లక్ష్మి శారద, కాజల్ కి ఇల్లు చూపిస్తా అని తీసుకెళ్ళింది.
వెంకన్న: అంటే మా పెద్దోడు, వీడిని college లో కలిసి దత్త్త తీసుకున్నాము.
సుదర్శన్: చాలా మంచి పని చేసారు. మరి పెద్దోడు ఎక్కడ?
వెంకన్న: ఆ చదువుతున్నాడు, ఇప్పుడు foreign లో ఉన్నాడు. వాడికి చదువు తప్పా ఏం లేదు.
సుదర్శన్: ఫారిన్ లో నా, ఏం చదువుతున్నాడు?
వెంకన్న: ఎదో అది నాకు అనారాదు, విచిత్రంగా ఉంటుంది.
సుదర్శన్: పోన్లే ఎదో ఎదో కొత్త కొత్త చదువులు వచ్చాయి. మా అమ్మాయి బాగా చదువుతుంది.
అక్కడ కాజల్ వాళ్ళు,
లక్ష్మి నవ్వుతూ అడిగింది,
లక్ష్మి: కోడలా మా ఇల్లు బాగుందా?
కాజల్ ” ఈవిదెంటి కొడాలా అంటుంది ”
కాజల్: ఆ బాగుంది, అత్తయ్య.
అలా ముగ్గురు నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉంటే, ఒక రూం కి తాళం వేసి ఉంది.
శారద అది చూసి, అనుమానంగా అడిగింది,
శారద: ఏంటి ఇంట్లో గదికి తాళం వేసారు?
లక్ష్మి దానికి సమాధానం ఇస్తూ,
లక్ష్మి: అది మా పెద్దోడి గది. ఇప్పుడు ఇక్కడ లేడు. ఆ సామన్లు ఎవ్వరూ ముట్టుకోవద్దు అని తాళం వేసాడు.
కాజల్ ” ఆ బాబు ఏ ఘనకార్యం వెలగ బెట్టాడో లోపల ” అని నవ్వుకుంది.
శారద: మీ కొడుకు ఫోటో ఒక్కటి కూడా కనిపించట్లేదు ఏంటి?
లక్ష్మి: వాడు ఫోటో దిగడు, నచ్చదు వాడికి.
సుదర్శన్ పిలిచాడు.
సుదర్శన్: సరే బావ వెల్లోస్తాం.
అని కాస్త ఆగమంటు,
లక్ష్మి: అయ్యో అప్పుడే వెళ్తారా? భోజనం చేసి వెళ్ళండి.
సుదర్శన్: లేదు మేము వెళ్ళాలి, ఇంకెప్పుడైన వస్తాం లెండి.
వెంకన్న: అలా అంటారేంటి ఉండొచ్చు కదా..
సుదర్శన్: ప్లీజ్ బావా ఏం అనుకోకు, ఇంకెప్పుడైన వస్తాం.
లక్ష్మి: అయినా అమ్మాయి పెల్లీడుకి వచ్చింది, పప్పన్నం ఎప్పుడో…
కాజల్ తల కిందకు వేసుకుంది.
శారద: ఏమో వదినా, అమ్మాయి ఇంకా చదువుకోవాలి అనుకుంటుంది.
వెంకన్న: అవునా చాలా మంచిది. ఈ కాలంలో చదువుకోవడం మంచిది.
ఇక వాళ్ళు వెళ్ళిపోయారు.
ఊరు దాటాక,
కాజల్ ఆలోచిస్తుంది, ” శివ ఎక్కడున్నాడో, వాళ్ళ ఇల్లు ఎక్కడో, ఒకసారి తెలుసుకుంటే బాగుండేది ఏమో ”
వాళ్ళు వెళ్ళాక, లక్ష్మి వెంకన్న ఇద్దరు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు.
లక్ష్మి: అమ్మాయి బాగుందండి…
వెంకన్న: నేను అదే అనుకున్నానే. కానీ మన వాడే సరిగ్గా లేడుగా. అమ్మాయి అసలే బాగా చదుతుందిఅన్నాడు సుదర్శన్.
లక్ష్మి: పొన్లెండీ. పిల్లాడికి ఇంకా వయసు రావాలిగా.
(మిత్రులారా మీరు గమనించారా, ధనుష్ వచ్చి రాగానే స్నానం చేస్తా అని వెళ్ళిపోయాడు, కాజల్ ని చూడలేదు. కాజల్ ధనుష్ ని చూసింది.
ఇంకోటి, కాజల్ ముందు శివ అనే పేరు ప్రస్తావన రాలేదు. ఇంకా ఇంట్లో శివ ఫొటోస్ లేవు).
శివ Intermediate తరువాత ఐఐటీ కి వెళ్ళే దారిలో రైలు ప్రయాణం.
అన్నీ పట్టుకుని, bag తో రైలెక్కాడు. కూర్చున్నాక, ఆ కంపార్మెంట్ట్ కాస్తకాలీగా ఉంది. ఇంకో స్టేషన్ లోకొందరుఎక్కారు. చూస్తుండగానే, ఒక పెద్దావిడ ఒక శివ వయసు కుర్రాడు వచ్చి శివకి ఎదురు బెర్త్ లోకూర్చున్నారు. ఎర్రగాశివ కంటే కాస్త పొట్టిగా, చిన్న మూతి, కొచ్చటి ముక్కూ, చిన్న కళ్ళు, చెవికిపోగు, సిల్కీ జుట్టూ, గడ్డం లేదు. శివ అతడికళ్ళలోకి చూసాడు, ఎంటా అని. అతను చిన్నగా చిరునవ్వు చేశాడు.
