శివ వెళ్లి డోర్ తీశాడు,
ధనుష్ బెడ్ మీద ఉన్న అమ్మాయిని చూసి,
ధనుష్ ” వీడి పనే బాగుంది, అయినా వీళ్లు ఎలా వస్తున్నారో వీడి దగ్గరకి “.
ధనుష్ ఇచ్చిన ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపొమ్మని చెప్పాడు.
ప్రణీత లేచి బాత్రూమ్ లోకి వెళ్లి వాష్ చేసుకొనికి
ఆ ప్యాకెట్ ని ప్రణీత బాగ్ లో పెట్టాడు.
ప్రణీత మొహం ముడుచుకుని. వెళ్ళిపోయింది.
తర్వాత రోజు ఒక సెక్యూరిటీ అధికారి శివ మీద అనుమానం తో శివ రూం అంతా వతుకాడు. డ్రగ్స్ దొరకలేదు. ఏ ఆధారంలేదు అని ఇక శివ గురించి పట్టించుకోలేదు.
ఆ రోజు ప్రణీత ని కలిసి, తన బాగ్ లో పెట్టిన ప్యాకెట్ తీసుకున్నాడు.
డిగ్రీ రెండవ సంవత్సరం,
కాజల్ దీపా వాళ్ళ ఇంటికి వచ్చింది.
కాజల్ దీపా రూం చూస్తుంది.
అక్కడ, పెయింటింగ్స్, పుస్తకాలు, కుప్పగా కొన్ని బట్టలు, గోడ మీద వరుసగా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి.
అందులో సాయి దీపా దిగిన ఫోటో లు కూడా ఉన్నాయి. దీపా కుటుంబం వాళ్ల ఫోటోలు కూడా.
దీపా వేసిన ఒక పెయింటింగ్ లో దీపా సాయి ఉన్నారు.
కాజల్: బాగుందే నీ రూం, పెయింటింగ్స్ కూడా బాగున్నాయి. మీ ఇద్దరిదీ కలిపి, సూపర్ చేసావ్.
దీపా మురిసిపోతూ,
దీపా: థాంక్స్ ఏ.
కాజల్: మరి దసరా కి ఎటైనా వెళ్తున్నారా ఇక్కడెనా.
దీపా: లేదు ఇక్కడే. నువ్వు?
కాజల్: హా మేము కూడా మా ఇంట్లోనే ఎటూ పోము.
దీపా: తెల్సా చిన్నప్పుడు, మేము మా సాయి వాళ్ళ ఊరికే వెళ్ళేవాళ్ళం, ఇక్కడికి దగ్గరే, సుల్తాన్పుర్, చాలాబాగుంటుంది అక్కడ దసరా.
కాజల్: ఓహ్ అవునా. నేను 9 వరకు అక్కడే చదువుకున్న. అప్పుడు మేము, మీరంపల్లి లో ఉండేవాళ్ళం, కానీమా నాన్న ఇక మా ఊరిలో సొంతిల్లు కట్టుకుని, ఇక అక్కడికి షిఫ్ట్ అయ్యాం.
కాజల్ ” అసలు ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను ఆ విషయం, సాయి తెలుసా అని అడుగుతుంది కావచ్చు ”
కానీ దీపా ఏం అడగలేదు.
కాజల్: సరే దీపా, నేను వెళ్తాను, అసలే ఇక్కడనుంచి గంట పడుతుంది.
దీపా: ఆగు సాయి వస్తాడు నిన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చెయ్యమని చెప్తా.
అది విని కాజల్ కి కొంచెం దడ పుట్టింది,
కాజల్ ” ఏంటి సాయి ఆ, వద్దు ఇప్పుడు వాడు నన్ను చూస్తే ఇక ఇన్ని రోజులు దాక్కుంది అంత waste ” అనుకుంటూ, దీపాకి నచ్చజెప్పేంది
కాజల్: వద్దులే అతన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను వెళ్తా బస్ స్టాప్ దగ్గరే కదా. అయినా అతనువచ్చేవరకు లేట్ అయ్యేలా ఉంది.
దీపా: లేదు వస్తాడు లేట్ ఏం అవ్వదు,
కాజల్ ” అయ్యో వాడు రావొద్దు. ”
కాజల్: దీపా ప్లీజ్ ఏం కాదు నేను వెళ్తాను.
అని తొందరపడి, ఇక బయటకు అడుగువేసింది.
దీపా: సరే నీ ఇష్టం, వేళ్ళు.
కాజల్: బై..
ఇక కాజల్ వెళ్ళిపోయింది.
అది సంక్రాంతి సమయం,
కాజల్ వాళ్ళు చుట్టలింటికి, ఒక ఫంక్షన్ కి వెళ్లి వస్తున్నారు.
సుదర్శన్: ఏమొయ్ నీకు వెంకన్న గుర్తున్నాడా?
శారద: హా గుర్తున్నరు, వాళ్ళది ఈ ఊరే కదా, ఎప్పుడో మన పార్వతి చిన్నప్పుడు వచ్చాం.
