పార్వతీ ” థాంక్స్ ” చెప్పి సంతోషం తో వెళ్ళింది.
సాయి ని కలిసి cup చూపించింది.
సాయి: అది శివ ది, నువ్వేం అంత బాగా చెయ్యలేదు. (మొహం పట్టుకుని చెప్పాడు)
ఒక్కసారిగా dull అయ్యింది.
పార్వతీ ఇంటికి వెళ్లే దారిలో,
పార్వతీ మంచితనం ” నేను బాగా చేయకున్నా నాకెందుకు ఇచ్చాడు, ముందు కూడా నాకోసం పోటీలోంచితప్పుకున్నాడు. ”
శివ మీద ద్వేషం ” అదేం కాదు వాడు తింగరోడు, ఆ సాయి కావాలనే అలా అన్నాడు “.
పార్వతీ ” కానీ వాడు లేకుంటే నేను డాన్స్ చేసేదాన్ని కాదుగా, అయినా సరే ఆ తింగరోడికి దూరంఉండడంమంచిది “.
——————————————————————————-
ఆ రోజు final exam ఫలితాలు.
పార్వతి ఎప్పటిలాగే 1st rank వచ్చింది.
సాయి మాత్రం అనుకోకుండా 2nd rank వచ్చాడు.
శివ గూర్చి తెలిసిందే మళ్ళీ 2 subjects లో గుండు సున్న.
అయితే శివ తింగరి తనం మరింత పెరిగింది.
ఏకంగా ఆ రోజు వెళ్లి పార్వతి తో ఇలా అన్నాడు.
శివ: పార్వతి, శివ పేర్లు భలే ఉన్నాయి కదా ఆ శివుడు పార్వతుల లా.
పార్వతి: అయితే ఏంటి, నాతో మాట్లాడకు పో.
శివ: పార్వతి పెద్దయ్యాక మనం కూడా పెళ్లి చేసుకుందాం.
అంతే పార్వతి శివని ఒక్కటి కొట్టింది. కానీ సమయానికి అక్కడ ఎవరూ లేరు, చూడలేదు.
పార్వతి: ఛీ, నువ్వేంటి.. మొద్దు గాడిద, ఆ మొహం చూడు, పెళ్లి చేసుకుంటాడంటా. Stupid. ఇంకో సారినాతోమాట్లాడితే ఏడిపిస్తున్నవని టీచర్ కి complaint చేస్తా.
శివ పార్వతి తనని అలా తిట్టడం, అసలు తనకి ఏ విలువా ఇవ్వకపోవడం చాలా సిగ్గు, భాధ కలిగించింది.
శివ అప్పుడు ఎలాగైనా పార్వతి తనని మెచ్చుకునేలా ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు.
కానీ ఇంతలో headmaster మళ్ళీ వెంకన్న ని పిలిచాడు.
వెంకన్న: sir మా అబ్బాయి ఏమైనా ..?
Head: మీకు నిన్న శివ progress report చూపించలేద?
వెంకన్న: అవునా వాడు నాకు ఆ విషయమే చెప్పలేదు.
Head: మీ శివ కి ఈసారి, maths ఇంకా science లో గుండు సున్న వచ్చాయి. Maths sir అయితే అసలుశివ ని10వ తరగతి కి promote చెయ్యకూడదు అని చెప్పేసారు.
వెంకన్న: అయ్యో అలా ఎందుకు, లేదు sir మావాడు చదువుతాడు.
Head: మాకు నమ్మకం లేదండి. మేము మీ శివ ని promote చెయ్యదలచుకొలేదు.
వెంకన్న: లేదు sir please మీరు అలా అనకండి, మాది చాలా పరువుగల కుటుంభం, కానీ వాడు వాళ్ళతల్లిగారాబం వల్ల అలా అయ్యాడు. ఇప్పుడు మీరు ఇలా చేస్తే నా కొడుకు మళ్ళీ 9వ తరగతి చదవడం లేదువద్దు sir.
Head: కానీ మేము promote చేసినా మీవాడు 10వ తరగతిలో fail అవుతాడు. ఎప్పుడైనా మీపరువుపోవాల్సిందే. వాడు మారుతాడు అన్న నమ్మకం నాకు లేదు.
వెంకన్న: please sir అలా మాత్రం అనకండి. మా శివ వచ్చే ఏడూ బాగా చదువుతాడు, నాది పూచి. Please ఈఓక్కసారికి వాడిని క్షమించండి.
Head: సరే కానీ మీరు మాత్రం ఏమ చేస్తారో తెలీదు శివ వచ్చే ఏడు సరిగ్గా చదవకపోతే బాగోదు.
వెంకన్న శివ మీద కోపంతో ఇంటికి వచ్చి, శివని కొడుతున్నాడు.
