ప్రేమ కాటులు

ఆ తర్వాత 4 years గడిచాయి, ఆఖరికి కాజల్ కి శివ కి పెళ్లి అయింది.

శివ ** వ తరగతి ఉన్నప్పుడు,

సాయి: శివ రెయ్ ఎటు చూస్తున్నావు class వినుర

శివ: పో బె disturb చెయ్యకు.

శివ పార్వతిని తదేకంగా చూస్తున్నాడు.

మాలతి టీచర్ శివని చూసింది. పార్వతి first bench లో ఉంది. పక్కనే door ఉంది. మాలతి శివబయటకిచూస్తున్నాడు అనుకుని,

మాలతి: శివ నిలబడు, బయటకి ఎందుకు చూస్తున్నావ్, పోతావా, class వద్దా నీకు?

శివ: లేదు టీచర్ నేను పార్వతిని చూస్తున్న.

శివ అలా చెప్పగానే అందరూ శివనే చూసారు, టీచర్ కి కోపం వచ్చింది.

మాలతి: పార్వతి ఏం చేస్తే నికెందుకురా, ముందు పాఠం విను stupid.

శివ: నన్ను ఊరికే stupid అని ఎందుకు అంటారు.. నేను stupid ని కాదు.

మాలతి: 9×9 ఎంతర?

శివ: 72

మాలతి: ఎదవ, **వ తరగతి వచ్చావు, 9వ ఎక్కం రాదు. ఇంకా class లో దిక్కులు చూస్తావు.

ఆ తర్వాత కొన్ని రోజులకు,

శివ సాయి college lunch time లో ఒక పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు,

కృష్ణవేణి టీచర్: ఎంటి మాలతి గారు, నిన్న రాలేదు..?

మాలతి: నిన్న periods అండి, ఎందుకో నాకు కాస్త body pains కూడా వచ్చాయి.

ఇది శివ సాయి విన్నారు.

శివ: రెయ్ periods అంటే ఏంట్రా?

సాయి: periods అంటే మన classes కదరా..

శివ: మరి టీచర్ ఏంటి pains అంటుంది.

సాయి: ఏమో రా, మనకేం తెల్సు.

ఆ రోజు పార్వతి బడికి రాలేదు. అలా 2 రోజులు రాలేదు.

పార్వతి వచ్చిన రోజు, శివ పార్వతిని కలిసి,

శివ: నువ్వు బడికి ఎందుకు రాలేదు?

పార్వతి: నీకెందుకు?

శివ: అదేంటి, మనం ఫ్రెండ్స్ కదా?

పార్వతి: నువ్వు నాకు friend ఎంటీ, ఒక్క ముక్క కూడా రాదు నీకు, నీతో స్నేహం చేస్తే నా చదువు పాడైపొద్ది.

పార్వతి అలా అనడం శివకి నచ్చలేదు, కానీ మళ్ళీ అడిగాడు “నిన్న ఎందుకు రాలేదు అని”.

పార్వతి: నిన్న నాకు కాళ్ళు నొప్పేసాయి అందుకే రాలేదు.

శివ: అవునా, నీకు కూడా periods అయ్యాయా?

శివ అలా అడిగే సరికి పార్వతి చాలా సిగ్గు, ఇబ్బంది పడింది.

ఆ వయసులో కొత్తగా ఒక ఆడపిల్లకి సహజంగా జరిగేది అయిన, లోకం దాన్ని ఏదో తప్పుగా, ఆడవాళ్ళకిమాత్రమేగుట్టుగా ఉండే విషయం అన్నట్టుగా చెప్పేసరికి, పార్వతి కూడా భావించి, కాస్త ఇబ్బంది పడడంసహజమే

పార్వతి శివ అలా అనగానే అక్కడ్నుంచి వెళ్లి, తన స్నేహితురాలితో శివ ఇలా అన్నాడు అని చెప్పుకుంది. ఈ విషయం college head master చూసాడు.

