కాజల్: నేనా, మాస్టర్స్ చేస్తున్న, stafford లో. నువ్వు?
శివ: నేను YouTube లో videos తీస్తూ ఉంటాను. ఇక్కడికి travel vlog అని వచ్చా, ఇందాక నీకు సర్ప్రైజ్చేదాంఅని ఇలా చేసా.
కాజల్: ఓహ్ ok.
శివ: శివ ఎవరు dreams అంటున్నావ్, నిజమా?
కాజల్: హ్మ్మ్ ఎంత మర్చిపోవాలి అనుకున్న ఇంకా గుర్తువస్తున్నాడు.
శివ: అంటే నీకు ఇష్టం లేదా?
కాజల్: ఏమో నాకు తెలీదు.
శివ: పార్వతీ ఇలా confuse అవ్వకు. ముందు ఎవరినైనా పరిచయం చేస్కో. Like ఎవరితో అయినాడేటింగ్చెయ్యి, అలా చేశాక కూడా నీకు ఈ శివ గుర్తు వస్తాడో లేదో చూడు.
కాజల్: hmm okay. Sorry Shiva, నాకు class టైం అవుతుంది వెళ్ళాలి.
శివ: ఓహ్ ok, ఇదిగో నా wedding invitation, హేయ్ పెళ్లికి తప్పకుండా రావాలి.
కాజల్ నవ్వుతూ,
కాజల్: హా వస్తాను.
శివ: ok bye పారు. See ya.
కాజల్: నా పేరు పార్వతీ కాదు, కాజల్.
శివ: అవునా మర్చుకున్నవా? బాగుంది లే. నీ శివ నీకోసం పార్వతీ అనే పేరుతో వేతుకున్నడు కావచ్చు.
కాజల్ కి అదీ నిజమే అనిపించింది,
కాజల్: థాంక్స్ శివ bye. Marriage లో కలుద్దాం..
ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది.
కాజల్ room కి వచ్చి, అలసిపోయి, మొహం మార్చుకుని, బాగ్ పక్కన పడేసి కూర్చుంది.
కాజల్: అమ్మా చెప్పు.
శారద: కాలేజ్ కి వెళ్లి ఇప్పుడే వచ్చావా?
కాజల్: ఆ అర్ధగంట అవుతుంది లే.
శారద: ఇదిగో నాన్న మాట్లాడుతాడు. ఇస్తున్న.
కాజల్: హా సరే.
సుదర్శన్: అమ్మ చదువు ఎక్కడిదాకా వచ్చిందీ?
కాజల్: హా ఈ నెల ఆకరిన ఎగ్జామ్స్ నాన్న, అయిపోతే వస్తాను ఇంటికి.
సుదర్శన్: ఏం లేదు అమ్మా, నీకు ఆ రోజు గుర్తుందా, వెంకన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అదే సుల్తాన్పుర్.
కాజల్: గుర్తుంది,
సుదర్శన్: తల్లి పెళ్లి చేస్కుంటావు గా. అబ్బాయి నాకు నచ్చాడు.
అంతే కాజల్ కి హఠాత్తుగా మనసు బరువెక్కింది,
కాజల్: ఏంటి నాన్న ఇలా సడన్ గా?
సుదర్శన్: అలా ఎం లేదురా, నువ్వు వచ్చాక పెళ్లి చూపులు. Exams బాగా రాయి.
కాజల్: సరే నాన్న నేను తర్వాత కాల్ చేస్తాను.
Phone cut,
కాజల్: శివా ఎక్కడున్నావ్ రా… కనపడురా నాకు. ఎంత వద్దనుకున్నా నువ్వే గుర్తువస్తున్నావ్.
ఆలోచిస్తూ వెళ్ళి,
బాత్రూం లో అద్దం ముందు నిలబడి, మొహం కడుక్కుని,
కాజల్: పార్వతి అని పేరు మార్చుకుని తప్పు చేసానా. నువ్వు నా కోసం ఆ పేరుతో వెతుకుతున్నవా? అబ్బాయినచ్చలేదని చెప్పి నీ దగ్గర్కి వచ్చేస్తారా.
