ప్రేమ కాటులు Part 6 58

కాజల్: ధనుష్ ఏడీ?

శివ: అగో పోతుండు

కాజల్ వెంటనే బయటకు వెళ్లి , ” ధనుష్ ఏమైంది ఎటూ, రా లోపలికి ” అని ఆపింది.

ధనుష్ మనసులో ” ఆ ఇప్పుడు భోజనం చేసి పో అంటుంది, ”

ధనుష్: వస్తున్నా వదిన

అని లోపలికి వెళ్ళాడు.

కాజల్ handbag లోంచి 100 రూపాయిల నోటు తీసి,

కాజల్: ధనుష్ పాల ప్యాకెట్ ఇంకా నాలుగు కోడిగుడ్లు తీసుకొచ్చి ఇచ్చి పోవా please. ఇంట్లో కూరగాయలు ఏంలేవు.

అని ఇచ్చింది.

ధనుష్ వెర్రి మొహం పెట్టాడు, అది చూసి శివ పకపకా నవ్వాడు.

ధనుష్: ఇంకోసారి నేను నీ ఇంటికి రాను వదిన. ఎంత పని పాట లేకుండ ఉంటే మాత్రం నన్ను లెక్కచెయ్యట్లేదు.

అని వెనక్కి తిరిగాడు.

కాజల్ ధనుష్ చెయ్యి పట్టుకుని ఆపి,

కాజల్: సరే ఇగో ఈ card తీస్కో, code 7689 ATM పో, కీలో చికెన్, కిలో మట్టన్ తీస్కో, కొత్తిమీర, ఉల్లాకు, అర్దకిలో పచ్చి మిర్చి, పాల ప్యాకెట్, తీసుకురా బిర్యానీ చేస్తా తిందాం.

ధనుష్: ఇది, ఇందుకోసమే నేను వచ్చింది, ఇలాంటి పనులు చెప్తే ఒక satisfaction ఉంటది. అట్ల పొయ్యిఇట్ల వస్తా.

ధనుష్ అవి తీస్కురానికి వెళ్ళాడు.

శివ: card ఇచ్చావెంటే, కర్చు పెట్టెరకం వాడు.

కాజల్: దాన్లో ఉన్నవే రెండు వేలు, ఏం కాదు.

శివ: అంత తక్కువ, ఎవరైనా చూస్తే నా పరువెం కావాలి? ఒక govt employee భార్య అకౌంట్ లో 2000 అంటే…

కాజల్: అవునా అయితే నీ card నాకు ఇచ్చెయ్.

శివ లేచి దగ్గరకి వచ్చి,

శివ: నా card నీ card ఎంటే…. సరే నాకు పని ఉంది నేను ready అయ్యి వెళ్తాను.

శివ స్నానానికి వెళ్ళాక కాజల్ హాల్ సర్దింది.

ఇల్లు ఊడిచింది, ఇక టీవీ ముందు కూర్చుంది.

అప్పటికే ధనుష్ వచ్చాడు.

కాజల్: అవి కిచెన్ లో పెట్టిరాపో నాని.

ధనుష్ వంటగదిలో పెట్టి వచ్చి టీవీ ముందు కూర్చున్నాడు.

కాజల్ వెళ్లి, tea పెట్టింది. ఇంతలో శివ వచ్చాడు.

ముగ్గురు తాగారు.

ధనుష్: సూపర్ వదిన tea.

శివ: సరే నేను వెళ్తాను.

కాజల్: ఇప్పుడే నా ఇంకా టైం ఉంది కదా.

శివ: లేదు చాలా దూరం తొందర పోతే తొందర రావచ్చు.

కాజల్ లేచి, శివ చెయ్యి పట్టుకుని, బుగ్గ మీద ముద్దు పెట్టింది.

ధనుష్ చేతులు అడ్డం పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు.

శివ: రేయ్ ఓవర్ చెయ్యకు.

ధనుష్: నేనా, మీరు చేస్తున్నారు ఓవర్.

కాజల్: సరే శివ వెళ్ళిరా.

ధనుష్: కొంచెం త్వరగా రా, అందరం కలిసి తిందాం.

శివ: ఎప్పుడు తిండి గోలే… సరే వస్తా లే.

శివ వెళ్ళాక,

కాజల్ వంటగది కి వెళ్లి చికెన్ మారినెట్ చేసి, వచ్చింది.

ధనుష్ ఫోన్ లో ఎవరితోనో అప్పటి నుంచి చాట్ చేస్తూ ఉన్నాడు.

కాజల్: ఏంటి girlfriend ఆ?

అని నవ్వుతూ అడిగింది.

ధనుష్ ఒకసారి జెనికి, బిత్తర తో,

ధనుష్: లేదు, అదేం లేదు వదిన…

కాజల్: ఏయ్ దాచకు నేను చూసా, నువ్వు అమ్మాయితో చాట్ చెయ్యడం Instagram లో. ఎవరూ? పేరుచెప్పావా?

ధనుష్: లీలా వదిన…. Please అన్నతో చెప్పకు.

కాజల్: లీలా ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే… ఎది ఒకసారి ఫోటో చూపించు.

ధనుష్: వద్దు

కాజల్: ఏయ్ చూపించు..

