లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 260

“ఆగు ఆగు…..వద్దు”

“చెప్పు మరి”

“నాకు బాగా అర్థమైంయింది నువ్వు ఎందుకు వీడియో కాల్ వద్దంటున్నావో….. అది పక్కన పెడితే…. మనకి ఐమాక్స్ థియేటర్ లో రెండు టికెట్స్ సండే కి బుక్ చేశాను సినిమా కి”

“సంజు……”

“ఏంటి స్వీటీ??”

“ఇది చెప్పటానికేనా కాల్ చేసావ్ ??”

“కాదు ఇంకా ఉంది”

“ఏంటి ??”

“నీకు అపార్ట్మెంట్స్ చూపించాలి. నీకు నచ్చిందా లేదా నాకు చెప్పాలి”

“ఓ అదొకటి ఉంది కదా…..”

“అవును”

“ఎప్పుడు చూడాలి అపార్ట్మెంట్స్ ??”

“సండే నే…. మార్నింగ్ అపార్ట్మెంట్స్ చూద్దాం, తర్వాత లంచ్ కి, ఆ తర్వాత మూవీ కి”

“రోజంతానా ??”

“అవును”

“నువ్వు కావాలనే ఇలా ప్లాన్ చేసావ్”

“అవును. సాటర్డే అయితే ఒక సగం రోజు పోతుంది. మళ్ళా సండే మూవీ కి ఇంకో సగం రోజు పోతుంది. అందుకే సండే అయితే. సాటర్డే ఎమన్నా పనులు ఉంటె నువ్వు చూసుకోవచ్చు”

“నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావ్”

“నీ ఇష్టం సాటర్డే సండే రెండు రోజులు పోతాయి ఆలా ప్లాన్ చేస్తే”

“వద్దులే”

“స్వీటీ….”

“ఏంటి??”

“మనకి సగం పెళ్లయిపోయింది. నువ్వు ఇంకా నన్ను వేరే వ్యక్తి లాగా చూస్తున్నావ్”

“సంజు ఆలా అనుకోవద్దు. అంటే పెళ్ళికి ముందు ఇలా అంత మనం తిరుగుతూ ఉండటం……”

“మరి మనకోసమే కదా అపార్ట్మెంట్ వెతికేది, ఎంగేజ్మెంట్ అయ్యాక మనం సరిగ్గా మాట్లాడుకోలేదు, అందుకే కొంచెం సమయం గడిపినట్లుంటదని ఇలా ప్లాన్ చేశాను”

“నువ్వు చెప్పేది కరెక్టే”

“ఈ రోజు సైక్లోన్ గ్యారంటీ”

తాను ఫోన్లో నవ్వింది

“అవును నిజం. నేను చెప్పిన దానికి ఫస్ట్ టైం ఒప్పుకున్నావ్”

“సంజు…..ఇక చాలు”

“ఎం చేస్తున్నావ్??”

“నీతో ఫోన్ మాట్లాడుతున్నాను”

“అబ్బో…జోకులు కూడా బాగానే వేస్తున్నావ్”

తను నవ్వి “ఎం లేదు ఫేస్బుక్ లో మన ఫొటోస్ పెట్టముగా, ఆ ఫొటోస్ చూస్తున్నాను”

“నేను కూడా అంతే”

నాకు ఈలోపల ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది.

“సరే స్వీటీ నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది… మళ్ళా మాట్లాడుకుందాం…..బాయ్”

“బాయ్ సంజు”

టు బి కంటిన్యూడ్…..

ఆదివారం:

నేను పొద్దునే లెగిసి. తల స్నానం చేసి, టిఫిన్ తిని. కారు కోసం ఫ్రెండ్ ఇంటికి బైక్ లో వెళ్ళాను. ఈ సారి ఫ్రెండ్స్ అందరూ బిజీ, అందుకే చివరగా ఒక ఫ్రెండ్ దగ్గర ఒక పాత మారుతీ కార్ ఉంటె అది తీసుకున్నాను.

అక్కడ కార్ తీసుకొని ప్రియ కు ఫోన్ చేసాను:

“హలో స్వీటీ”

“హాయ్ సంజు”

“నేను ఒక 15 మినిట్స్ లో అక్కడ ఉంటాను, రెడీ గా ఉండు”

“ఒకే”

“సరే స్వీటీ”

అని ఫోన్ పెట్టేసాను.

దారిలో పెర్ట్రోల్ కొట్టించుకొని, ఒక రెండు రోజా పువ్వులు తీసుకొని ప్రియ ఇంటికి వెళ్లాను. ఫోన్ చేసిన రెండు నిమిషాలకు ప్రియ వచ్చి కార్ ఎక్కింది. తాను చుడిదార్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను.

“చుడిదార్ లో కూడా అందగా ఉన్నావ్ స్వీటీ”

“సంజు ఇక మొదలుపెట్టావా ??”

ఇద్దరిలో ఒక దాగిఉన్న ఒక చిరునవ్వు.

“నిజం స్వీటీ….”