శివ పరంసింగ్ కి ” షూ ” అని మూతి మీద వేలు వేసుకొని సైగ చేసాడు.
పరం: ok
అని చెప్పి వెళ్ళిపోయాడు.
శివ కాజల్ ని చూస్తూ ఉన్నాడు, 5 నిమిషాలకు కాజల్ మేలుకుంది, అది గమనించి, శివ వెంటనేనిద్రపోతున్నట్టునటన మొదలు పెట్టాడు.
కాజల్ లేచి, తెలీకుండానే శివ ని హత్తుకుంది అనుకుని, నవ్వుకుంది.
కాజల్ పెదాలతో శివ నుదుట ముద్దు పెట్టబోయి, ఆపుకుంది.
శివ ఎలాగో తను లేచి చేసేది ఎం లేదు అని నిద్రపోయాడు.
2 గంటల తరువాత,
దీపా అక్కడ తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని వస్తువులు తీసుకొచ్చి,
దీపా: ఇదిగోవే articrafts.
కాజల్: హా నువ్వు చెప్తూ ఉండు నేను రస్త.
దీపా చెప్తూ ఉంటే కాజల్ రాసుకుంటూ ఉంది.
దీపా: యోని like structure made of bronze.
కాజల్: యోని ఎంటే?
అని చూసింది,
దీపా: అవును చూడు.
కాజల్: సర్లే next?
దీపా: statue of a naked women wearing ornaments, made of copper. A silver plate, 11 bronze tabs. 3 stone linga.
పరంసింగ్ ఇది విని,
పరంసింగ్: ఇది ఏంటి దీపా జీ, అప్పుడు ఆయన లేడు, Phallus may be used for ritual purposes అని రాస్కో కాజల్.
కాజల్: హ్మ్మ్
శివ లేచి ఇటు వైపు వస్తున్నాడు.
దీపా: హేయ్ నాకో డౌట్ ఏ..
కాజల్: ఏంటి?
దీపా: అంటే అప్పట్లో వాళ్ళు వాటికి పూజ చేసేవారు అంటావా?
కాజల్: ఏమో నాకేం తెల్సు, చూస్తే అలాగే అనిపిస్తుంది.
దీపా నవ్వుతుంది,
కాజల్: ఎందుకు నవ్వుతున్నావ్?
దీపా: ఇప్పుడు నీకోటి చూపిస్తా నువ్వు కూడా నవ్వుతవ్
కాజల్: ముందు చుపించూ
దీపా ఒక రాగి బొమ్మను చూపించి, నవ్వుతుంది.
కాజల్ కూడా చూసింది,
ఆ బొమ్మ, ఒక అచ్చం అలా (penis) ఉంది.
కాజల్: దీన్లో ఏం joke ఉంది.
దీపా: మంచిగ చూడు
కాజల్ అది చూసి, నవ్వడం మొదలు పెట్టింది.
కాజల్: ఇదేంటీ, same అలాగే ఉంది.
కాజల్ దీపా దగ్గరి నుంచి తీసుకొని, దాని మీద చేత్తో రాస్తూ ఉంది.
దీపా: ఒసేయ్ ఆపవే పిచ్చా నీకు. ఎప్పుడు అదే ఆలోచన
దీపా: నువ్వే కదానే ఇప్పుడు అన్నావు.
ఇద్దరు గట్టిగా నవ్వుతున్నారు. శివ పరంసింగ్ కి అది వినిపించి,
శివ: ఏంటి joke మాకు కూడా చెప్పండి.
నవ్వు ఆపుకుంటూ,
కాజల్: ఏం లేదు.
కాజల్ చేతిలో ఉన్న బొమ్మ ని చూసి,
శివ: దీని గురించేనా నవ్వుతున్నారు, తప్పు కదా, హేళన చెయ్యకూడదు.
దీపా, కాజల్: oh sorry’ sorry’.
శివ: కానీ మీరు అనుకుంటుంది నిజమే, అప్పట్లో వీళ్ళు వాటినే worship చేసారు. వీళ్ళు మనకూలా దేవుడుఅంటే ఒక రూపం ఉండేది కాదు, మానవ జన్మకి మూలం, ఈ రెండింటి కలయిక, అందుకే వీటిని మొక్కేవారుఅని ఒక theory అంతే. మనం కచ్చితంగా చెప్పలేం.
కాజల్, దీపా శివ ని అనుమానంగా చూస్తున్నారు.
దీపా: మీకెలా తెల్సు శివ గారు.
శివ: అంటే ఎక్కడో విన్నాను. అయ్యుండొచ్చు కదా, అన్ని మనకు తెలిసినట్టు కాదు, ఉన్నది ఉన్నట్టు చూడాలి. అంతే కాదు వీళ్ళు అప్పట్లో అగ్ని, వరుణ అంటే వర్షం, ఇంద్ర అంటే వెలుగు అలా పూజించేవారు.
