కాజల్ శివ యుకుట్స్ ఏర్పోర్ట్ లో దిగారు,
బయటకి వచ్చాక, అప్పటికే చలి తెలుస్తుంది.
చుట్టూ మంచు, మధ్యాహ్నo వేల అది.
కాజల్: సూపర్ ఉంది కదా
శివ: హ్మ్మ్
కాజల్: so ఇప్పుడు మనం ఇక్కడ నుంచి యుకుటియా వెళ్ళాలి.
శివ: యుకుటియా కాదు, ఓంయాకోన్ వెళ్తాం.
కాజల్: అదేంటి?
శివ: లెటర్ సరిగా చుడు.
కాజల్ చూసింది, అవును దాన్లో ఓంయాఖోన్ అని ఉంది.
ఇక ఇద్దరూ అక్కడ నుంచి ట్రైన్ లో ఓంయాఖోన్ వెల్తున్నారు.
ప్రయాణం లో, చుట్టూ మంచు, అసలు జనాబా లేదు, సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తు,
ఓంయాఖోన్ వెళ్లేసరికి, అసలు ట్రైన్ అద్దాలు మంచుతో కప్పుకుపోయి ఏమీ కనిపించట్లేదు.
ఒక రోజు గడిచాకా ఇక చేరుకున్నారు. స్టేషన్ లో ఎవరూ లేరు,
ఒక అమ్మాయి వచ్చింది, స్తల్సా శివ స్నేహితురాలు
స్తల్సా: హై కాజల్ శివ?
శివ: yes.
స్తల్సా: welcome నాతో రండి. (Russian)
కాజల్: ఇక్కడ చాలా చలిగా ఉంది.
శివ: మీ car ఎక్కడ ఉంది? (రష్యన్ లో)
కాజల్ ఆశ్చర్య పోయింది.
కాజల్: నీకు రష్యన్ తెల్సా?
స్తల్సా: ఎందుకు తెలీదు, నేనే నేర్పించాను వాడికి.
కాజల్ అనుమానం తో అడిగింది,
కాజల్: what are you both friends?
శివ: హా ఇద్దరం ఒకే ఫ్లాట్ లో ఉండేవాళ్ళం
ఇక car ఎక్కి స్తల్సా ఇంటికి వెళ్లారు.
పెద్ద దూరం ఏం లేదు, 10 నిమిషాల లో వెళ్లారు.
అక్కడంతా చుట్టూ మంచు, దగ్గర్లో ఇల్లు ఏమీ లేవు, car దిగాక, స్తల్సా వాళ్ళ ఇల్లు పెద్దగా ఉంది. ఇంటిముందుగార్డెన్, గొర్రెలు, రెండు గాడిదలు ఉన్నాయి.
స్తల్సా భర్త వచ్చాడు,
స్తల్సా: మా ఆయన సొమ్రే
అని పరిచయం చేస్తూ, కాజల్ శివ ని అతనికి పరిచయం చేసింది,
కాజల్: (ఇంగ్లీష్ లో) మీ ఇల్లు చాలా పెద్దగా ఉంది, cattle కూడా.
స్తల్సా: (రష్యన్ లో) హా పౌల్ట్రీ కూడా ఉంది, వెనక వైపు.
శివ: పౌల్ట్రీ కూడా ఉంది వెనక దిక్కు అంటుంది.
అని కాజల్ కి అనువాదం చేసాడు.
సొమ్రే వెళ్లి పశూలను పక్కన ఒక గడ్డి గుడిసె లో కట్టేసాడు.
అది చూసి, కుతూహలంగా,
కాజల్: ఎందుకు?
అని అడిగితే,
స్తల్సా: అవి బయట ఉంటే చలికి చచ్చిపోతాయి, ఇందాకే కాసేపు వాటిని తిప్పుకొచ్చాడు, మళ్ళీ లోపలకాటేస్తాం.
కాజల్: హ్మ్మ్.
శివ వణుకుతూ ఉన్నాడు. కాజల్ శివ చెయ్యి పట్టుకుని దగ్గరకి తీసుకుంది,
స్తల్సా: పదా శివ ని లోపలికి తీసుకెళ్ళు, వాడు చలి తట్టుకోలేడు.
కాజల్: ఆ మా అత్తమ్మ కూడా ఇక్కడికి వచ్చేముందు అదే చెప్పింది.
స్తల్సా: పదండి లోపలికి.
