ప్రేమ కాటులు Part 3 45

లక్ష్మి: కానీ శివ ఎప్పటికైనా ఈ తప్పు నీ జీవితం అంతా వెంటాడుతుంది.

శివ: ఏం కాదమ్మా, నేను యూరోప్ లో Ph.D చెయ్యడానికి ఒక యూనివర్సిటీ కోసం ఎంట్రన్స్ రాసాను, నేనుఅక్కడికి వెళ్లి చదువుకుంటాను.

వెంకన్న: నువ్వు అలా ఎక్కడో ఉండడం కుదరదు అని నీకు ముందే చెప్పాను.

శివ: కుదరదు నాన్న నేను వెళ్తా, మీరు ఒప్పుకున్న లేకున్నా.

అని తేగించెలా చెప్పేశాడు.

వెంకన్న: ఎందుకు రా ఈ పిచ్చి, అంత చదువు కొని నువ్వు సాధించాల్సింది ఏం లేదు, కావాలంటే నీకు ఎన్నికావాలంటే అన్ని పుస్తకాలు కంప్యూటర్ లు కొనుక్కో, ఇక్కడే చదువుకో.

శివ కళ్ళలో కోపం, మాట గంభీరంగా అయ్యింది.

శివ: మీరు చెప్పేది కాదు నేను చెప్పేది మీరు వినండి, నేను అనుకున్నట్టే చేస్తున్న అంతే, నన్ను ఇక్కడేకట్టిపడేసిన సరే నేను తప్పించుకుని పోతాను.

వెంకన్న శివ చెంప పగిలేలా కొట్టి,

వెంకన్న: పిచ్చా నువ్వు చస్తే ఇగ ఇవన్నీ ఎందుకు రా? ఇంకోసారి చదువు చదువు అంటే నాకొడకా నేనేచంపేస్తా నిన్ను. అసలు నిన్ను చదువు చదువు అని బెదిరించడం నా తప్పైయింది.

శివ ఏడుస్తూ,

శివ: అయితే చంపు ఇప్పుడే.

ఒక్క నిమిషం ఆ చోటంతా నిశబ్దం.

ఇది అంతా వింటున్న ధనుష్ కి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారో అర్దం కాక దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

లక్ష్మి కన్లలోంచి నీళ్ళు వచ్చి,

లక్ష్మి: నిన్ను చంపుకొడానికేనార ఇన్నాళ్లు కనీ పెంచింది.

శివ కంటతడి పెట్టుకుంటు,

శివ: అమ్మ అమ్మ విను, నాకేం కాదు, నా మీద నమ్మకం ఉంచండి. ఇంకో 3 years అంతే. ఈ 1 year ఎలాగడిచిందో అలాగే చూస్తుండగానే ఐపొద్ది. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి, ఎదో ఒక చిన్న ఉద్యోగం చుస్కొని, మీకు దగ్గరగా ఉంటాను.

వెంకన్న: శివ విను, నీకు రేపు ఉదయం వరకు టైం ఇస్తున్న. నీ నిర్ణయం బాగా ఆలోచించుకొని చెప్పు.

వెంకన్న మాటని అస్సలు లెక్కచెయ్యనట్టు,

శివ: లేదు నాన్న ఇదే fix. నాకు మార్చుకునే ఉద్దేశం లేదు.

వెంకన్న కోపంగా గదిలోకి వెళ్ళిపోయాడు.

వెంకన్న కి వినిపించేలా,

శివ: నేనేం చిన్న పిల్లాడిని కాదు ఇప్పుడు, నా జీవితం నా ఇష్టం.

అని అరిచాడు.

ఇక శివ ధనుష్ ని తీసుకొని రూం లోకి వెళ్ళాడు.

లక్ష్మి ధనుష్ తీసుకువచ్చిన మూట చూసి, శివ ని పిలిచి ఏంటి అని అడిగింది.

శివ అవి తన బుక్స్ అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు.

ఇక కాస్త ప్రశాంతం అయ్యాక, ధనుష్ బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్నాడు.

శివ: ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు?

ధనుష్: అన్న నాకు ఎవరూ లేరు అని నేను చాలా బాధ పడ్డాను, కానీ మీ అమ్మా నాన్న ఉన్నా వాళ్లకి దూరంగాఉండాలి అని ఎందుకు అనుకుంటున్నావు, నాన్న చెప్పినటు నువ్వు ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదా?

