ప్రేమ కాటులు

పార్వతి ” అవును వివేక్ అలా కొట్టగానే వాడెంటి, స్పృహతప్పి పడిపోయాడు. ఎందుకూ? ” అని తనలోతానుఅనుకుంది.

మరుసటి రోజు,

పార్వతి వివేక్ గ్రౌండ్ లో ఉండడం చూసి వెళ్ళింది.

అక్కడ ఎవరూ లేరు, వివేక్ ఎదో పోగొట్టుకుని వెతుకుతున్నాడు. పార్వతి వెళ్లేసరికి అది దొరికింది, తీసుకొనిజేబులో వేసుకున్నాడు.

పార్వతి కోపంగా చూస్తూ ఉంది.

వివేక్: ఏంటి?

పార్వతి: శివ ని ఎందుకు కొట్టావ్?

వివేక్: వాడు నన్ను ఎక్కిరించాడు, అయినా నీకెందుకు.

అని అడుగుతుంటే పార్వతి వివేక్ ని ఎడమ చెంప మీద కుడి చేత్తో ఒక్కట్టి జాచింది.

వివేక్: హేయ్ నన్నే కొడ్తావ, నిన్ను.

అని కోపంతో పార్వతి మీదకి వస్తుంటే,

పార్వతి: నేను కాలేజ్ లో చెప్తా, నువ్వు శివ ని అలా కొట్టి కింద పడేసావ్ అని.

వివేక్ ఆగాడు

వివేక్ పళ్ళు కోరుకుంటూ,

వివేక్: నీ సంగతి ఇప్పుడు కాదే, మరో సారి మాచేస్ ఉంటాయి గా అప్పుడు చెప్తా.

అప్పుడే సాయి వచ్చాడు,

సాయి: పారు ఏమైంది, వాడేమైన అంటున్నాడా?

పార్వతి వివేక్ వైపు అసహ్యంగా చూస్తూ,

పార్వతి: ఏం లేదు. నీకు అనవసరం.

సాయి: నువ్వు శివ ని కొట్టిన వాడు నన్ను ఆపాడు రా లేకుంటే నిన్న నే …

పార్వతి: శివ ఎక్కడ?

సాయి: క్లాస్ లో ఉన్నాడు.

ఇద్దరూ క్లాస్ కి వెళ్ళారు.

టీచర్ వచ్చి, ” డాన్స్, essay writing, competitions ఉన్నాయి, ఎవరైనా పాల్గొనాలి అంటే పేర్లు ఇవ్వండి. ” అని చెప్పింది.

అందరూ పేర్లు ఇవ్వడం మొదలు పెట్టారు,

పార్వతి: నేను డాన్స్.

అప్పుడే శివ కూడా లేచి,

శివ: నేను కూడా డాన్స్.

పార్వతి: వీడొకడు నాకర్మకే ఉన్నాడు.

అని గునుక్కుంది.

పార్వతి స్నేహితురాలు,

హిమాజ: ఒసేయ్ నీకు శివ తోనే జంట పడుతుంది?

పార్వతి: అస్సలు చెయ్యను, నేను వాడు ఉంటే.

అని చిర్రక్ గా చేపింది.

హిమజ: ఎందుకే..? నేనైతే, నాకు శివ తో పడలి అనుకుంట తెల్సా. సూపర్ డాన్స్ చేస్తాడు.

పార్వతి: ఆపుతావా, వాడు డాన్స్ చేస్తే ok కానీ, నన్నే చూస్తాడు.

హిమాజ: అయితే ?

పార్వతి: అయితే, నాకు చూడాలి అనిపిస్తాది.

హిమాజ: ఓహో… ఏంటే ఇష్టమా నే వాడంటే నీకు.

పార్వతి: చీ వేస్ట్ ఫెలో, ఒక్క ముక్క కూడా చదవడు, తింగరి పనులు చేస్తాడు.

అని కసురుకుంది.

మరుసటి రోజు,

పార్వతీ: సాయి నువ్ కూడా డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొనవచ్చు కదా?

సాయి: లేదు, నేను essay writing లో ఉంటున్న, డాన్స్ శివ చేస్తాడు మస్త్.

పార్వతీ: కాదు, ఇప్పుడు నన్ను శివ ని జంట గా చెయ్యమంటున్నారు.

సాయి: అయితే శివ కి చెప్పాలి ఇది.

పార్వతీ: వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, waste fellow కుదురుగా ఉండడు, నువ్వుచేయొచ్చుగా…

సాయి: నాకు రాదు. అయినా నువ్వు ఇలా శివ ని తక్కువ చేసి మాట్లాడితే నేను నీతో మాట్లాడను.