లోపలికి వెళ్ళాక, లివింగ్ రూమ్ లో హీటర్ on చేసాక శివ ని కూర్చోపెట్టి,
స్తల్సా: ఆగు టీ తీసుకొస్తా.
అప్పుడే ఒక పాప, స్తల్సా కూతురు వచ్చింది,
కాజల్ జాకెట్ తీసి కూర్చుంది,
ఆ పాప బెడ్రూం డోర్ దగ్గర నిలబడి, ఈ కొత్తవాల్లు ఎవరా అన్నట్టు చూస్తుంది.
కాజల్ తనని చూసి, ” ప్రిహోడిచ్ ” (Russian లో ఇటు రా) అని చేతులు ఊపుతూ సైగా చేసింది.
ఆ పాప రాను అని తల ఊపింది.
కాజల్: పాప చాలా క్యూట్ గా ఉందిగా శివ
శివ: హ్మ్మ్ అవును.
స్తల్సా టీ తెచ్చింది.
స్తల్సా: లగ్రితీ, వీళ్ళు నా ఫ్రెండ్స్, రా హై చెప్పు వీళ్ళకి.
లగ్రితీ వచ్చి ఇద్దర్కి shake hand ఇచ్చింది.
కాజల్: you’re so cute
అంటూ దగ్గరకి తీసుకొని ముద్దు పెట్టుకుంది.
ఆ పాప మురిసిపోయి, ” థాంక్స్ చెప్పింది ”
లగ్రితీ: త్వో ముష్? (మీ భర్త)
అని అడిగింది,
కాజల్: హా.
అప్పుడే సొమ్రే వచ్చ్చాడు,
అలా పరిచయం చేసుకున్నారు, భోజనం అయ్యింది.
Fish తిన్నారు, వాళ్ళు ఎక్కువగా fat food తింటారని, ఫిష్ ఇంకా carbohydrates ఎక్కువగాతీసుకుంటారనిచెప్పారు.
ఇక రాత్రి పడుకునే సమయంలో,
(రష్యన్ కష్టం అని ఇంగ్లీషు లో మాట్లాకుంటున్నారు)
సొమ్రే: శివ గారు, ఆ నాలుగవ గదిలో మీకు అన్నీ arrange చేసాము, ఏమి మొహమాటం లేకుండా ఉండండి.
కాజల్ లగ్రితీ తో ఆడుకుంటూ ఉంది, ఇద్దరూ స్నేహం అయ్యారు.
సొమ్రే: లాగీ ఆంటీ వాళ్ళు పడుకుంటారు, రేపు ఆడుకుందువు గానీ రా నిద్రాపో అని పిలిచాడు.
లాగ్రితీ: హా వస్తున్న నాన్న, good night ఆంటీ.
కాజల్: బై,
కాజల్ ఇక వెళ్ళింది,
వెళ్ళేసరికి, శివ వణుకుతూ ఉన్నాడు.అలా శివ ని చూసి టెన్షన్ పడుతూ వెళ్లి పక్కన కూర్చొని,
కాజల్: ఎమైందండీ, చలి ఎక్కువగా ఉంది కదా.
దగ్గరకి తీసుకొని హత్తుకుంది.
శివ: అవునే, నాకు ఎక్కువ అనిపిస్తుంది.
అని తల మీద చెయ్యి పెట్టుకుని, ఒత్తుకుంటున్నాడు
కాజల్: ఏమైంది?
శివ: తల నొప్పి.
కాజల్ శివ ని బెడ్ మీద ఒరిగించి, పక్కనే పడుకుని, బ్లాంకెట్ కప్పుకుని, కౌగిలించుకుంది.
కాజల్: ఏం కాదు, హ్మ్మ్… పడుకో.
శివ కాజల్ నడుము మీద చెయ్యి వేసాడు, కాజల్ తీసేసింది, మరోసారి వేస్తే చెయ్యి మీద కొట్టింది.
శివ: sorry please
కాజల్: లేదు నిద్రపో అంతే. (అని శివ నీ కౌగలించుకుని మాత్రమే ఉంది, అసలు ఆ రోజు నుంచి శివ కికనీసంముద్దు కూడా ఇవ్వలేదు)
మూడు రోజులు కాజల్ వర్క్ లో ఆ ప్రదేశం లో చాలా మందిని కలిసారు. నాలుగవ రోజు ఉదయం, లేచాక, శివసొమ్రేలగ్రతీ ముగ్గురూ బయటకి చెరువు వైపు వెళ్ళారు.
కాజల్ అలా ఇంటి ముందు బాల్కనీ లో కూర్చొని అక్కడ పక్షుల్ని చూస్తుంది.