అని భేదిరించింది,

ధనుష్ చూపించాడు,

కాజల్ ఫోటో చూసి,

కాజల్: తిను లీలా మా పెళ్లికి వచ్చింది… కానీ త్వరగానే వెళ్ళిపోయింది.

ధనుష్: అవును.

కాజల్: ఎలా పరిచయం అయింది?

ఆతృతగా అడిగింది,

ధనుష్: చిన్నప్పట్నుంచీ ఇష్టం నాకు, నీకు తెలీదా రాహుల్ చెళ్ళి తను.

కాజల్: రాహుల్ చెళ్లెలు, అంటే నీకు మరదలు అవుద్ధి. ఓహో ఇప్పుడు అర్థం అయింది,

కొంటెగా నవ్వుతూ ధనుష్ భుజం తట్టింది.

ధనుష్: మేము పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాం. కానీ…

కాజల్: కానీ ఏంటి?

ధనుష్: నేను జాబ్ చెయ్యాలి, వచ్చేదాకా ఆగుతా అంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంభందాలు చూస్తున్నారట.

కాజల్: మరి చూడరా, నాకు కూడా మీ అన్నయని 5 years ముందే చూసా, నా కోసం ఆగి పెళ్ళి చేసుకున్నాడుఆయన.

ధనుష్: అవును నాకు తెల్సు.

కాజల్: హెయ్ ఒకటి అడుగుతాను, ఇలా అడిగాను అని మీ అన్నయ్యకి చెప్పకు?

ధనుష్: ఏంటి వదిన నేను ఎందుకు చెప్తాను, నువ్వు చెప్పకు అన్నవ్ గా చెప్పను.

కాజల్: మీ అన్నయ్యకి girlfriend ఉందా? అదే మా పెళ్ళికి ముందు….

అడిగి ధనుష్ ఏం చెప్తాడు అని చూస్తుంది

కాజల్ అలా అడగగానే ధనుష్ పగల బడి నవ్వాడు.

కాజల్: ఓయ్ ఎందుకు అలా నవ్వావు?

ధనుష్: వదినా, ఉన్నారా కాదు ఎందరు ఉన్నారు అని అడగాలి.

అని నవ్వు ఆపుకుని అన్నాడు.

కాజల్: అవునా నీకు తెల్సా వాళ్ళు.

ధనుష్: అందరూ తెలీదు కానీ, వెళ్లిన చోటల్లా ఒక అమ్మాయిని సెట్ చేస్కున్నాడు, అంతా చేసాడు.

కాజల్: ఆంతా అంటే? (అనుమానంగా అడిగింది)

ధనుష్: అదే అన్నీ… (మొహం కిందకు వేసుకొని చెప్పాడు)

కాజల్: అవునా… Waste fellow. ఆగు ఇంటికి రాని అయిపోయాడు నా చేతిలో.

ధనుష్ హఠాత్తుగా మౌనం అయ్యాడు, ఎదో ఆలోచిస్తూ,

కాజల్: ఏంటి dull అయ్యావు? (ఎందుకు అన్నట్టు అడిగింది)

ధనుష్: కానీ వదిన పార్వతీ అని ఒక అమ్మాయి ఎవరో మరి నేను ఎప్పుడూ చూడలేదు కానీ, అన్నయ్యకి చాలాఇష్టం.

కాజల్: అవునా…

ధనుష్: అవును, చాలా ఇష్టం, అప్పుడప్పుడు నిద్రలో కూడా పార్వతీ పార్వతీ అనేవాడు.

కాజల్: నిజమా…

ధనుష్: కొన్ని సార్లయితే తల నొప్పి వచ్చినప్పుడు రూం గడి పెట్టుకుని ఆమె పేరు అరుస్తూ, నాకు ఏం కాదు ఏంకాదు అనేవాడు.

కాజల్: మరి ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది, శివ ఇంకా తనని కలుస్తున్నాడా?

ధనుష్: లేదు వదినా, తెలీదు, నేను ఎప్పుడూ అడిగిన చెప్పేవాడు కాదు.

కాజల్ దిగులుగా మొహం పెట్టింది.

ధనుష్: ఏమైంది ?

కాజల్: శివ కి ఏదైనా health సమస్య ఉందా నాని?

ధనుష్: అవును వదిన.

అంతే కాజల్ కళ్ళు తడిచాయి.

ధనుష్: అదేంటి అని నాకు తెలీదు, కానీ భయపడకు అని చెప్తాడు, వాడికేం కాదు అంటాడు.

ధనుష్ కాజల్ ని చూసి,

ధనుష్: అయ్యో వదిన ఏడవకు, ప్లీజ్… అన్న చూస్తే తట్టుకోలేడు. ఏం కాదు అన్నకి.

కాజల్ కళ్ళు తుడుచుకుని,

కాజల్: సరే సరే. నేను వంట చేస్తా,

ధనుష్: వదిన ఒక్క నిమిషం?

కాజల్: ఏంటి…?

ధనుష్: నేను job చేద్దాం అనుకుంటున్నా… మరి అన్న ని నువ్వే చుస్కోవాలి.

కాజల్: సరే… ధనుష్ చూడు, ఇంకా నువ్వు చిన్నొడివి కాదు, కాస్త భాధ్యత గా ఉండు. ఉండక పోతే…