కాజల్ మనసులో ” కానీ ఆయనతో మాట్లాడాలి అని నాకు కూడా ఉంది, నా research గురించి ఆయనకుచెప్పాలి.. కానీ ఎలా.. ఈ ఛాన్స్ కూడా దొబ్బినట్టే” అనుకుంది.
దీపా ఇంకా భువన్ ఇద్దరు లోపలికి వెళ్లి అంతా మాట్లాడి వచ్చారు..
Campus బయటకి వెళ్ళాక.
దీపా: కాజల్, నీ గురించి కూడా చేపానే sir కి. నిన్ను ఒక thesis prepare చేసి submit చెయ్యమన్నాడు.
కాజల్: అవునా అయితే చేస్తానే..
దీపా: కానీ కాజల్ ఒకటి చెప్పాలా.. (అంటూ చిన్నగా నవ్వుతుంది)
కాజల్: ఎంటే?
దీపా: తెల్సా చాణక్య sir చాలా young గా ఉన్నాడే, and చాలా handsome ఏ , రాత్రి కాళ్ళోకి వస్తాడేమో ..
కాజల్: పిచ్చిదాన, నిజంగా అంత బాగున్నాడ? అయినా నువ్వు నా శివ నీ చూస్తే ఆ మాట అనవు లే..
దీపా: అంతా ఇంతా కాదు, ఈ యూనివర్సిటీ మొత్తంలో నే… తెల్సా ఆయన మన కంటే just 2 years senior.. PhD complete అయిన వెంటనే తను చేసిన work కి cheif. చేశారట..
కాజల్: అబ్బో ఆ range లో ఏం చేశాడే..
దీపా: మొన్న professor కరుణా చెప్తుంటే విన్నాను, 4 sciences లో 61 field works చేశాడట, 11 thesis submit చేశాడట.. సొంతంగా 4 theories ఉన్నాయట.
కాజల్: what అలా ఎలా చేశాడే, impossible, ఒక్క మనిషి అన్ని ఎలా చేశాడే..
దీపా: అదే కదా విచిత్రం..
కాజల్: సరే పోని కానీ, ఈ శ్రీ ఎవడే మూడు రోజులకు ఒకసారి letter పంపిస్తాడు, అసలు వాడు ఎం రాస్తాడోవాడికైనా అర్దం అవుతుందా… ఒకసారి పోగుడుతాడు, ఒకసారి కలవాలి అంటాడు, ఒకసా I Love you అంటాడు.. కానీ నా ముందుకు వచ్చి చెప్పే దమ్ము లేదు.. waste fellow కి
దీపా: అవును
కాజల్: మన బ్యాచ్ లో శ్రీ అనే పేరుతో ఎవరు ఉన్నారో కనుక్కోవాలి, వాడు దొరకాలి, ఎడ పెడ వాయిస్త..
దీపా: ఇగో నువ్ అది మర్చిపో, ఇలాంటి చిల్లర గాల్లు ప్రతిచోట ఉంటారు… ముందు నీ thesis ready చేస్కో…
ఇంటికి వచ్చిన తర్వాత కాజల్ శివ కి కాల్ చేసింది.
కాజల్: hello శివ గారు..
శివ: కాజల్ గారు ఏంటి సంగతి, మీ field work submission అయిందా..
కాజల్: హా అయింది, కానీ నా luck ఏ బాగాలేదు..
శివ: అయ్యో ఏమైంది అలా అంటున్నారు?
కాజల్: అంత కష్టపడి నేనే అంతా చేస్తే చివరకు నాకే మా cheif కి explanation ఇచ్చే అవకాశం రాలేదు..
శివ: ఎందుకు?
కాజల్: ఆ భువన్ గాడు నేను పోతా లోపలికి అంటూ వెళ్ళాడు, వాడు ఉంటే నాకు చిరాకు , ఆరోజు వాన్నిreject చేసాను అని నా మీద పగ పెట్టుకున్నాడు. వాడితో ఉంటే నన్ను సరిగ్గా చెప్పనివ్వడు అందుకే మాస్నేహితురాలు దీపా ని పంపించాను, తను చెప్పింది అంటా నా వర్క్ గురించి.
శివ: ఓహ్ అవునా.. ఇంకా ఏం విషయాలు
కాజల్: ఏముంటాయి అండి మీరే చెప్పాలి,
శివ: next month 17 th కి కలుద్దమా..
కాజల్: ఏంటి నేను europe లో ఉన్నాను, sorry శివ గారు నేను రాలేను..
శివ: లేదు నాకు అక్కడ fitness campaign ఉంది, నేనే వస్తున్న, అందుకే కలుద్దాం అంటున్న..
కాజల్: సరే కానీ మనం కలిసి ఏం చేస్తాము..
శివ: ya think of it like a date.. ఇద్దరం ఒక రోజు date చేద్దాం. మీకు ok అయితేనే…
కాజల్: హా ok
శివ: ok 17th evening 5 కి అక్కడికి వచ్చాక మీరే address చెప్పండి..
కాజల్: ok done..
———————————————————————-
Feb 17 , శివ కాజల్ ఇద్దరూ యూరోప్ లో కలుసుకుందామని అనుకున్న రోజు.
