సాయి: చుడ్రా నువ్వు ముందు.
వివేక్ పార్వతి ని మొహం మీద కొట్టాడు. దానికి పార్వతి కింద పడిపోయింది.
శివ కి అది చూసి కళ్లు ఎర్ర బడ్డాయి, కోపంతో
శివ: రేయ్ మొహం మీద కొడతాడెంట్రా వీడ్ని, సంపెస్తా
అని లేచాడు,
సాయి శివ చెయ్యి పట్టుకుని కిందకు లాగి,
సాయి: కూర్చో అది గేమ్, అలాగే ఉంటది వాడేం కావాలని కొట్టలేదు.
శివ: అయితే ఏంటి మొహం మీద కొట్టాలా?
ఇలా చూస్తుండగా నే మళ్ళీ కొట్టాడు.
శివ: నేయబ్బ నేనే కొడతారా వివేక్ గా ఐపోయవ్రా నా చేతిలో ఇవాళ.
సాయి: ఏ హే కూర్చో, నికు కరాటే వచ్చా?
శివ: రాదు.
సాయి: మరి వాడు ఒక్కటి కొడ్తే కింద పడిపోతవ్ అవసరమా నీకు.
ఇలా చూస్తుండగా నే పార్వతి ఓడిపోయింది.
సాయి: అయిపోయింది.
శివ: రేయ్ పోరా ఆ వివేక్ గాడి మూతి పలగొట్టు.
సాయి: నువ్ అనుకుంటే ఐపొద్దా. సరే చూద్దాం.
శివ: పో..
సాయి: ఆల్ ది బెస్ట్ చెప్పురా.
శివ: ఆ పో..
సాయి కి వివేక్ కి పడింది.
మాచ్ జరుగుతుంటే, పార్వతి సాయి ని encourage చేస్తుంది.
శివ వెళ్లి పార్వతి పక్కన కూర్చొని,
శివ: పారు చూడు సాయి ఆ వివేక్ మొహం పగల గొడ్తాడు.
పార్వతి శివ ని చూసి,
పార్వతీ: నువ్వు నా పక్కన ఎందుకు కూర్చున్నావు పో…
శివ: వాడు మొహం మీద కొట్టాడు ఏం కాలేదు గా?
అని పార్వతి కళ్ళలో చూస్తూ ప్రేమగా అడిగాడు.
శివ చూపు ఎలా ఉంది అంటే పార్వతి కి శివ కళ్ళలోకి అలాగే చూస్తూ ఉండి పోవాలి అనిపించింది.
పార్వతి మనసులో ” వాడి వైపు చూడకే చూడకు ” అనుకుంది.
పార్వతి మొహం తిప్పుకుని, చెప్పింది,
పార్వతి: నాకేం కాలేదు, ముందు నువ్వు పో ఇక్కడనుంచి.
శివ: ఏమైంది, పారు నీకోటీ తెల్సా నేను కూడా కరాటే లో ఉంటే నీ చేతిలో కావాలనే ఓడిపోయే వాడిని, అసలుఆ వివేక్ గాడికి నిన్ను కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి.
పార్వతి మొహంలో చిన్న మురిపంతో నవ్వు.
శివ: నాతో మాట్లాడు.
పార్వతి: నన్ను మాచ్ చూడని, మీ సాయి గెలవాలి అని నీకు లేదా.
శివ: తొక్క, నువ్వే లేనప్పుడు నాకు ఎవరు గెలిస్తే ఎంటీ? అయినా సాయి గెలుస్తాడు లే.
శివ అలా అనడం ఆలస్యం, సాయి వివేక్ ని కింద పడకొట్టాడు.
అందరూ చప్పట్లు కొట్టారు.
అప్పుడు పార్వతి శివ ని అడిగింది,
పార్వతి: అవును మరి నువ్వెందుకు కరాటే లో జాయిన్ కాలేదు?
శివ: మా నాన్న వద్దన్నాడు అందుకే.
పార్వతి: ఇప్పుడు నువ్వు ఇక్కడనుంచి వెళ్ళాక పోతే నేనే నిన్ను కొడతాను పో
శివ: కొట్టు నీ చేత్తో దెబ్బలు తినడం నాకు ఇష్టమే.
పార్వతి చప్పుడు చెయ్యకుండా, మౌంగనగ ఉంది.
పార్వతి ” అబ్బా వీడ్ని ఎలా ఒదిలించుకోవాలి “.
