్వతి ” ఛ ఇది ఇప్పుడే రావాలా, ఎదో ఒక పుల్ల పెడ్తుంది ” అనుకుంటూ ఉండగా గంగమ్మ అలా అన్నది.
పార్వతి: ప్లీజ్ నాన్న, పార్వతి పేరు నాకు నచ్చలేదు.
గంగమ్మ గడుసుగా మొహం పెట్టి,
గంగమ్మ: పట్నం కాలేజ్ కి పోయి అన్ని ఈ కాలం లా తయారయ్యావు, ఆ పొట్టి బట్టలు వేసుకుంటూ ఉంటేమోగవెదవలు వెంట పడరా మరి.
పార్వతి: అత్త నువ్వు ఆగుతావ.
శారద పార్వతి ని వెనకేసుకొస్తు,
శారద: అయినా నా బిడ్డ అందంగా ఉంటుంది, అది ఏ బట్టలు వేసుకున్న, ఏంటి. ఏవండీ, రేపుగురువారం, ఒకసారి మన శ్రిపాధ రావు గారిని అడిగి పేరు మర్పిస్తే సరి. దాని కోరిక ఎందుకు కాదనాలి.
గంగమ్మ: అదేంటి మరదలా అలా అంటావు, పార్వతి అనే పేరు ఎంత బాగుంది.
శారద: అవును వదిన కానీ దాని కోరిక ఎందుకు కాదనడం, ఈ కాలం పేరు పెట్టుకుంటా అంటుంది , మీరుచెప్పండీ?
సుదర్శన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. పార్వతి ని చూసాడు, పార్వతి ప్లీజ్ అన్నట్టు చూస్తుంది.
సుదర్శన్: సరే.
ఇక గురువారం,
శ్రిపాధ గారు: సమస్య ఎం లేదు, అమ్మాయి అంతగా కోరుకుంటే మార్చుకోండి.
అని సమాధానం ఇచ్చారు.
ఇది విని,
పార్వతి: కాజల్ అని పెట్టుకుంటా.
