లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 260

అక్కడున్న అన్నిటిని నేను మరచిపోయి నా దృష్టి అంత ప్రియ పైనే. ప్రియ చాల బాగా రెడీ అయ్యి వచ్చింది. అందరూ ఉన్నందుకో ఏమో మరి చాల సిగ్గుపడుతూ ఉంది. మధ్యలో అమ్మ ప్రియ కి చీర ఇచ్చింది. ప్రియ ఆ చిరాకు మార్చుకొని వచ్చింది. ఇంకా అందంగా ఆ చీరలో కనపడింది. చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి చిరవరగా పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. పోయినసారి ఓ ముహూర్తం అనుకున్నారు, ఇప్పుడు ఆ ముహుర్తాన్ని పద్ధతి ప్రకారం పంతులు ఫైనల్ చేసారు.

తర్వాత ఉంగరాలు మార్చుకోవాలి. ఇద్దరం ఎదురెదురుగా నిల్చున్నాము. ప్రియ వాళ్ళ కసిన్స్ ఒక ఇద్దరు ఉన్నారు అక్కడే. ప్రియ ని టీస్ చేస్తున్నారు తను సిగ్గుపడిపోతుంది. నాకు రింగ్ ఇచ్చారు. ప్రియ తన చేయిని పైకి తీసుకొని నా ముందు పెట్టింది. నేను తన చేయి పట్టుకొని నెమ్మదిగా రింగ్ తొడిగాను. ఈ లోపల ఫోటోల కోసం కెమెరా వైపు చూసాము. అందువల్ల తన చేయి అలాగే పట్టుకొని ఉండిపోయాను. తను కూడా నా చేయి పట్టుకొని రింగ్ తొడిగింది. ఇద్దరం అలా ఒక్కసారి కళ్ళలోకి కళ్ళుపెట్టుకొని చూసుకున్నం. ప్రియను ఆలా తాకగానే ఒక మంచి అనుభూతి. తన లేత చేయిని పట్టుకొని అలా కొంచెం సేపు…. మరవలేక పోతున్నాను. ఈ క్షణంతో నాకు ప్రియ కు సగం పెళ్లి అయిపోయినట్లే.

ఇంక ఫంక్షన్ అయిపోయింది అనుకున్నాము, ప్రియ వాళ్ళ కసిన్స్ కేక్ తెచ్చారు. పక్కన ఒక చిన్న టేబుల్ వేసి, ఆ కేక్ మేము కోయటానికి రెడీ చేశారు. కేక్ పైన సంజయ్ అండ్ ప్రియ ఎంగేజ్మెంట్ అని రాసి ఒక రెండు హార్ట్ సింబల్స్ ఉన్నాయి. అయితే కాండిల్స్ వెలిగించి ఆర్పే బదులు, ఇద్దరినీ రెండు కాండిల్స్ వెలిగించామన్నారు. నేను ప్రియ కాండిల్స్ వెలిగించాము. అందరూ చప్పట్లు కొట్టారు.

ప్రియ చేయి పట్టుకొని కేక్ కొయ్యమన్నారు. నేను నెమ్మదిగా పియ చేయి పట్టుకొని ఇద్దరం కేక్ కోసాము. వెనకాల నా చెల్లి ప్రియ కసిన్స్ హడావిడి చేస్తున్నారు. నన్ను కేక్ తీసుకొని ప్రియకు పెట్టమన్నారు. ఆలా అందరి మందు ఉండటంతో డిస్కంఫోర్ట్ ఫీల్ అయ్యాను. నెమ్మదిగా ఒక కేక్ ముక్క తీసుకొని ప్రియ నోటిలో పెట్టాను. తను ఆలా కేక్ లోపలి తీసుకుంది. కెమెరా వైపు చూస్తే ఫోటోలు తీశారు. అలాగే ప్రియా కూడా తన చేత్తొ నాకు ఒక కేక్ ముక్క నోట్లో పెట్టింది. మధ్యలో వాళ్ళ కసిన్స్ బాగా టీస్ చెయ్యడంతో సిగ్గుపడి తల కొంచెం అటు వైపు తిప్పుకుంది కొంచెం సేపు నవ్వటానికి. అందరూ తన సిగ్గు చూసి నవ్వారు. అది అయ్యాక, ఫోటోల కోసం స్టేజి మీద ప్రియ నేను నిల్చున్నాము, చాల ఫొటోస్ తీశారు. అలాగే మా ఫామిలీ ప్రియా ఫామిలీ వాళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగారు.