మరుసటి రోజు, శివ నాన్న ని కాలేజ్ కి రమ్మని కబురు.

శివ వాళ్ళ నాన్న వెంకన్న వచ్చాడు.

వెంకన్న: sir మావాడు సరిగ్గా చదవడు ఆ విషయం నాకు తెల్సు.

Head: విషయం అది కాదండీ. నిన్న మీవాడు, అని ఆ periods విషయం చెప్పాడు.

వెంకన్న: లేదు sir ఎక్కడో ఎదో, తప్పుగా అనుకున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు sir.

Head: మీ కోణంలో అది నిజమే వెంకన్న గారు, కానీ మీ శివ పోయిన నెలలో, class లో పాఠం వినకుండాఆపార్వతిని చూస్తున్నాడు అని టీచర్ చెప్పింది. తప్పు ఉన్నా లేకున్నా పిల్లాడు వయసుకు వస్తున్నాడు. అలాఅడగడం తప్పు కదా, శివ తెలిసి అదిగాడో తెలియక అదిగాడో కానీ ఆ అమ్మాయి ఇవ్వాళ కాలేజ్ కిరాలేదు.

వెంకన్న: మా వాడికి నేను మళ్ళీ ఇలా అవ్వకుడదని చెప్పుకుంటాను. ఈ ఒక్కసారికి వాడిని క్షమించండి.

Head: ok.

అలా కొద్ది రోజులు గడిచాయి.

**వ తరగతి నుంచి పార్వతీ, సాయి ఇంకా కొందరు కరాటే నేర్చుకుంటూ ఉండేవారు. శివ మాత్రం వాళ్ళ నాన్నవద్దు అన్నాడు అని కరాటే జోలికి వెళ్ళేవాడు కాదు. ప్రతీ వారం బుధవారం కరాటే క్లాస్ ఉండేది.

**వ తరగతి లో,

శివ వాళ్ళని చూస్తూ కూర్చున్నాడు. ఆ రోజు పోటీల్లో సెమీ ఫైనల్స్, రెండు జంటలు పోటీ పడతాయి, గెలిచినవాళ్లుఫైనల్స్ కి వెళ్తారు.

సాయి కిరణ్ పొట్లాడుకున్నారు,

సాయి గెలిచాడు.

ఇప్పుడు పార్వతి వివేక్ కి ఫైట్.

శివ పార్వతి గెలవాలి అని చూస్తున్నాడు.

సాయి: రేయ్ పార్వతి గెలిస్తే నాకు తనకి match పడ్తుంది.

శివ: హా అప్పుడు నువ్వు ఒడిపోతవ్ గా

సాయి: నేనా, హహ…. సులువుగా ఒడిస్తా పార్వతిని.

శివ సాయి చెయ్యి పట్టుకుని,

శివ: ప్లీస్ రా పార్వతి నీతో ఫైట్ చేస్తే ఒడిపోరా..

సాయి: ఎంది ఒడిపోవలా, ఆపుతావా. ఇక్కడి దాకా వచ్చింది దాని చేతిలో ఒడిపోనికా పో రా.

శివ: నువ్వు ఒప్పుకోపోతే నీతో ఫ్రెండ్షిప్ కట్ అంతే.

సాయి: సరే ముందు ఈ మాచ్ గెలవాలి కదా చూడు.

పార్వతి వివేక్ మాచ్ మొదలైంది.

పార్వతి ముందు పంచ్ వేసింది, శివ పార్వతి ని చూస్తూ,

శివ: ఎస్ అది…

కానీ వివేక్ చాలా చురుకుగా తప్పించుకుంటూ, పార్వతి ని ఎదురుకుంటు ఉన్నాడు.

పార్వతి మొదటి నుంచే భయపడుతుంది.

వివేక్ అది అలుసుగా తీసుకొని, భుజాల మీద కొట్టాడు.

శివ: అరేయ్ పార్వతి కొట్టట్లేదు ఏంట్రా? (అని సాయి భుజం తడుతున్నాడు)