కాజల్ కోపంగా,
కాజల్: పార్వతి కాదు కాజల్..
శారద: ఆ సర్లేవే
సుదర్శన్: మరి ఒకసారి కలిసి పోదాం, ఇక్కడి దాకా వచ్చి కలవకుండా ఎందుకు.
శారద: సరే వెళ్దాం.
కాజల్ అలసటగా,
కాజల్: ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న ఇంటికి పోదాం.
సుదర్శన్: కాసేపే దగ్గరే వాళ్ళ ఇల్లు అలా వెళ్లి ఇలా వద్దాం.
కాజల్ ” నా బాధ అది కాదు, ఒకవేళ మరి ఆ శివ గాడు మధ్యలో ఎక్కడైనా కనిపిస్తే నా పరిస్తితి ఏంటి ”
కాజల్ ఇక కార్ అద్దాలు పైకి అంది బయటకి కనిపించకుండా.
వెంకన్న ఇంటికి వచ్చారు.
లక్ష్మి కార్ వచ్చి ఆగడం చూసి “ ఎవర్రబ్బా ” అనుకుంది.
అప్పుడే వీళ్ళు దిగారు.
లక్ష్మి ఎదురు వచ్చి,
లక్ష్మి: సుదర్శన్ అన్నయా మీరా..? ఏంటి ఇలా హఠాత్తుగా.
అని ఆశ్చర్యం తో అడిగింది.
సుదర్శన్: మా చిన్న బావా ఇంట్లో ఫంక్షన్ ఉంటే చుస్కొని ఇటుగా వస్తుంటే మీరు గుర్తొచ్చారు అందుకే.
అప్పుడే బయటికి వస్తున్న వెంకన్న వీళ్ళను చూసి,
వెంకన్న: అంతే కానీ మాకోసం స్పెషల్ గా రారు అన్నమాట బామ్మర్ది.
సుదర్శన్: ఏ ఉకో బావా, నా గూర్చి నీకు తెలిసిందే కదా.
శారద: 18 ఏళ్లు అయ్యింది ఇక్కడికి వచ్చి బాగా మారిపోయింది ఊరు.
వెంకన్న: సరే సరే లోపలికి పదండి.
అని అందర్నీ ఆహ్వానించాడు.
లక్ష్మి కాజల్ నే తదేకంగా చూస్తూ ఉంది.
లోపలికి వెళ్లారు, ధనుష్ అప్పుడే బయట నుంచి ఇంటికి వస్తూ, ” ఎవరు వీళ్ళు ” అన్నట్టుచుస్తున్నాడు.
ధనుష్ లోపలికి వచ్చాక, లక్ష్మి దగ్గరికి వెళ్లి, చెవిలో
ధనుష్: అమ్మా నేను వేడి నీళ్ళు పెట్టావా స్నానం చేస్తా…
లక్ష్మి: ప్రొద్దున చెయ్యిరా అంటే చెయ్యకుండా పోయవ్, వాళ్ళు ఉన్నారు పో నువ్వే పెట్టుకోపో
అని చెప్పి పంపింది.
కాజల్ మొహం కిందకు వేసుకొని, చిరాకు గా, ” అసలు ఎంటి ఇది, ఇంటికి వెళ్తే అయిపోదా, వీళ్ళ మొహాలుకూడా నేనెప్పుడూ చూడలేదు, ఇంకా ఎంత సేపు ఉండాలో ఏంటో ఇక్కడ ” అని నసుగుతూ ఉంది.
లక్ష్మి శారద ని అడిగింది,
లక్ష్మి: మీ కూతురా…?
శారద: అవును వదిన…. పేరు పా… కాజల్.
లక్ష్మి: ఓయ్ అమ్మాయి ఇటు చూడు.
కాజల్ తలెత్తి, ఒక నకిలీ నవ్వు నవ్వింది.
లక్ష్మి కాజల్ ని చూసి,
లక్ష్మి: అన్నయా మీ కూతురూ చాలా బాగుంది. ఏం చదువుతున్నవ్ అమ్మాయి?
కాజల్: నేను B.A చేస్తున్న. SV college లో.
వెంకన్న: మన సాయి కూడా ఆ కాలేజ్ ఏ కదా లక్ష్మి.
సాయి పేరు విని కాజల్ గుటకలు మింగింది,
కాజల్ ” ఏంటి కోంపదీసి వీళ్ళు సాయి పేరెంట్స్ అయితే కాదుకదా, కాదులే, ఇందాక చూసా గా లోపలికివెళ్ళాడు వీళ్ళ అబ్బాయి. బహుశా తని పేరు సాయి ఏమో ” అనుకుంది.
సుదర్శన్: బావా నీకు ఇద్దరు కొడుకులా?
కాజల్ ” ఎంటి వీడు చిన్నోడు, అంటే సాయి పెద్దొడా, అయినా వాడికి వీళ్ళకి పొలకిలు లేవు ”
వెంకన్న: అవును.
What is this useless story man?