శివ కొంచెం నవ్వు నవ్వి, ధనుష్ తల మీద చెయ్యి పెట్టి,

శివ: చిన్నా కొన్ని కావాలి అంటే కొన్ని వొదులు కోవాలి తప్పదు, నేను డ్రగ్స్ స్మగ్లింగ్ ఇంకా మానెయ్యలేదు, దానికిఇంకా సమయం పడుతుంది. ధనుష్ మన పక్క ఊర్లో ఇలియాస్ భాయ్ అని ఉంటాడు ఆయన దగ్గర మార్షల్ఆర్ట్ నేర్చుకో, నువ్వు defence academy లో సెలెక్ట్ అవ్వాలి, బాగా చదువుకో.

ధనుష్: తప్పకుండా అన్నా. నిన్ను ఒకటి అడగొచ్చ?

శివ: ఏంటి?

ధనుష్: అదే నీ సమస్య ఏంటి, నాన్న నువ్వు చస్తే ఎలా అని ఎందుకు అన్నాడు?

శివ: దాని గురించి అడగకు, నేను చెప్తా నీకు సరేనా. నువ్వు నా గురించి ఆలోచించకు రా, నీ పని నువ్వు చేస్కో. అమ్మా వాళ్ళతో ఎది ఇబ్బందిగా చెయ్యకు. డబ్బులు కావాలి అంటే అడుగు ఇస్తారు. సరేనా?

ధనుష్: సరే.

ఇక మరుసటి రోజు ఆ రోజు ఆదివారం ,తెల్లవారక ముందే లేచాక, శివ సాయి ని కలవడానికి వెళ్ళాడు.

సాయి ఇంటికి వెళ్తే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు అని టౌన్ లో ఉంటున్నారు అని తెలిసింది.

శివ టౌన్ కి వెళ్లి దీపా ఇంటికి వెళ్ళాడు.

అక్కడ చంద్రమోహన్ ని సాయి address అడిగితే చెప్పాడు. శివ సాయి ఇంటికి వెళ్తే రాజేశం సాయి దీపాదగ్గరే ఉన్నాడు అని చెప్పాడు.

శివ ” మోహన్ uncle ఈ విషయం అక్కడే చెప్పొచ్చు కదా, మళ్ళీ అక్కడికి పోవాలి. ” అనుకుని మళ్ళీ వెళ్ళాడు.

శివ: ఏంటి అంకల్ ముందే చెప్పొచ్చు కదా సాయి ఇక్కడే ఉన్నాడు అని.

చంద్రమోహన్: నువ్వు address అడిగావు కానీ సాయి ని అదిగావా?

శివ: అబ్బా ఏం క్లారిటీ అంకల్ సూపర్.

చంద్రమోహన్ నవ్వాడు.

చంద్రమోహన్: వాళ్ళు ఇంకా లేవలెడ్రా, రూం లో ఉన్నారు పో.

కానీ శివ లోపలికి వెళ్లకుండా వెనక వైపు వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి రూం లోకి చూసాడు.

సాయి దీపా ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగలించుకుని పడుకున్నారు.

వాళ్ళని చూసి, ” వారిని ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉంటే వీడు ఇంటికి ఎందుకు పోతాడు, పిల్లలకు తగ్గ పేరెంట్స్అంటే వీళ్ళే. ” అని అనుకుని వాళ్ళు ఎప్పుడు లేస్తారా అని చూస్తున్నాడు.

ఒక పది నిమిషాలకు సాయి మెల్లిగా కళ్ళు తెరిచి చూసాడు, శివ ని చూసి అవాక్కయ్యాడు.

సాయి: ఒరేయ్ ఎప్పుడు వచ్చావ్ రా? (అని గట్టిగా అన్నాడు)

సాయి గొంతుకి దీపా లేచింది. దీపా లేచి శివ ని చూసి షాక్ అయ్యి, తన t-shirt సరి చేసుకుంది.

శివ: అంత సిగ్గు అవసరం లేదు లే దీపా గారు నేను మిమ్మల్ని చూడలేదు. (అని నవ్వుతున్నాడు)

దీపా: శివ నువ్వెప్పుడు వచ్చావు?