శివ అతన్ని సరిగ్గా చూసాడు, ఆశ్చర్యపోయాడు, వెంటనే నోటి నుంచి ప్రశ్న వచ్చేసింది,
శివ: నువ్వు చాణక్య కదా, last year AIEEE all ఇండియా ranker.
చాణక్య (నవ్వుతూ కొంచెమ్ పొగరుగా) ” అవునూ నేనే “. ఖరగ్పూర్
శివ: నాకు ఈసారి కూడా 21 rank. నాది కూడా ఖరగ్పూర్ ఏ.
చాణక్య: ఓహ్ అవునా. నీతో ఎవరూ లేరా ఒక్కడివే అక్కడికి వస్తున్నావు
అలా అనగానే శివ దిగులు చెందాడు. చూపుతుప్పుకుని బాధ పడుతున్నాడు.
కరుణ: హేయ్ ఏమైంది చిన్న?
శివ: ఏం లేదు నేను మా ఇల్లు వదిలి వచ్చేశాను.
కరుణ: అలా చేయడం తప్పు కదా
శివ: అవును. కానీ నన్ను చదవనివ్వను అన్నారు. అందుకే చదువు కోసం వచ్చేసా.
చాణక్య: ఏం కాదులే నువ్వు బాగా చదివితే వాళ్ళే వెచ్చి తీసుకెళ్తారు నిన్ను.
శివ: మా నాన్న అలా కాదులెండి మీకు తెలీదు. నేను పెద్ద గొడవ చేసి వచ్చాను.
చాణక్య: ఏం కాదు నువ్వు మాతో ఉండు, మా ఇంట్లో నేను మా అత్తమ్మ ఉంటాం అంతే, నువ్వుమీవాళ్ళనువదిలేసి వచ్చావు, నాకైతే అసలు మా వల్లే లేరు. ఆ విషయానికి వస్తే నా వల్లే మా అమ్మ నాన్నచెల్లిచనిపోయారు. హహహ…..
అని ఎదో కుల్లు జోక్ వేసినట్టు నవ్వాడు. కానీ శివ కి ఆ నవ్వులో లోపల ఉన్న బాధ కనిపించింది. చాణక్యకేవలంశివని కాస్త కుదుట పరుద్దాం అని అలా చెప్పాడు.
శివ తను అలా నవ్వడం చూసి, చిరాకు గా మొహం పెట్టాడు, ” ఆపుతావా ” అన్నాడు.
చాణక్య: అంటే అవును నాకు నా తల్లి తండ్రులు ఎవరో కూడా తెలీదు.
శివ కి ఇటు రా అని సైగ చేస్తూ, చేవి కి తీసుకున్నాడు. శివ చెవిలో,
చాణక్య: ఈమే నన్ను చదివిస్తుంది. వీళ్ళ కూతురు సూపర్ figure దాని కోసమే ఉంటున్న దీంతో. ఎలాగైనాచదువుకుని, దాన్ని ఎత్తుకుపోతా ఒకరోజు.
కరుణ: రేయ్ అల్లుడూ జోకులాపు
శివ కి అలా చెపుతుంటే అస్సలు నచ్చలేదు. వెంటనే దూరం జరిగి, చాణక్య వాలకం చూస్తుంటేముందునుంచేఎదో తేడాగా ఉంది అనుకున్నాడు.
ఇక మాటలు ఆగాక, శివ అలా చూస్తుంటే, చాణక్య bag లోంచి ఒక ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ చేస్తున్నాడు. శివఅలాగే దీర్ఘంగా చూస్తున్నాడు. చాణక్య శివ ని చూసి smile చేసాడు. శివ మొహం తిప్పుకున్నాడు.
అలా మౌనంగా 3 గంటలు గడిచాయి రాత్రి అయ్యింది. ఒక స్టేషన్ దగ్గర ఆగాక, భోజనంకొనుక్కునిలోపలికివచ్చారు.
చాణక్య: hey shiva ఒకేసారి నాతో రావా
శివ: ఎక్కడికి?
చాణక్య: toilet కి
శివ (అనుమానంగా) : నేనెందుకు?
చాణక్య: రా చెప్తాను.
ఇద్దరు toilet వైపు వెళ్లారు
చాణక్య: శివ నువ్వు బయటే ఉండు, ఎవరైనా వస్తే డోర్ కోట్టూ ok.
శివ: కానీ ఎందుకు?
అని అడగగానే, చాణక్య జేబులోంచి రెండు చిన్న సిగరెట్టు లాంటివి తీసాడు, కానీ సిగరెట్ కాదు. అవిచూసిశివఆశ్చర్యపోయి, నోరు తెరిచాడు.
చాణక్య: నీకు కావాలా?
శివ భయపడి, ” ఊహు ” అని వద్దు అన్నట్టు తలూపాడు.
చాణక్య: హేయ్ సైలెంట్ గా ఉండు, 5 minutes లో ఐపొద్ది నేను అలా లోపలికి వెళ్లి వస్తాను.
అడగుడదు అనుకుంటూనే అడిగేశాడు,
శివ: ఎంటి అవి?
చాణక్య: marijuana
అంతే శివ షాక్ అయ్యాడు, భయపడుతున్నాడు.
శివ: అంటే weed ఆ? నేను సెక్యూరిటీ అధికారి కి కంప్లైంట్ చేస్తాను.
చాణక్య: చంపేస్తా, ok. 5 minutes ఇక్కడే వుండు అంతే లేకుంటే running train లోంచి తోసేస్తూ నాకొడక
అని శివ ని భయపెట్టాడు. లోపలికి వెళ్ళాడు.
What is this useless story man?