ప్రేమ కాటులు

శివ కి సాయి పార్వతిని అలా అనడం నచ్చలేదు. కోపం వచ్చింది,

శివ: నా పెళ్ళాం నన్ను ఏమైనా అంటుంది నీకెందుకు రా దెంగేయ్ ఇక్కడనుంచి.

పార్వతి: పెళ్ళాం ఏంట్రా?

శివ: అవును పార్వతి నేను ఎప్పటికైనా నిన్నే పెల్లిచేస్కుంట, బాగా చదుకుంట, నా కన్నా బాగా చదివేవాడు నీముందు ఇంకోడు ఉండడు.

పార్వతి: చుడు శివ చదవడం నీ వల్ల కాదు కానీ, ఏదైనా physical work అదే fitness sports లాంటివిచేస్కో, అప్పుడైనా నువ్వు బాగుపడతావు.

శివ: కానీ పార్వతి ఇప్పుడు మీరు ఎక్కడికి పోతున్నారు?

పార్వతి: ఎందుకు అక్కడికి కూడా వస్తావా?

శివ: నీకోసం ఎక్కడికైనా వస్తాను.

పార్వతి: అయితే అస్సలు చెప్పాను.

శివ మనసులో ” మరి నిన్ను ఎలా కలవాలి పార్వతీ, అసలు చదవడం నా వల్ల అవుతుందా నాకే తెలీదు ”

శివ: పార్వతి చెప్పు, నిన్ను చూడకుండా నేను ఉండలేను.

శివ కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఇక మళ్లీ పార్వతిని కలవగలడో లేదో అని.

పార్వతి: లేదు శివ నువ్వు ఏడవకు, నువ్వు అబ్బాయి ఏడిస్తే బాగోదు.

పార్వతి శివ దగ్గరకి వచ్చి, శివ బుగ్గ మీద ముద్దు పెట్టింది.

శివ సాయి ఇద్దరుకి అసలు ఏం జరుగుతుంది అని అర్థం కావటం లేదు. ఇది నిజమా కల అనుకున్నాడు శివ.

పార్వతి: శివ నన్ను మర్చిపో ఇవన్నీ నీ వల్ల కాదు. ఇక నుంచైనా బాగా చదువుకో, ఎవరైన చూసే లోపే ఇద్దరుఇక్కడనుంచి వెళ్ళిపొండి. బై

అని చెప్పి వెళ్ళిపోయింది.

శివ ఆ షాక్ లోంచి బయటకు వచ్చి.

శివ: అరేయ్ ముద్దు పెట్టింది ఏంట్రా?

సాయి: ఏమో రా నాకేం తెల్సు, రేయ్ తనకి నువ్వంటే ఇష్టమెరా కానీ కావాలనే నీతో ఆడుకుంటూ ఉంది.

ఇక చేసేది ఏం లేక ఇద్దరు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

—————————————————————

శివ 10వ తరగతి చదివే మొదట్లో,

శివ సైకిల్ మీద బడికి వెళ్తున్నాడు.

రమేష్: వారి శివ ఆగురా.

శివ: ఎందన్నా?

రమేష్: నీ cycle నాకిచ్చి బడికి నడుచుకుంటూ పో…

శివ: గట్లెట్ల, నెన్ సైకిళ్ మీదనే పోతా.

రమేష్: ఎమ్రో ఏషాలా… ఎదో పోరెంబడి పస్తున్నవటా, సదువు లేదు, పోరెందుకు రా నికు. ఇంట్లో చెప్పాలా ఈవిషయం.

శివ: వద్దన్న… Please

రమేష్: పో సైకిల్ ఇచ్చి … సాయంత్రం నేనే బడి కాడికి తెచ్చిస్త.

శివ: సరే అన్న (అని ఇక సైకిల్ ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళాడు)

సాయంత్రం బడి నుంచి ఇంటికి వస్తూంటే,

రమేష్ శివ సైకిల్ తెచ్చి ఇచ్చాడు.

Cycle pumpchar అయింది.

శివ: అన్నా tyre ల గాలి పోగొట్నావ్…? (అని cycle ని చూసి అడిగాడు)

రమేష్: అరె తొవ్వ మంచిగ లెద్రా, గాలి దిగింది కొట్టిచకోపో..

శివ: అన్న గాలి దిగుడు కాదు పాంచార్ అయ్యింది..

రమేష్: ఆ అయితే …? (అడిగాడు)

శివ: నువ్వే పాంచార్ చేస్నవ్ నువ్వే repair చేపియ్యు. (అని బదులిచ్చాడు)

రమేష్: నక్రాల పో, నీ cycle కి నువ్వే చేపిచకోవలే, నేను ఎందుకు చేపిస్తర, డొక్కు cycle అది నిన్ను అసలుcycle అడుగుడే తప్పైంది పో.

శివ: అగో నువ్వే చేశ్నవ్ కదా మరి.

రమేష్: పో రా గా పోరి గూర్చి మీ అయ్యకి చెప్తా ఇంకో సారి నేనే పాంచార్ చేస్నా అంటే.

ఇక శివ ఏమి అనలేక.

శివ దగ్గర పైసల్ లేవు, ఇంట్లో నాన్న ని అడిగితే తిడతాడు అని అనుకున్నాడు.

ఇక సైకిల్ ని తోసుకుంటూ ఇంటికి వెళ్ళాడు.

వెంకన్న: ఏమైంది రా cycle కి నూకుంట వస్తున్నావు?

శివ: పాంచార్ అయ్యింది.

వెంకన్న: కొత్త tyre ఎపిచ్చి వారం కూడా ఐతలేదు కదరా…బడికి పాయినవ బయట తిరిగి వస్తున్నవ? (కోపంగా)

శివ: లేదు నాన్న, కాలేజ్ కే పోయి వస్తున్న.

వెంకన్న: మరి cycle ఎందుకు అయింది.

శివ: ఏమో నాన్న కాలేజ్ నుంచి బయటకి వచ్చేసరికి…..