శారద: నేను చూసాను.
కాజల్: అది అమ్మా…
శారద దగ్గరకి వచ్చి, కాజల్ ని ఒళ్ళోకి తీస్కొని,
శారద: మరి ఈ విషయం ముందెందుకు చెప్పలేదే?
కాజల్: భయం వేసింది మీరు ఏమంటారో అని.
శారద: సరే ఇప్పుడు చెప్తే బాగోదు, రేపు అబ్బాయిని చూసి నచ్చలేదు అను. కానీ మీ నాన్న కే ఆ అబ్బాయిబాగానచ్చేసాడు.
శారద ఇలా చెప్పి వెళ్ళిపోయింది.
హిమజ: ఏం కాదే నచ్చలే అని చెప్పు. అవును ఇంతకీ రేపు వచ్చే వాడి పేరేంటి?
కాజల్: ఏమో నేను అడగలేదు.
హిమజ: ఏంటి? తెలీదా.
కాజల్: అవును ఫోటో కూడా చూడలేదు, అతనికి ఫోటో దిగడం ఇష్టం ఉండదట.
రాత్రి కాజల్ శివ నే తలుచుకుని పడుకుంది.
పెళ్లి చూపుల రోజు,
అందరూ రెఢీ అయ్యారు, కాజల్ కూడా.
శివ వాళ్ళ తల్లితండ్రుల తో వచ్చాడు.
కాజల్ శివ ని చూసి, ” ఇతన అయ్యో నిన్న అలా పొగరుగా అనేసరికి ఏమనుకున్నాడో ఏంటో, అయినామంచిదెలే, no చెప్తే, cancel అవ్తే చాలు ” అనుకుంటూ ఉంది.
హిమజ వచ్చింది, నవ్వుకుంటూ,
హిమజ: ఏయ్ ఎంటే చూస్తున్నావ్ అబ్బాయి సూపర్ ఉన్నాడు కదా..
దిగులుగా,
కాజల్: అయితే ఏంటి, నా శివ ఇంకా బాగుంటాడు, వాడు దొరకని చూపిస్తా.
కాజల్ చెయ్యి పట్టుకుని లాగుతూ,
హిమాజ: రావే చెప్తా
కాజల్: అబ్బా వదులు గాజులు గుచ్చుతున్నాయి. ఎటూ?
ఇద్దరూ కాజల్ బెడ్రూం లోకి వెళ్ళారు,
కాజల్: ఎంటే చెప్పు.
హిమజ: ఓసి పిచ్చిధానా, love అన్నవ్ గుర్తుపట్టలేవా?
చిరాకుగా మొహం పెట్టి,
కాజల్: ఎంటి గుర్తుపట్టెది?
హిమజ: వాడే వీడు.
కాజల్: యేహే ఏంటి వాడు వీడు..
హిమజ: వాడేనే నీ waste fellow. గుర్తుపట్టలేదు నువ్వు. మొహం మారిపోయింది. 9 years తరువాత కదా.
కాజల్ ఒక్కసారి ఆశ్చర్యపోయింది, సంతోషం వస్తుంది.
కాజల్: నిజమానే…
కళ్ళలో నీళ్ళు,
హిమజ: నిజం. అగో మీ అమ్మ వస్తుంది చుడు అడుగుతా,
శారద వచ్చింది,
హిమజ: పెద్దమ్మ, అబ్బాయి పేరేంటి?
శారద: శివ, fitness trainer. అంటా, ఏ చెడు అలవాట్లు లేవు, ఆస్తి కూడా ఉంది.
అని చెప్పి వెళ్ళిపోయింది.
కాజల్: నిన్న airport లో కలిసాడే, కానీ చెప్పలేదు.
హిమజ: అవునా అయితే కావాలనే చేసాడే.
కాజల్: హ్మ్మ్ అయితే నేను కూడా అలాగే చేస్తా ఎప్పుడు బయట పడతాడో చూస్తా.
ఇక కాజల్ వెళ్ళి శివ ముందు కూర్చుంది, కావాలనే నకిలీ సిగ్గు నటిస్తూ ఉంది, శివ ఇంకా కాజల్ తననుగుర్తుపట్టలేదు అనుకుంటున్నాడు.
ఇద్దరు మాట్లాడుకోవడానికి పైకి వెళ్ళారు.
ఇద్దరు అలా కాసేపు మౌనంగా నిలపడి, ఆలోచిస్తూ ఉన్నారు. కాసేపటికి శివ మౌనం విరిచేసాడు.
శివ: కాజల్ గారు సారీ నిన్న, నేను మీ ఫోటో చూసి కూడా అలా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు,
కాజల్: నేను కూడా sorry’ అండి, మీ మీద అలా అరచినందుకు.
శివ: పొనివ్వండి కానీ ఎదో దిగులుగా ఉన్నారు, ఎందుకు?
అప్పుడే కాజల్ research అని చెప్పింది, ఇక ఇద్దరు పెళ్లి వాయిదా ఒప్పందం చేసుకున్నారు.
శివ వాళ్ళు వెళ్ళిపోయారు.
హిమజ: ఏయ్ ఏం మాట్లాడుకున్నారే?
కాజల్: వాడు కావాలనే చేస్తున్నడే, నాకోసం 5 years wait చేస్తా అన్నాడు.
హిమజ: ఎందుకు?
కాజల్: నేను research చెయ్యాలి అని చెప్పిన.
హిమజ: అయినా నీకోసం 5 years ఏంటీ, 10 అయినా ఆగుతాడు.
కాజల్: నాకు తెల్సు, అందుకే పెళ్లి వాయిదా వేసాను. తెల్సా నేను చెప్పిన దానికి ఏం అనుకోలేదు, ఒప్పుకొడేమో అనుకున్న. అయినా ఒప్పుకోక చేస్తాడా.
హిమజ: అంతేలే.
ప్రస్తుతం,
కాజల్ శివ పెళ్లిరోజు,
ముందు రోజు కాజల్ నైట్ మంచి నిద్ర తీసింది.
ఉదయం 3 గంటలకు, కాజల్ ని నిద్ర లేపడానికి వాల అమ్మ వచ్చింది. పేరు : శారద.
శారద: అమ్ములు లేవ్వే, లేవ్వు
కాజల్: ఎంటమ్మా ఇంకో అరగంట నిద్రపోతాను please ( నిద్ర మత్తులో)
శారద: ఇవ్వాలా నీ పెళ్ళి, ఏ లోకంలో ఉన్నావు. త్వరగా లేవు, నికు మంగళ స్నానం చేయించాలి ఎన్ని పనులుఉన్నాయో.
కాజల్: లేచి అబ్బా ఈ పెళ్లి ఇవన్నీ ఎందుకే ఆ శివ ని రమన్ను తాలి కట్టమను ఐపొద్ది.
పక్క రూం లో ఉన్న కాజల్ కి అత్తయ్య వరస అవుతుంది, కానీ ముసలి వయసు ఆవిడది.
గంగమ్మ: ఓయ్ కొడలుపిల్ల, తాలి కూడా ఎందుకే ఇప్పుడే పిలుస్తాను శోభనం చేస్కో.
కాజల్: ఎంటత్తా నువ్వు మరీనూ. నేనేదో నిద్రలో అంటే ( సిగ్గుపడుతూ)