ప్రేమ కాటులు

సాయి: పోతే పొన్లేరా.

శివ: లేదురా సాయి, నేను పార్వతిని నా భార్యగా అనుకుంటున్న. ఎప్పటికైనా నేను తననే పెళ్లి చేసుకోవాలి.

సాయి: పిచ్చారా నీకు, నువ్వు సరిగ్గా చదవవు అని నీ మొహం కూడా చూడదు, అలాంటిది నిన్ను పెళ్ళి, అయినట్టే.

వీళ్ళు మాట్లాడుకునేది ఒక మందు కొట్టి ఉన్న uncle విని,

Uncle: బచ్చగాల్లారా, ఇంకా పెద్ద మనుషులు కూడా కాలేదు, అది వీడిని తిట్టిందంటా, పెళ్ళిచేసుకుంటాడంటా.. పొండి ఇక్కడ నుంచి.

శివ: లేదు uncle తను అంటే నాకు బాగా ఇష్టం.

Uncle: అవునా, మరి నువ్వు చదువ్వుకదరా, అది నిన్ను ఎలా ఇష్ట పడుతుంది. రెయ్ ఆడవాళ్ళు అలాఉండరురా నేను కూడా నీలాగే అనుకుని ఒక పిల్ల వెంట పడ్డాను, ఇప్పుడు అది నాకంటే బాగా సంపాదించేవాడు దొరికాడు, అని వెళ్ళిపోయింది.

శివ సాయి అక్కడ్నుంచి, వెళ్ళిపోయారు.

సాయి: శివ నువ్వు పార్వతికి దగ్గర అవ్వాలి అంటే ఒకటే దారి. నువ్వు class first రావాలి, ఆ uncle ఏమన్నాడోవిన్నావా, పార్వతి నిన్ను పెళ్ళిచేసుకోవాలని ఉంటే, తనకు నీకన్న మంచి సంబంధం దొరకకుండాఉండాలి.

శివ: అవునురా, అయితే చదువుతారా నేను, ఎంత చదువుతాను అంటే పార్వతి కంటి ముందు నాకన్నాబాగాచదివిన వాడు ఇంకొకడు ఉండకూడదు.

అయితే సెలవులు అయిపోయాయి.

మొదటి రోజు కాలేజ్ కి వచ్చారు, కానీ ఆ రోజు పార్వతి రాలేదు. అలా 4 రోజులు గడిచాయి పార్వతి మాత్రంరాలేదు.

ఎవరో చెప్పారు, పార్వతి వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు అని.

శివ చాలా నిరాశపోయాడు. ఈసారి ఎలాగైనా బాగా చదివి పార్వతి ముందు నిరూపించుకుందాంఅనుకున్నాడుకానీ ఇలా అయ్యింది.

సాయి: శివ మరి పార్వతి ఇక నీకు దూరం ఐనట్టేరా.

శివ: లేదురా నేను బాగా చదువుకుంటాను. బాగా చదివి మంచి ఉద్యోగం చేసి, ఎలాగైనా పార్వతిఎక్కడుందోకనుక్కొని పెళ్లి చేసుకుంటాను.

రెండు రోజులకు,

శివ సాయి ఇద్దరూ రోడ్డు పక్కన కూడా ర్చొని మాట్లాడుకుంటున్నారు.
అప్పుడే ఒక lorry అటు నుంచి వెళ్ళింది, అలాగే పార్వతి కూడా ఆ లారీ లో ఉంది.

సాయి అది చూసి,

సాయి: రేయ్ శివ పార్వతి రా. ఆ లారీ లో

శివ: నిజమా?

సాయి: అవునురా నేను చూసాను.

శివ ఏమీ ఆలోచించలేదు ఆ lorry వెనక పరిగెత్తాడు. పరిగెడుతునే ఉన్నాడు. కానీ.ఆ lorry చాలా speed గావెళ్ళిపోయింది.

అయినా సరే శివ అలాగే ఉరుక్కుంటు వెళ్ళాడు.

సాయి: శివ ఆగురా, ఆగు….

సాయి మనసులో ” దాని పిచ్చి పట్టింది వీడికి”

కానీ శివ అసలు ఏమీ పట్టించుకోకుండా ఉరుకుతూ చివరకి పార్వతి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాడు.

చాటుగా ఉంటూ అక్కడ ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు.

పార్వతి వాళ్ళు మిగిలిన సామాన్లు తీసుకువెళ్ళడానికి వెచ్చారు.

పార్వతి శివని చూసింది.

పార్వతి మనసులో ” వీడెంటి ఇక్కడ ”

ఇక శివ దగ్గరకు వచ్చి,

పార్వతి: ఏయ్ stupid fellow నువ్వేంటి ఇక్కడ?

పార్వతి అలా stupid fellow అనడం ఎందుకో శివ కి నచ్చింది. పార్వతి తిట్టినప్పుడల్ల శివకి నచ్చుతుంది.

శివ అప్పటికే బాగా పరిగెత్తే సరికి మోసపోసుకుంటు ఉన్నాడు. మాట రావట్లేదు. మొసపోసుకుంటూ ఉన్నాడు.

శివ: పార్….. పార్వతి నిన్ను చూడాలి అని వచ్చాను.

పార్వతి: చూసావు కదా పో. మళ్ళీ నన్ను విసిగించకు.

శివ: పార్వతి ఎందుకు అలా అంటావు. నేను సరిగ్గా చదవను అనే కదా నన్ను పట్టించుకోవు నువ్వు. ఇప్పుడుచదువుతాను మన class లో నీకన్నా నేనే first rank వస్తాను.

పార్వతి: అది నీ వల్ల కాదులే. అయినా నేను ఇక ఇక్కడ ఉండట్లేదు నువ్వు ఏమైతే నాకేంటి. (అని పొగరుగామాట్లాడింది)

సాయి అప్పుడే అక్కడికి సైకిల్ మీద వచ్చి పార్వతి అలా అనడం చూసి, కోపంతో,

సాయి: పోగరుబోతు దాన, వాడు నీకోసం మా ఊరునుంచి ఇక్కడి దాకా ఉరుక్కుంటు వచ్చాడే. కానీ నువ్వుఏమైతే ఏంటి.. ఆ?

ఆశ్చర్య పోతూ , పార్వతి: ఏంటి 8kms ఉరుక్కుంటు వచ్చాడా.

సాయి: అవును నీకోసం.