ఇక నెల 10 రోజులకు కాజల్ anthropology లో మాస్టర్స్ అయిపోయింది. పెళ్లి చూపులకోసం ఇంటికి వస్తుంది. శివకూడా అదే ఫ్లైట్ లో వస్తున్నాడు.
శివ వెనక వైపు కూర్చొని, కాజల్ వైపు చూస్తున్నాడు. కాజల్ కి తనని ఎవరో చూస్తున్నారు అని అనిపించింది, వెనక్కితిరిగింది, శివ మొహం తిప్పుకుని ఫోన్ చూస్తున్నాడు.
కాజల్ పట్టించుకోలేదు.
ఫ్లైట్ దిగిన తర్వాత కూడా, శివ కాజల్ వెనకే బయటకి వస్తున్నాడు, కాజల్ మళ్ళీ అలాగే అనిపించింది, చూసింది. దొరికేసాడు శివ,
కాజల్ వెనక్కి వచ్చి శివ కి ఎదురుగా నిలబడింది.
అంతే శివ కి కాలం ఆగినట్టు అయ్యింది. ఏమౌతుంది అని టెన్షన్, ఏమంటుంది అని భయం.
కాజల్: హెయ్ మిస్టర్, నన్ను ఎందుకు చూస్తున్నావ్?
శివ మనసు లో ” బిత్తిరిదాన, నన్నే మర్చిపోయావా, గుర్తుపట్టలేదు, ఆగవే నీ పని ఇప్పుడు కాదు పెళ్లి చూపులతర్వాత చెప్తా ” అనుకున్నాడు.
కాజల్: ఏయ్ ఎంటి చూస్తున్నావ్?
శివ: ఏం లేదు, మీరు చాలా అందంగా ఉన్నారు.
కాజల్: ఆ విషయం నాకు తెల్సు. చూడకు పో.
శివ వెళ్ళిపోయాడు.
శివ ” దీనికి పొగరు ఇంకా తగ్గలేదు, పెళ్ళి కాని చెప్తా నీ పని ”
ఇంటికి వెళ్ళాక, సాయంత్రం, హిమాజ ఇంటికి వచ్చింది,
హిమాజ: పెద్దమ్మ పార్వతి ఎది?
శారద: రూం లో ఉందే.
హిమాజ కాజల్ రూం కి వచ్చి,
హిమాజ ” దీన్ని పార్వతి అని రెచ్చగొడుత, ఏం చేస్తుంది చూస్తా ” అనుకుంది.
కాజల్ రూం డోర్ తీసి, ” పార్వతీ ” అని అరిచింది.
కాజల్ మౌనంగా చప్పుడు చెయ్యకుండా కూర్చుంది.
హిమజ ” ఇదేంటి, ఏమీ అనట్లేదు ”
ఇక కాజల్ దగ్గరకి వెళ్లి చూసింది, కాజల్ ఏడుస్తూ ఉంది.
కాజల్ అలా చూసి,
హిమజ: ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు?
కాజల్: హిమా నాకు శివ కావాలే…
హిమజ: ఏ శివ?
కాజల్: అదే ఆ waste fellow.
హిమజ: అదేంటే వాడంటే ఇష్టం లేదుగా నీకు?
కాజల్: కాదే… నాకు సరిగ్గా తెలీదు, కానీ ఇప్పుడు వాడే కావాలి అనిపిస్తుంది. కానీ ఎక్కడున్నాడో తెలీదు.
హిమజ: మరి నువ్వు పెళ్లి చూపులకు ఎందుకు ఒప్పుకున్నావే.
కాజల్: మరి ఏం చెయ్యాలి, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, వాడెక్కడున్నది తెలీదు, నేను అసలు గుర్తున్ననో లేదో. నాకర్మ.
ఇదంతా శారద విని గదిలోకి వచ్చింది.
కాజల్ అమ్మని చూసి కళ్ళు తుడుచుని అసలు ఏం లేనట్టు నటిస్తుంది.