అందులో ఒక పక్షి స్థిరంగా ఉంటే ఇంకోటి అటూ ఇటూ ఎగుర్తూ దాని చుట్టే తిరుగుతుంది.
అది పక్కన వచ్చి నిల్చున్నాక ఇది ఎగిరిపోయింది, దాని వెంట అది కూడా వెళ్ళింది.
వాటిని చూసి కాజల్ చిన్నగా నవ్వుకుంది, (చిన్నప్పుడు శివ కూడా తన వెంట అలాగే తిరిగేవాడు గా),
స్తల్సా వచ్చి కాజల్ పక్కన కూర్చొని,
(ఇంగ్లీషు లో)
స్తల్సా: పార్వతీ అంటే నువ్వే కదా?
కాజల్: హా నేనే.
స్తల్సా: నేను తనకి propose చేసాను కానీ ఏమన్నాడో తెల్సా.
కాజల్: ఏమన్నాడు?
స్తల్సా: పార్వతి అని ఒక అమ్మాయి నేను తననే పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చాను అన్నాడు. నేనుఒకవేళతనునీకు దొరక్కపోతే ఏం చేస్తావ్, నిన్ను ఒప్పుకోక పోతే ఏం చేస్తావ్ అన్నా
కాజల్ కి ఇంకా ఏమన్నాడా వినాలి అని ఉంది,
కాజల్: హా చెప్పు?
స్తల్సా: దొరకదు అని కాదు నాకు వాళ్ళ ఇల్లు తెల్సు, కానీ ఒప్పుకోకుంటే నేను ఇలాగే ఒంటరిగాఉండిపోతాఅన్నాడు. నువ్వంటే ప్రేమ అనడం కంటే పిచ్చి అనడం బెటర్. నీ గురించి నేను అడగకున్నామాట్లాడేవాడు, తెల్సానాకు కోపం వచ్చేది, జెలసి అయ్యేదాన్ని. అసలు నాకెందుకు అనుకునే దాన్ని.
కాజల్ నవ్వింది.
స్తలా: వాడు చెప్పిన దాన్లో ఎప్పుడూ నువ్వు వాడిని తిట్టే దానివి, నిన్ను అంత ద్వేషించేది ఇప్పుడునిన్నుఇష్టపడ్తుంది అని ఎలా అనుకున్నావు అంటే, నవ్వాడు. అయినా వాడు అలా చూస్తే చాలు నేనుకరిగిపోయేదాన్నీ.
కాజల్: హా నేను అంతేలే.
ఇద్దరూ నవ్వుకున్నారు.
నవ్వు ఆపి,
స్తల్సా: కానీ ఎప్పటికైనా చాలా చదువుకోవాలి, గొప్పగా ఉండాలి అనే వాడు. నేను లైట్ తీసుకున్నకానీఅనుకున్నట్టేచేసాడు.
కాజల్: అయినా నా గురించి అన్ని ఎలా గుర్తున్నాయి నాకే గుర్తులేదు.
స్తల్సా: ఎంటి నీకు తెలీదా?
కాజల్: ఏంటీ తెలీదు?
స్తల్సా: శివ కి మర్చిపోవడం అని ఉండదు. అసలు మర్చిపోవటం అంటే కూడా తెలీదు వాడికి.
కాజల్ కి అర్ధం కాలేదు, అయోమయంగా చూస్తుంది.
స్తల్సా: ఓహ్ నీకు చెప్పలేదా, వాడికి అన్నీ గుర్తుంటాయి, అలా పుట్టాడు అంతే.
కాజల్ ఆశ్చర్యపోయింది,
కాజల్: అన్నీ అంటే?
స్తల్సా: అన్నీ అంటే అన్నీ, నువ్వు తిట్టినవి, వాడు భాధ పడ్డవి, నాతో తిరిగింది, కాలేజ్ లో చదివింది, అన్నీఅన్నీగుర్తుంటాయి ఏదీ మర్చిపొడు.
కాజల్ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంది. అడిగింది,
కాజల్: నాకు అర్ధం కాలేదు, అంటే శివ కి హైపర్తైమేసియా (hypertymetia) నా?
స్తల్సా: అలాగే అనుకో. అందుకే headache రావడం అనుకుంటా నాకు తెలీదు. కానీ కాజల్ నిన్ను చూస్తేవాడిమీద కోపంగా ఉన్నట్టు ఉన్నావ్, ఎందుకు?