శివ: ఆ అరె వద్దు నాన్న వద్దు please, నేను చదువుతా నాన్న, వచ్చే ఏడూ పక్క pass అవుతా నాన్న.
వెంకన్న: అందరూ చదువుతున్నారు కదార నీకు ఏం రోగంరా, ఆ సాయి నీతోనే ఉంటాడు, వాడు కూడాబాగానేచదువుతాడు, నీ సమస్య ఏంటి?
అంటూ శివని కట్టేతో కొట్టాడు.
శివ: అబ్బా నాన్న please కొట్టకండి. నేను చదువుతా నాన్న. ఈసారి.
అయితే summer holidays లో, వెంకన్న ఒక చుట్టాల ఇంటికి వెళ్ళాడు.
రంగరాజు: ఏంటి వెంకన్న బావా దిగులుగా ఉన్నావు?
వెంకన్న: అవును బావా, నా కొడుకుతో అంతా దిగులు.
రంగరాజు: ఏమైంది?
వెంకన్న: వాడు సరిగ్గా చదవలేదు బావా, సరిగ్గా కాదు, అస్సలు చడావట్లేదు.
రంగరాజు: వాడికి ఏదైనా బుద్దిహీనం లాంటివి ఏమైనా?
వెంకన్న: లేదురా అలాంటివి ఎవి లేవు. తెలివిగా ఉంటాడు. ఆటలు బాగా అడుతాడు. కానీ పుస్తకాలుఅంటేచాలు, దయ్యాన్ని చూసినట్టు చూస్తాడు. Class లో కుదురుగా పాఠం వినకుండా పక్కకి, బయటకిచూస్తాడట.
రంగరాజు: బావా నువ్వు ఏమీ అనుకోను అంటే, ఒక స్వామీజీ ఉన్నాడు. ఒకసారి మన వాడిని ఆయనదగ్గరకితీసుకొని పో, ఏదైనా లాభం ఉండొచ్చు.
ఇక ఆ తర్వాత, శివ కుటుంభం ఆ స్వామీజీ దగ్గరకి వెళ్లారు.
ఆ స్వామీజీ కి శివ పరిస్థితిని చెప్పుకున్నారు.
లక్ష్మి: మా వాడికి ఏదైనా దోషం లాంటివి ఉన్నాయా స్వామి.
స్వామీజీ: ఏమీ లేవు. చక్కని పిల్లాడు. ఎటువంటి చెడు ఆలోచన, ఉద్దేశం లేని వాడు.
వెంకన్న: కానీ స్వామి వాడి చదువు.
స్వామిజి: చూడండి, జ్ఞానం అదేది మనిషికి అనుకుంటే రాదు. దానికి సమయం, ఆలోచన, గ్రహించాలి అన్నకోరికఉండాలి. అతి ముఖ్యంగా సంకల్పం, ఆ జ్ఞానాన్ని ఎందుకు తను గ్రహించాలి అన్న ఒక గట్టి అవసరంఅతనికిఉండాలి. అది తనకు తానే తెలుసుకున్న రోజు, తనకు తానే చదువుతాడు.
వెంకన్న: కానీ స్వామి వాడు, చెప్తే వినడు. నేను ఎంత కొట్టినా తిట్టినా ఏ మార్పు లేదు.
స్వామిజి: చూడండి, నేను చెప్పాను కదా.. సంకల్పం. సంకల్పం ఉన్నవాడు అది సాధించడానికి కావాల్సినజ్ఞానంవాడే సమకూర్చుకుంటాడు. పిల్లాడిలో మార్పు వస్తుంది కానీ ఎప్పుడూ అనేది అంతా ఆ కాలమేనిర్ణయిస్తుంది.
ఇక వెంక్నన వాళ్ళు ఒక చిన్న ఆశతో ఇంటికి వచ్చారు.
వెంకన్న శివ కి మళ్ళీ చదువుకోమని నచ్చచెప్పి ఇక సెలవులు కదా ఆడుకోమన్నాడు.
శివ నేరుగా సాయి దగ్గరకి వెళ్ళాడు.
శివ: సాయి నీకు పార్వతి వల్ల ఇళ్లు తెల్సా..
సాయి: తెలీదు రా అయిన వాళ్ళు ఈ ఊర్లో కాదు పక్కుర్లో ఉంటారట. వాళ్ళ నాన్న రోజు బండి మీదతీసుకొస్తాడుఅట.
శివ: రేయ్ నాకు పార్వతిని చూడాలి అని ఉందిరా.
సాయి: ఏంట్రా అలా అంటావు?
శివ: పార్వతి మొన్న నన్ను తిట్టింది రా.
సాయి: ఎం తిట్టింది?
శివ: నేను మొద్దుని అట, stupid అట. నాతో స్నేహం చెయ్యడం waste అంట.