కాజల్ శివ కి address WhatsApp చేసింది, శివ మధ్యాహ్నం 2 కి కలుద్దాం అని అన్నాడు. ఆ address లో.
కాజల్ దీపా తో పాటు అక్కడ wait చేస్తుంది.
దీపా: ఏయ్ మీరు date కి వెళ్తారు కదా.. తర్వాత ఏమైనా చెయ్యాలి అనుకున్నారా? (నవ్వుతూ అడుగుతుంది)
కాజల్: ఏమైనా అంటే ? (దీపా చెప్పేది అర్థం కాక)
దీపా: అదేనే date కి వెళ్లి night ఒక రూం లొ.. ఊహు
కాజల్: చి చి…. అలా ఎం లేదు, శివ మంచో డే, అలాంటి బుద్ధులు లేవు.
దీపా: ఆయనకు లేవు సరే నీకు ఉన్నాయిగా… (చిలిపిగా నవ్వుతూ )
కాజల్: ఏయ్ పోవే.. ఎవరైనా వింటే నా పరువు బాగోదు.. ఎందుకలా అనిపించింది నా గూర్చి నికు
దీపా: అబ్బో interest లేకుండానే, sexology and sexual psychology మీద thesis చేస్తున్నావా?
కాజల్: అవును అనుకో కానీ ముయి నోరు, ఇక చాలు. శివ గారు వచ్చే టైం అయింది.
దీపా: శివ గారు ఎంటే ఏ కాలం లో ఉన్నావు, అతనికి నీకు 1 year తేడా అంతే శివ అను ఏం కాదు.
కాజల్: అంటే ఇప్పుడే అలా అంటే..
దీపా: అవును నువ్వు శివ చాలా handsome గా ఉంటాడు అని ఆ రోజు build up ఇచ్చావు కదా చూస్తా…
కాజల్: హా చూడు.
అలా కాజల్ దీపా వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటే, దీపా కాజల్ వెనక వైపు road ని చూస్తుంది. అప్పుడే ఒకcar వచ్చి ఆగింది, car window open అయ్యింది, అందులో శివ ని చూసి దీపా షాక్.
వెంటనే దీపా కాజల్ కి విషయం చెప్పాలి అనుకుంది, కానీ శివ మూతి మీద చూపుడు వెలు వేసుకొని, దీపాకికాజల్ కి విషయం చెప్పొద్దూ అన్నట్టు గా సైగ చేసాడు.
అలా శివ silent పిల్లి నడకలు వేస్తూ కాజల్ దగ్గరకి వస్తున్నాడు.
కాజల్ దీపా షాక్ అవ్వడం చూసి దీపా కళ్ళలో శివ నీడని చూసి వెనక్కి తిరిగింది.
శివ: hi కాజల్ గారు.. hows it going?
కాజల్: మీకోసమే waiting. శివ గారు తిను నా ఫ్రెండ్ దీపా. దీపా this is my fiance శివ.
అంటూ శివ ని దీపాకి దీపా ని శివకి పరిచయం చేసింది.
శివ: సరే ఎటైన పోదాం , ఎక్కడికి వెళ్దాం చెప్పండి.
దీపా: సరే కాజల్ రేపు కలుద్దాం.
కాజల్: హేయ్ ఆగవే, మాతో రా. ఇప్పుడు నువ్ రూం కి వెళ్లి ఏం చేస్తావు నికు bore కొడ్తుంది.
దీపా: హెయ్ మీ మధ్య నేనెందుకే?
శివ: అవును దీపా మీరు కూడా రండి నేను ఏం అనుకోను.
కాజల్: రావే నికు మేము first time కలిసినందుకు treat ఇస్తున్నాం అనుకో.
ముగ్గురు ఒక రెసటారెంట్ కి వెళ్ళారు. అక్కడ table దగ్గర కూర్చున్నారు.
కాజల్: ఏం కావాలి, చెప్పండి తీసుకొస్తాను?
శివ: నాకు heavy ఏం వద్దు ఒక tea
దీపా: నాకు strawberry icecream.
కాజల్: winter లో icecream ఎంటే?
దీపా: నాకు కావాలి
శివ: ok ok కాజల్ గారు మీరు తీసుకురండి.
కాజల్ ఇక ఐస్క్రీమ్ కోసం counter దగ్గరకు వెళ్ళింది. కాజల్ అలా వెళ్లిందో లేదో,
దీపా: శివ right? (అంటూ శివ వైపు కోపంగా ఇంకా ఎదో మోసగాడిని చూసినట్టు చూస్తుంది)
శివ: హా శివ (నవ్వుతున్నాడు)
దీపా: వామ్మో ఎలా శివ గారు మీకు ఎక్కడినుంచి వస్తాయి ఇన్ని talents. యాక్టింగ్ కూడా చెయ్యొచ్చు మీరు.
శివ: ఏ ఉర్కో దీపా..
దీపా: you know what శివ… She’s loving you
శివ: ఏయ్ respect, seniors తో ఇలాగేనా మాట్లాడేది.
దీపా: ok ok శివ sir, మా కాజల్ మీకు బాగా నచ్చింది కదా…?
శివ: హా i felt for her the day i saw her.
దీపా: ఓహో అది విషయం.
