కాజల్ కాలేజ్ వచ్చామా, క్లాస్ విన్నామా లైబ్రరీ లో కాసేపు చదువామ ఇంటికి వెళ్ళామా అంతే, ఇంకేం లేదు.
దీపా కూడా లైబ్రరీ కి వచ్చేది, కాజల్ ని గమనిస్తూ ఉండేది. కాజల్ books తీస్కున్నమా చదివాక నోట్స్రాకోడంపోవడం అంతే.
అలా ఆ year గడిచాక ఒకరోజు సాయంత్రం, ఇంటికి పోవడానికి బస్టాప్ కి వెళ్తూ ఉంటే, కృష్ణ వెంట రావడంతెలిసి ఆగింది.
కృష్ణ కూడా ఆగాడు, కాజల్ టక్కున వెనక్కి తిరిగింది.
కృష్ణ ఏం చెయ్యాలో తెలీక, కోతిలా దిక్కులు చూసాడు.
కాజల్ పొగరుగా వాడి వైపే నడిచింది. అంతే చెమటలు పట్టేసాయి వాడికి,
కృష్ణ ” వామ్మో వస్తుంది, ఏమైనా అంటుందా, అసలు అందరూ ఉన్నారు, కొడుతుంది కావచ్చు jump అవ్వడంబెటర్ ” అనుకున్నాడు, వెనక అడుగు వేశాడు.
కాజల్: హెయ్ ఆగు,
అని పిలిచింది.
కాజల్ పిలవగానే కృష్ణ ఆగాడు. వెనక్కి తిరిగాడు.
కాజల్ దగ్గరకి వచ్చి,
కాజల్: నీ పేరు కృష్ణ కదా?
కృష్ణ: అవును.
అప్పుడు ఒక truck సర్రుమని దూసుకెళ్లింది, అది వీళ్ళకి అడుగున్నర దూరంలో వెళ్ళింది, అదిపోయినవేగానికి కాజల్ కురులు పైకి లేచి అలలు ఆడాయి.
కృష్ణ ఆ చప్పుడుకి జనికాడు. కాజల్ మాత్రం కంటి లో కలక లేదు.
కాజల్: ఏంటి నన్ను ఫాలో అవుతున్నవూ 1st year నుంచి చూస్తున్న. Love ఆ?
కృష్ణ వేళ్ళు నలుపుకుంటూ, ఆతృతగా ఏం మాట్లాడకుండా, కాస్త తల కిందకు వేసుకొని,
కృష్ణ ” ఇదేంటి ఇలా అడిగేసింది, ”
కృష్ణ: అది… ఆ… అవును నువ్వంటే ఇష్టం కాజల్.
కాజల్ కృష్ణ కళ్ళలోకి సూటిగా చూస్తూ,
కాజల్: దగ్గరకి రా…
కృష్ణ దగ్గరకి జరిగాడు.
కాజల్: ఇంకా…
ఇంకా జరిగాడు, కృష్ణ తల కాస్త పైకి ఎత్తి, కంటి కొసరు తో అక్కడ busstop దగ్గర జనం ని చూసాడు, అందులోఒకడు వీళ్లనే చూస్తున్నాడు.
కృష్ణ గుండె దడ దడా కొట్టుకుంటూ ఉంది.
కాజల్: అటు కాదు నా కళ్ళలోకి చూడు.
అని గట్టిగా చెప్పింది,
కృష్ణ కాజల్ కళ్ళు చూసాడు. ఆ అందమైన కళ్ళు చూస్తూ అలా చూపు కిందకి పోనిస్తున్నాడు.
మెడలు, ఆ తర్వాత చున్ని కిందకు వెళ్ళింది కృష్ణ చూపు.
కాజల్ ఒక్కసారిగా కృష్ణ ని వెనక్కి తోసి,
కాజల్: చూడు నీకు నా మీద ఉన్నది ప్రేమ కాదు కామం. పో. ఇక్కడనుంచి. ఇంకోసారి నా వెంట పడితే చెప్తానీపని.
కృష్ణ అయోమయిపోయాడు,
కృష్ణ: అది కాదు, నేను ఎదో అనుకోకుండా….
కాజల్: సరే bye.
అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లి, bus వచ్చాక ఎక్కి పోయింది.
కొన్ని రోజులు గడిచాక, లైబ్రరీ లో దీపా వచ్చి కాజల్ ఎదురుగా కూర్చుంది.
20 నిమిషాలు గడిచాక,
దీపా: హై నా పేరు దీపా.
కాజల్: కాజల్ … ఏ కోర్సు?
దీపా: సోషియాలజీ… నువ్వు ?
కాజల్: హిస్టరీ.
అప్పుడు సాయి వచ్చాడు లైబ్రరీ లోకి, కాజల్ సాయి ని చూసి, బుక్ తెచ్చుకుంటా అని చెప్పి cupboards వైపువెళ్ళింది.
సాయి వచ్చి, టేబుల్ దగ్గర దీపా ఒక్కతే ఉంటే దీపా ముందు ఇంకో పుస్తకం అటు వైపు ఎందుకు ఉందాఅనిచూసి చూడనట్టు వదిలేశాడు.
సాయి: హెయ్ నెన్ సినిమాకి పోతున్న, నువ్ వెళ్ళిపో.
దీపా: నేను కూడా వస్తా రా..
సాయి: లేదు మా ఫ్రెండ్స్ తో పోతున్న, మనం next week పోదాం లే.
అని చెప్పి తొందర్లో వెళ్ళిపోయాడు.
కాజల్ అక్కడ cupboard దగ్గర, ” ఈ తోక గాడు ఈ కాలేజ్ లోనే జాయిన్ అవ్వాలా, ఆ కొంపదీసి ఆ waste గాడు కూడా ఇక్కడే జాయిన్ అయితే ఇక నా పరిస్తితి అంతే. ” అని అనుకుంది.
సాయి వెళ్ళాక కాజల్ ఏదో ఒక బుక్ తీసుకొని తిరిగి వచ్చి కూర్చుని,
కాజల్: ఎవరు అతను boyfriend ఆ?
దీపా కళ్ళు చిన్నచేసి సిగ్గు పడుతుంది.
కాజల్ ” దీన్ని set చేసుకున్నాడు అన్నమాట ” అనుకుంది.
కాజల్: ఆ చాలు, అర్థం అయింది.
దీపా: మా బావా. నేనంటే పడి చస్తాడు.
కాజల్ వక్రంగా బద్దకంగా స్మైల్ చేస్తూ,
కాజల్ ” నీ బొంద నన్ను చూస్తే మళ్ళీ సొల్లు కార్చుకుంటాడు. అందుకే వాడు రాగానే పోయిన ” .
దీపా: సరే కానీ నువ్వేంటి ఇక్కడ ఉన్న books అన్ని xerox machine లా scan చేస్తున్నావు.
What is this useless story man?