అని భుజం కుదిపాడు.
సాయి ఫోన్ కి అప్పుడే మెసేజ్ వచ్చింది, చూస్తే దీపూ ” రాత్రి దే గుర్తు వస్తుంది బావా ” అని పంపింది.
అది మిత్రుడు కూడా చూసి,
మిత్రుడు: రేయ్ ఎంది ఏం చేసారు నైట్, ఆహా…?
అని కొంటెగా నవ్వుతూ అన్నాడు.
సాయి: ఏ ఏం లేదు నువ్ ఊకో రా.
మరో సారి మెసేజ్ వచ్చింది,
దీపు ” ఇవాళ కూడా నా దగ్గరే పడుకో, అత్తయ్య కి నెన్ చెప్తా లే ”
అది కూడా మిత్రుడు చూసి, ” పడుకోవడం ఏంట్రా, ఒరేయ్ మంచి ఊపు ఉన్నట్టు ఉన్నారు, నిజం చెప్పురానైట్ ఏంచేసావో ”
దాని కి సాయి చిరాకుగా,
సాయి: ఏహే ఏం లేదు, నేను అది పడుకున్నాం అంతే.
మిత్రుడు: ఆ పడుకొని, ఏం చెయ్యాలేదా?
సాయి: హా ఏం లేదు.
మిత్రుడు: ఎలా కంట్రోల్ చేసుకున్నావ్ రా అసలు, దీపా మముల్గా ఉంటుందా….
అని ఊగిపోతున్నాడు.
సాయి: రేయ్ చాలు ఇక. ( అని నోరుముస్కో అన్నట్టు చూసాడు)
—————————————————————-
ఇక డిగ్రీ పూర్తి అయ్యాక,
దీపా: సాయి నేను అంత్రోపోలజీ మాస్టర్స్ చేదాం అనుకుంటున్న.
సాయి: ఢిల్లీ యూనివర్సిటీ లో చెయ్యి.
దీపా: మా ఫ్రెండ్ కాజల్ నేనూ ఇద్దరం యూరోప్ లో మాస్టర్స్ చేదాం అనుకున్నాం.
సాయి: కాజల్ ఎవరూ?
దీపా: నీకు తెలీదు లే. తను ఎక్కువగా మాట్లాడదు, బాగా చదువుతుంది.
సాయి: సరే నీ ఇష్టం.
దీపా: మరి నువ్వు?
సాయి: నేను IAS అవ్తాను.
అని తన కోరిక చెప్పాడు.
దీపా: ఎందుకు?
సాయి: చిన్నప్పుడు శివ అన్నాడే education system లో ఎదో లోపం ఉంది అని, అది వాడుపట్టించుకోపోయినా ఆ పని నేను చేస్తాను.
ఇక దీపా కాజల్ తో వెళ్ళింది. సాయి ఢిల్లీ వెళ్ళి IAS coaching తీసుకున్నాడు.
సాయి UPSC లో ఇండియా టాప్ వచ్చాడు, అది కూడా highest marks తో.
దేశం అంతటా సాయి పేరే. చాలా పేరు వచ్చింది.
ఇంతలో దీపా అంత్రోపోలజీ మాస్టర్స్ కూడా అయిపొయింది.
సాయి ఇంటికి వచ్చాడు దీపా ఇంటికి వచ్చింది.
సాయి దీపా కలిసి శివ ని కలవడానికి వెళ్లారు. కానీ శివ యూరోప్ లో ఉన్నాడని ఇంట్లో వాళ్ళు చెప్పారు. సాయిశివ ఫోన్ నంబర్ తీసుకున్నాడు.
ముందు శివ ఫోన్ ఎత్తలేదు, కొన్ని రోజులు గడిచాక, సాయి IAS ట్రైనింగ్ వెళ్ళాడు.
దీపా కాజల్ తో masters చెయ్యడినికి యూరోప్ వెళ్ళింది.
కాజల్ anthropology లో మాస్టర్స్ అయిపోతుంది, అన్న సమయానికి,
కాజల్ కి శివ ప్రతి రోజు, గుర్తు వస్తున్నాడు, ఎక్కడున్నాడో తెలీదు, ఎలా ఉన్నడో కూడా తెలీదు. సాయి నిఅడుగుదాం అనుకుంటుంది కానీ, ఆరోజు చెప్పినట్టే సాయి కి కూడా తెలీదో ఏమో అనుకుని ఊకుంటుంది. దీపా ని అడగదు, అసలు శివ తనకు set అవుతాడో లేదో, తొందర పడడం మంచిది కాదు. అలా ఒకసారి శివకావాలి అనిపిస్తుంది, ఒకసారి వద్దు, అయోమయంలో ఇక ఆ విషయంలో రోజు ఆలోచిస్తూ ఉంటుంది. కానీముందుకు సాగదు.
కాజల్ campus కి వెళ్లకుండా, గార్డెన్ లో కూర్చుంది.
కొంత సమయం తరువాత, ఎవరో వచ్చి కాజల్ వెనక నిల్చోని,
శివ: హై పార్వతీ ఎలా ఉన్నావ్?
కాజల్ పార్వతీ అనే మాట వినగానే ఆశ్చర్య పోయి, వెనక్కి తిరిగబోతుంటే,
శివ: ఆగు ఇప్పుడే చూడకు నీకో surprise?
కాజల్: ఏయ్ అసలు ఎవరు నువ్వు?
శివ: నేను పారు…. పెళ్ళిచేసుకుంటా అన్నాను నన్నే మర్చిపోయావా… నీకోసం వెతికాను తెల్సా. అనుకోకుండాఇప్పుడు కనిపించావు.
కాజల్ కి అర్ధం అయింది అది శివ అని.
కాజల్: శివ నువ్వేనా?
శివ: అవును పారు నేనే.
కాజల్ ఆశ్చర్యంలో ఉండిపోయింది, షాక్ లో,
కాజల్: శివ వాచావా, అప్పుడప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు రా, dreams లో వస్తున్నావు, శివ i think i love you రా, ఏమోరా నాకే తెలీదు. I’m confused.
శివ కి కాజల్ అలా అనడంతో మతి పోయింది. ముందుకు వచ్చాడు,
శివ: పార్వతీ నిజమా, నువ్వు ఇలా అంటావు అనుకోలేదు. కానీ నాకు engagement అయిపోయింది. I didn’t expected that from you.
శివ చూసి కాజల్ నిరాశ పడింది.
కాజల్: ఓహ్ నువ్వా…..
కాజల్ ఒక్కసారిగా అలా అనడం చూసి శివ అనుమాన పోయాడు,
కాజల్: నువ్వేంటి ఇక్కడ?
శివ: నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, గుర్తొస్తున్నానా?
కాజల్: నువ్వు కాదు లే, ఆ శివ వేరు.
శివ: అవునా, అంటే నా మీద నీకు ఇష్టం లేదా.
కాజల్: లేదు.
శివ: సరే లే. ఎలా ఉన్నావ్ బాగున్నావా? ఏం చేస్తున్నావ్ ఇక్కడ నువ్వు?