“సంజు….. ఏంటది ఆలా ఫోన్ చేసి మాట్లాడేస్తారా అంత ఓపెన్ గా ?? నాన్న ఒప్పుకోవటం ఆశ్చర్యం గా ఉంది”
“తప్పేముంది, అంత ఓపెన్ గా చెప్పాను కదా…..ఎవరైనా ఎందుకు ఒప్పుకోరు ??”
ప్రియ కు ఎం మాట్లాడాలో అర్ధంకాలేదు అనుకుంటాను.
“ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉందా నీకు ??”
“hmmmm కొంచెం”
“కొంచెం కాదే…. చాలానే …. ఇప్పుడు నీ మోహంలో మంచి కళ వచ్చింది”
ప్రియ నవ్వి “థాంక్స్ సంజు…..”
“ఇట్స్ ఒకే”
“అవును ఎందుకలా అబద్ధం చెప్పావ్ ఆంటీకి??”
“ఏమో సంజు తెలీదు. టెన్షన్లో ఆలా చెప్పేసాను”
“టెన్షన్ ఎందుకు ??”
“ఉండదా మరి ?? ఇలా నీతో రావటం”
“అవును తప్పేముంది దాంట్లో”
“తప్పనికాదు……ఇంకా పెళ్లి అవ్వక ముందు…..ఇలా బయటకు రావటం”
“ప్రియ మనం ఏమి తప్పుచేయట్లేదు ఓకేనా, జస్ట్ ఆలా బయటకు వచ్చాము…..అంతే….అంకుల్ కి కూడా చెప్పాను… ఆయన కూడా ఒప్పుకున్నారు కదా”
“అవును”
“అంకుల్ ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికి నీకు అర్థం కావట్లేదు కదా ??” అని నవ్వుతూ అడిగాను.
“అవును”
“దాంట్లో ఎం మేజిక్ లేదు…… ఉన్న విషయం ఓపెన్ గా చెప్పి రిక్వెస్ట్ నీ ముందే చేశాను గా”
“hmmmmm”
“నీకు నమ్మబుద్ది కావట్లేదు కదా ??”
“అవును సంజు”
కొన్ని సెకండ్స్ తర్వాత:
“థాంక్స్ సంజు”
“ఇట్స్ ఒకే స్వీటీ”
తన మోహంలో ఒక దాచుకోలేని నవ్వును చూసాను.
ప్రియ తో “నెక్స్ట్ వీకెండ్ ఎమన్నా సినిమాకు వెళ్దామా ??”
“సంజు…..”
“ఎవరి పర్మిషన్ ఐన కావాలంటే…. చెప్పు ఇప్పుడే తీసుకుందాం”
ప్రియ నన్ను కొంచెం కోపంగా, కొంచెం నవ్వుతో చూస్తుంది.
నేను “ఏంటి??”
“సరే….. నువ్వే చెప్పు ఏ సినిమా కి వెళ్దామో”
నేను “స్వీటీ, నెక్స్ట్ వీక్ ఒక పెద్ద తుఫాన్ గ్యారంటీ….”
ప్రియ నవ్వింది “నువ్వేదో ఒకటి చెప్పి నాన్నను కూడా ఒప్పిస్తావ్ ఎలాగో……అందుకే”
“అంకుల్ సంగతి పక్కన పెట్టు, నేను చూసుకుంటాను. నీకు ఒకే నా కాదా ??”
తను సైలెంట్ గా ఉంది.
“స్వీటీ, మనకి ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది కాబట్టి…. అలా సరదాగా ఒక సినిమాకి వెళ్ళటంలో తప్పేముంది…. మార్నింగ్ షో కి వెళ్దాము ఓకేనా ”
“hmmmmm…..”
ఇక ఫుడ్ అంత తేనెసం. వెయిటర్ ఎమన్నా కావల అని అడిగాడు
“ఐస్ క్రీం తిందామా ??”
“ఓకే”
“నాకు బటర్ స్కాచ్”
“నీకు ??”
“చాక్లెట్”
ఇంతలో ఇంకొక అతను వచ్చి టేబుల్ మీద ప్లేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు.
“స్వీటీ, నేను నిన్ను ఒకటి అడుగుతాను…..”
“ఏంటి సంజు”
“కాదనకూడదు మరి”
“ఏంటి ??”
“నిన్ను స్వీటీ అని పిలుస్తాను…”
“ఆల్రెడీ స్వీటీ అనే పిలుస్తున్నావ్ గా ”
ఇద్దరం నవ్వుకున్నాం.
టు బి కంటిన్యూడ్……
నా ఫోన్ తీసుకొని ఫోన్లో “ప్రియ డార్లింగ్” బదులు “స్వీటీ డార్లింగ్” అని ఫీడ్ చేసుకున్నాను.
“నువ్వెప్పుడూ చీరలే వేసుకుంటావా ??”
“లేదు…. చుడీ దార్స్ వేసుకుంటాను…..”
“hmmmmm…….ఒకే”
“స్వీటీ, ఎంగేజ్మెంట్ వచ్చేస్తుంది. ఊరికి ఎప్పుడు వెళ్తున్నావ్??”
“ఒక 3 డేస్ తర్వాత…….”
“hmmmmmmm…… నెక్స్ట్ వీక్ నుంచి మన వేళ్ళకి రింగ్స్ ఉంటాయి”
“యా….. అంత చాలా ఫాస్ట్ గా అయిపోతుంది”
నేను మనసులో – ఫాస్టా ?? నాకు ఒక్కో రోజు ఒక వారం లాగా గడుస్తుంది అనుకున్నాను.
“స్వీటీ, జస్ట్ తెలుసుకుందాం అని అడుగుతున్నాను, నా ప్రొఫైల్ చూసి ఫస్ట్ మీరు అమానుకున్నారు ??”
“huh ??”