కాజల్ శివ ని చూస్తూ ” ఇంకా” అంది
శివ: వాటిలో కూడా ఈ మూడింటిని ఎలా పూజించాలి అనే ఉంది.
కాజల్: ఇంకా చెప్పు చెప్పు.
శివ: అదేంటి అలా చూస్తారు.
కాజల్: ఏం లేదు. ఇంకా చెప్తూ ఉంటే వింటూ కూర్చుంటాం మాకు వేరే పనులెం లేవు కదా.
శివ సైలెంట్ అయిపోయాడు.
పరంసింగ్: ఛా….. శివ ఒకసారి ఇలా రా..
శివ: హా వస్తున్న.
శివ పరంసింగ్ దగ్గరకి వచ్చాక,
పరంసింగ్: నువ్వు బాగా చదుకున్నావు అని నాకు తెల్సు కానీ, ఉచిత భోధన చెయ్యక.
శివ: సరే లే ఎందుకు పిలిచావు?
పరంసింగ్: ఈ body చుట్టూ jewellery (నగలు) ఉన్నాయి. గోల్డ్.
శివ: హా ఉండొచ్చు, post Neolithic period కదా. కాజల్ గారు ఇటు రండి.
అని పిలిచాడు.
కాజల్, దీపా వచ్చారు.
పరంసింగ్: జీ నేను చెప్తాను note చేస్కోండి.
దీపా: హా..
పరంసింగ్: jewellery made of gold, few polished Pottery ware remainings were burried along with bodies.
కాజల్: అంటే వీళ్ళకి after life concept belief ఉన్నట్టా, like Egyptians.
శివ: ఉండొచ్చు చెప్పలేం.
కాజల్: నేను నిన్ను అడగలేదు.
శివ: నేను నీకు చెప్పలేదు, కదా దీపా గారు.
దీపా నవ్వింది.
పరంసింగ్: శివ గారు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు.
కాజల్: sorry పరం సార్, నా వల్లే… శివ ఇటు రా నువ్వూ
శివ ని పక్కకి తీసుకెళ్ళింది.
కాజల్: ఏంటి శివ నువ్వు ఎది ఒకటి తెలిసీ తేలినట్టు మాట్లాడకు.
శివ: లేదు నేను just assumption చెప్తున్న. సరే నేను నిన్ను చూద్దాం అని వచ్చాను చూసాను వెళ్తా ఇక.
కాజల్: సరే.
కాజల్ దగ్గరకి జరిగి,
శివ: నిజంగా పోమంటావా?
కాజల్: పో. I’m serious.
శివ: సరే…..
శివ వెళ్తున్నాడు.
కాజల్ పిలుస్తూ,
కాజల్: శివా… నేను పెళ్ళి కోసం వెయిటింగ్. ఎప్పుడు చేసుకుందాం. నాకు ఇంకో నెలలో ఐపొద్ది.
శివ: ఎప్పుడు ముహూర్తాలు ఉంటే అప్పుడు మన వాళ్ళని చేసెయ్యమని చెప్పనా మరి.
కాజల్ తల కిందికి వేసుకొని, సిగ్గు పడుతూ, ” హ్మ్మ్ ” అంది.
శివ: వినిపించలేదు.
కాజల్: సరే అండీ మీ ఇష్టం.
శివ: ఇంకా ఏమైనా చెప్పాలా?
కాజల్: లేదు అంతే.
శివ వెళ్ళిపోయాడు.
శివ ” i love you చెప్పొచ్చుగా దానికోసమే వచ్చాను. ”
దీపా వచ్చింది,
దీపా: అదేంటి అలా వెల్లిపోమన్నావ్?
కాజల్: ఊపుకుంటూ వచ్చాడు, ఒక gift తేవాలని తెలీదు కానీ, హిత బోధ చేస్తున్నాడు.
కాజల్ “ చిన్నప్పటి నుంచి ఇంతే, అవసరం లేకున్నా involve అవుతాడు, ఇలా విసిగిస్తేనే నచ్చడు, waste fellow ”
—————————————————————————————————
ప్రస్తుతం,
Feb 14, 2023
కాజల్: లే శివ 9 అవుతుంది.
శివ లేచి, కాజల్ చెయ్యి పట్టుకుని, లాగాడు. శివ మీద పడింది, మొహం మీద ఉన్న జుట్టును పక్కకు దువ్వి,
శివ: ఇవాళ ఏంటి?
కాజల్: వాలెంటైన్స్ డే.
శివ: తొక్కలోది అది కాదే, మన పెళ్ళై నెల అవుతుంది.
కాజల్: హా అవును. సరే వదులు ఇవాళ ఏదైనా స్వీట్ చేస్తా.
శివ కాజల్ చెంపని రాస్తూ, బొటన వేలితో కింది పెదవి తాకుతూ,
శివ: అబ్బా ఆ స్వీట్ తర్వాత ఈ స్వీట్ ఇవ్వు.