పార్వతీ: అసలు ముందు నువ్వు వాడితో దోస్తానా కట్ చెయ్యి సాయి వాడు చదవడు నిన్ను చదనివ్వడు.

సాయి: పో ఇక్కడనుంచి, పెద్ద టాపర్ అని పోగరా, అయినా నీతో నాకేంటి.

3 రోజుల తర్వాత, శివ పార్వతీ డాన్స్ class లో జంట గా ఉన్నారు.

పార్వతీ తో శివ డాన్స్ చేస్తూ ఉండగా, శివ కాలు తగిలి పార్వతీ కింద పడిపోయింది.

పార్వతీ ఏడుస్తూ, ” టీచర్ నాకు శివ తో చెయ్యాలని లేదు, కావాలనే నన్ను కింద పడేసాడు. ” అనికంప్లైంట్ఇస్తే,

శివ: లేదు టీచర్, నేనేం చెయ్యలేదు, అది చుస్కోకుండా జరిగింది.

టీచర్: చుస్కోకుండా కదా, పారూ ఏం కాదులే అసలు ఇక్కడ ఉన్నవల్లలో శివ కన్న ఎవరు మంచిగాచెయ్యరు.

అని శివ నే పొగిడింది.

పార్వతీ ” అబ్బ వీడిని ఎలా ఒదిలించుకోవాలి ” అని నసిగింది.

సాయంత్రం, శివ ఇంటికి వెళ్తుంటే, పార్వతీ వచ్చి ఆపింది.

పార్వతీ: శివ శివ…..

అని పిలిచి, శివ సాయి ఆగారు.

పార్వతీ: శివ నువ్వు డాన్స్ నుంచి తప్పుకో. (అని చెప్తే)

శివ: ఎందుకు? (అన్నాడు)

పార్వతీ: నువ్వు తప్పుకుంటే సాయి ఉంటాడు

శివ: సరే నువ్వు అడిగావు కదా… సాయి నువ్వే డాన్స్ లో పార్టిసిపేట్ చెయ్యి. (దిగులుగా ఒప్పుకున్నాడు)

సాయి: మరి నువ్వు?

శివ: నాకు ఇంక ఏం రాదు కదరా పోని

అని చెప్పి, తిరిగి కాలేజ్ లో, లిస్ట్ లో శివ పేరు తీసేసి సాయి పేరు పెట్టించాడు.

పార్వతీ సాయి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సాయి పార్వతీ నీ అదోలా చూస్తున్నాడు అది తనకి చాలా ఇబ్బందిగాఅనిపించింది. సాయి ఉద్దేశం ఏం బాగోలేదు అనిపించింది.

ఆ తర్వాత 2 రోజులు పార్వతీ డాన్స్ ప్రాక్టీస్ కి రాలేదు.

పార్వతీ కి డాన్స్ చేయడం ఇష్టం, కానీ సోలో పెర్ఫార్మెన్స్ లేదు అనేసరికి జంటగా చెయ్యాల్సి తప్పలేదు. శివఅంటేఇష్టం లేదు, సాయి వ్యవహారం నచ్చలేదు. అసలు డాన్స్ పోటీ నుంచి తప్లుకుందామ్ అనుకుంది.

పార్వతీ ఆ మరుసటి రోజు బడికి వచ్చి, తప్పుకుంటా అని చెప్పింది. శివ పార్వతీ ని అడిగాడు,

శివ: ఏమైంది, నీకు డాన్స్ అంటే ఇష్టం కదా?

పార్వతీ: లేదు నాకు మీతో చెయ్యడం ఇష్టం లేదు.

శివ: అదే ఎందుకు? (అని వాదించగా)

పార్వతీ: అది నీకు అనవసరం. (అంటూ కసురుకుంది)

శివ: మనం చేద్దాం, నెన్ ఏం చేసా చెప్పు, నాకు నువ్వు డాన్స్ చెయ్యడం ఇష్టం.

పార్వతీ: లేదు నువ్వు ఎక్కడ పడితే అక్కడ చేతులు వెస్తున్నావు.

శివ: ఛీ నేను అలా అసలు చెయ్యను, నువ్వు సరిగ్గా చెయ్యకపోతే పట్టుకుని లాగాను అంతే, నువ్వేఏమోఅనుకుని నన్ను వదిలి కింద పడిపోయావు. నాతో డాన్స్ చే ఈసారి మనకే first price వస్తది.

పార్వతీ: సరే అన్నట్టు తల ఊపి వెళ్ళిపోయింది.

Annual day రోజు, నిజంగానే శివ పార్వతికి first prize వచ్చింది.

శివ పార్వతికి cup ఇచ్చి, ” ఇది నీకే తీస్కో” అన్నాడు.