తర్వాత ఇద్దరం ఒకచోట కూర్చొని తిన్నాము. కేవలం చూపులకు మాత్రమే ప్రియ నేను పరిమితమయ్యాము.

ఒక వారం తర్వాత:

ఎంగేజ్మెంట్ అయ్యాక ఆఫీస్ పనిలో బిజీ అయిపోయాను. అయితే అపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాలి, ఇంటికోసం వస్తువులు కొనాలి, ఇంటికి గృహప్రవేశం చేయాలి. అలాగే కార్ కొనుక్కోవాలి.

ప్రియకు ఫోన్ చేశాను:

“హలో స్వీటీ”

“హాయ్ సంజు”

“ఎలా ఉన్నావ్ ??”

“నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావ్ ??”

“నేను ఒకే కానీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. మన ఎంగేజ్మెంట్ నిన్నే జరిగినట్లు ఉంది”

“నాకు అలాగే ఉంది”

“నువ్వు ఎంగేజ్మెంట్ లో చాల అందంగా ఉన్నావ్”

“థాంక్స్ సంజు….. నువ్వు కూడా చాల బాగా కనిపించవు…నీ డ్రెస్ చాల బాగుంది”

“థాంక్స్ స్వీటీ….. నువ్వు సెలెక్ట్ చేసిందే గా ఆ రోజు”

“నేను సెలెక్ట్ చేశానా ??”

“అవును. thumbs up ఇచ్చావ్ గా వాట్సాప్ లో”

“hmmm”

“కేక్ చాలా బాగుంది కదా”

“యా అవును నేనింకా కేక్ అలాగే ఫ్రిడ్జ్ లో ఉంచాను. అయిపోతుందని”

“కేక్ ఇంకా తినలేదా ??”

“తింటున్నాను రోజు కొంచెం కొంచెం”

“నేను నెక్స్ట్ రోజే అయిపోగొట్టాను”

ప్రియ నవ్వింది ఫోన్లో

“అవును ప్రియ, ఎంగేజ్మెంట్ చాలా సిగ్గుపడిపోయావు…. నాకు అర్థంకాలేదు”

“ఎం చేయాలి సంజు. నా వెనకాలే నా కసిన్స్ టీజ చేస్తూ ఉన్నారు”

“నేను మాట్లాడేది అప్పుడు విష్యం కాదు. జనరల్ గా”

“అలా ఎం లేదే”

“నేను బాగా గమనించాను, మోహంలో చాలా సిగ్గు నవ్వు”

“మరి ఉండదా…..పెళ్లవుతున్న ఆడపిల్లని నేను”

“అదేలే….కానీ చాలా క్యూట్ గా కనిపించావు”

“సంజు……ఇది చాలు నన్ను పొగిడింది”

“పొగడటం కాదు నిజం చెప్తున్నాను స్వీటీ”

“ఇప్పటికి నేను అందంగా క్యూట్ గా ఉన్నాను అని ఇంతకముందు కూడా చెప్పావ్”

“ఎంగేమెంట్లో ఇంకా ఎక్కువ అందంగా క్యూట్ గా కనపడ్డావ్”

“పో సంజు….”

“ఏంటి ??”

“ఎం లేదు…..”

“ఎందుకు నవ్వుతున్నావ్??”

“నేనా ?? లేదే”

“నిన్ను చూడకపోయినా, ఫోన్లో నీ నవ్వు వినిపిస్తుంది. అంత సిగ్గా ??”

“నేను సీరియస్ గా నే ఉన్నానే”

“సరే ఒక వీడియో కాల్ చేయి…. ఇప్పుడే తేలుద్దాం నువ్వు సీరియస్ గా ఉన్నావా లేక నవ్వుతున్నావా అని”

“అబ్బా ఆ సాకుతో వీడియో కాల్ చేద్దామనా ??”

“హే అవును కదా….. మనం వీడియో కాల్ లో ఎందుకు మాట్లాడ కూడదు ?? వీడియో కాల్ చేస్తాను అగు”

“సంజు నో ఏమి అక్కర్లేదు”

“అదిగో మల్ల నీ గొంతులో నవ్వు”

“సంజు ఇక చాలు….నేను ఫోన్ పెట్టేస్తున్నాను”