ఇంతలో సాయి మొహం అలకాగా మారింది,

సాయి: నేయబ్బ చెప్పకుండా ఎటు దెంగేసావు రా నువ్వక్కడే నిలబడు వస్తున్న.

శివ: అది తర్వాత కానీ ఏంట్రా ఇది పెళ్లి లేదు ఏం ఇంట్లోనే దుకాణం పెట్టేసారు కదరా.

సాయి: నీ బొంద, అదేం లేదు జస్ట్ పడుకున్నాం అంతే.

శివ: అబ్బో జస్ట్ పడుకున్నారట, సుఖపురుషుడివురా నువ్వు. (అని వ్యంగ్యంగా నవ్వుతున్నాడు)

దీపా: శివా ముందు నువ్వు లోపలికి రా… (అని పిలిచింది)

శివ వచ్చాడు.

శివ: చెప్పండి దీపా గారు…

సాయి వచ్చి శివ ని చెంప మీద ఒక్కటి ఇచ్చాడు.

శివ కి తిక్కరేగింది,

శివ: దెంగెయి బె, నిన్న మా నాన్న, ఇప్పుడు నువ్వు ఎందుకు కొడ్తున్నవ్?

దీపా: హెయ్ శివ మాటలు, నాన్న వింటే తిడతాడు.

సాయి: మరి కొట్టకుండా పిచ్చి పుకొడా ఎక్కడికి పోయావ్రా… ఎంత భయపడ్డానని నీకేం తెల్సు రా..

అలా అంటూ శివ ని కొడ్తున్నాడు.

శివ: ఆ రేయ్ తల మీద కొట్టకు చెప్తున్న…చంపేస్తా..

సాయి: కొడతారా తల మీదే కొడతా ఏం పికుతావ్ ఆ…

శివ: సరే…

సాయి ఇక శివ కౌగిలించుకున్నాడు.

సాయి: అరేయ్ నిజం రా, ఇలా ఎందుకు చేసావు?

శివ: ఏమో రా…. సరే కానీ ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు?

సాయి: మేము ఇద్దరం BSc చేస్తున్నాం రా. ఒకే కాలేజీ లో.

శివ నవ్వుతూ,

శివ: హా తెలుస్తోంది, ఒకే కాలేజీ ఒకే bed మ్మ్..

దీపా: ఉకో శివ ఓవర్ చెయ్యకు.

శివ: ఓవర్ చేస్తుంది మీరు. సరే రెఢీ అవ్వండి మీకు ఒకటీ చెప్పాలి.

ఇద్దరూ సరే అన్నారు.

శివ: fast గా కానివ్వండి, (చిలిపిగా చూస్తూ) రాత్రీ ఎస్కున్నరా ?

దీపా: నువ్వన్ని ఊహించుకొకు వీడు కనీసం ఒక ముద్దు కూడా పెట్టడు.

శివ: తుః పరువు తీసినవ్ కదరా. (అని సాయి తో అన్నాడు)

సాయి: పదరా మా ఇంటికి పోదాం ఇక్కడ ఉంటే మాకు లేని ఆలోచనలు తెప్పిస్తున్నవు.

శివ సాయి ఇద్దరూ వెళ్ళాక, అక్కడ టిఫిన్ చేసి, మళ్ళీ దీపా ఇంటికి వచ్చారు.

శివ దీపా సాయి ముగ్గురు రూం లో కూర్చొని, ఎవరు ఏం చేస్తున్నారో మాట్లాడుకుని, శివ తను ఏం చేశాడో సాయికి చెప్పాడు.

సాయి: ఎందుకు అలా చేశావు రా, ఇంత మంచి వాడువి నీకు అలా ఎలా చెయ్యాలి అనిపించింది రా?

శివ: సరే చెప్తా విను,

అని శివ మౌనంగా ఉన్నాడు.

శివ ఏం చెప్తాడా అని ఇద్దరూ చూస్తూ ఉన్నారు.

ఇంతలో దీపా వాళ్ళ అమ్మ మక్కగారెలు కొన్ని తీసుకొని వచ్చి వీళ్ళకి తినడానికి ఇచ్చింది. ముగ్గురూ తిన్నారు.

1 Comment

  1. What is this useless story man?

Comments are closed.