పార్వతి పైకి లేచి ఇక అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
సాయంత్రం కాలేజ్ అయిపోయాక,
శివ సాయి కోసం కాలేజ్ బయట, మైదానం దగ్గర ఆగాడు.
అప్పుడే వివేక్ అటు వైపు నుంచి వెళ్తూ ఉంటే శివ వివేక్ ని కోపంగా చూస్తున్నాడు.
వివేక్ ” వీడెంటి నన్ను కోపంగా చూస్తున్నాడు, సాయి గాడు గెలిచాడు గా. ” అనుకున్నాడు.
శివ పార్వతి వైపు వేలు చూపిస్తూ, బెదిరించినట్లు సైగ చేసాడు.
వివేక్ కి అలా చెయ్యడం మండింది, శివ దగ్గరకి వచ్చి కాలర్ పట్టుకుని,
వివేక్: ఏంట్రా బెదిరిస్తున్నావు… హ్మ్?
అని అడిగాడు,
శివ: పార్వతి ని ఎందుకు కొట్టావ్? ఎలాగో ఓడిపోయే వాడివి ఎందుకు అవసరం లేకున్నా అలా చెయ్యడం.
వివేక్: గేకవాలనుకున్న, అయినా నీకెందుకు రా, నువ్వు లేవు కదా కాంపిటీషన్ లో.
శివ కాస్త తదపడి,
శివ: సరే సరే వదులు నన్ను.
వివేక్ విడిచి పెట్టాడు.
శివ: ఇంకో సారి పార్వతి ని కొట్టకు చెప్తున్న, నేను సాయి కి చెప్తా.
అసలే సాయి మీద ఆగ్రహంగా ఉన్న వివేక్ కి మళ్లీ సాయి అని మాట ఎత్తడం తో రక్తం ఉదికింది,
వివేక్: హా ఏంట్రా మీరు పీకేది, రేపు కావాలనే దాన్ని కొడత, ఇష్టం కదరా నికు అది, చుడు ముద్దు కూడా పెడతా.
ఇప్పుడు శివ కి కోపం వచ్చింది,
శివ: సుల్లిగా ఏమన్నవ్, మళ్ళీ అను?
వివేక్: ఆ అంటే ఏం పీకుతావ్ బెయ్,
అని శివ ని మొహం మీద ఒక్కటి కొట్టాడు.
అంతే శివ కింద పడిపోయాడు.
వివేక్: తుస్సు నాయాల…
అని తిట్టి వెళ్ళిపోయాడు.
పార్వతి ఇది చూసి, శివ వైపు వస్తుంది, అప్పటికే వివేక్ వెళ్ళిపోయాడు.
పార్వతి శివ ని తట్టీ లేపింది,
పార్వతి: శివ…. శివ… లే.
పార్వతి స్నేహితురాలు: హేయ్ పారు పదవే ఈ గొడవలు మనకెందుకు…
పార్వతి: ఏ నువ్వు పోవే…
స్నేహితురాలు వెళ్ళిపోయింది, శివ కళ్ళు తెరిచి పార్వతిని చూసాడు.
పార్వతి: పిచ్చా శివ నికు, ఎందుకు వాడిని గెలికావు?
అని అడిగింది.
శివ లేచి, కూర్చొని, పార్వతి కళ్ళు చూసాడు, పార్వతి మొహం పక్కకు తిప్పుకుంది.
శివ: మరి వాడు నిన్ను కొట్టాడు కదా, ఎలాగో ఓడిపోయే వాడు నిన్ను కొట్టడం ఎందుకు.
ఇంతలో సాయి వచ్చి, ఏమైంది అని అడిగాడు.
పార్వతి: ఈ పిచ్చోడు ఆ వివేక్ కి కొట్టాలని చూస్తే వాడు కొట్టి వెళ్ళిపోయాడు.
సాయి: తిక్కనారా నీకు, వాడితో ఎందుకు పెట్కున్నవ్.
పార్వతి: వాడు నీ మీద కోపంతో శివ ని కొట్టాడు.
శివ పార్వతి నే చూస్తున్నాడు.
పార్వతి మొహం పట్టుకుని, కళ్ళలోకి చూసాడు, పార్వతి చూపు కిందకు వేసుకుంది,
శివ: అయినా నేను దెబ్బలు తింటే నీకెందుకు?
పార్వతి పొగరుగా,
పార్వతి: నాకేందుకు, ఎదో నువ్వు కింద పడిపోయావు కదా అని వచ్చా. Bye
అని చెప్పి వెళ్లిపోుంది.
