లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 260

తనకు ఎం చెప్పాలో తెలియలేదేమో తన మోహంలో నవ్వు దాచుకొని నన్ను చూస్తూ ఉంది. నేను తనను అలాగే చూసాను.

ఇంతలో నా జోబిలోనుంచి ఒక రోజు పువ్వు తీసి తనకు ఇచ్చాను.

“స్వీటీ…..తీసుకో నీ కోసమే తెచ్చాను…..చూడు ఎంత అందంగా ఉందొ పువ్వు….”

“సంజు….పెళ్లి తర్వాత…..ఇప్పుడు కాదు”

“మనకు సగం పెళ్లి అయిపోయింది స్వీటీ…. చూడు” అని వెలికి ఉన్న రింగ్ చూపించాను.

“పర్లేదు…..”

పువ్వు నా చేతిలో ఉంది. నేను నా చెయ్యిని కొంచెం కిందకు వంచి “చూడు స్వీటీ…..పువ్వు ఎలా బాధపడుతుందో నువ్వు ఆలా అనేసరికి” అని చూపించాను.

తాను నవ్వి “సంజు….ఇక చాలు”

“స్వీటీ….. ఇదిగో…..” అని నా ఫోన్ wallpaper చూపించాను. ఆ ఫోటీలో స్వీటీ నాకు కేక్ తినిపిస్తుంది. నేను నాలుగు wallpaper lu పెట్టాను ఫోన్ లో. రెండు రింగ్స్ మార్చుకోవటం, రెండు కేక్ తినిపించుకోవటం. కరెక్టుగా ఆ టైములో ఫోన్ లో ఆ వాల్పేపర్ ఉంది.

“చూడు ఇద్దరం కేక్ కోసి అందరి ముందు తిన్నాము….ఇది ఒక పువ్వు మాత్రమే…” అని చెప్పాను.

తను నన్ను చూస్తూ ఉంది.

“……నా కోసం కాకపోయినా ఈ అందమైన పువ్వు కోసమైనా నువ్వు దీనిని తీసుకో…..”

తను కొంచెంసేపు అలా చూసి, ఆ పువ్వుని తీసుకుని తన జుట్టు వెనకాల పెట్టుకుంది.

“సంజు గారు ఇప్పుడు హ్యాపీనా ??” అని అడిగింది.

నేను లేదు అని తల ఊపాను. తనకు అర్థంకాలేదు.

నేను ఇంకో పువ్వు తీసి ఇచ్చాను. తాను అలాగే చూస్తూ ఉంది.

“అంటే పోయిన సరి తీసుకోలేదు కదా అని…..”

ఆ పువ్వు తాను తీసుకొని నా చెవిలో పెట్టింది.

“ఇప్పుడు ఓకేనా??” అని అడిగింది.

ఇద్దరం నవ్వుకున్నాం. నేను నా చివిలో ఉన్న పువ్వు తీసి “నా కోసం కాదు స్వీటీ గారు, మీ కోసమే……”

“సంజు….”

“చూడు ఎంత అందంగా ఉందొ…..నీలాగా”

“సంజు……..చాలు”

నేనప్పుడు గొంతు మార్చి, పెదాలు అప్పుడప్పుడు కదులుస్తూ మిమిక్రీ చేసాను “ప్రియ గారు…. నన్ను తీసుకోండి ప్లీజ్…..” అని అన్నాను

తను కొంచెం ఆశ్చర్యంగా కొంచెం నవ్వుతు చూసింది.

“నేను కాదు స్వీటీ, పువ్వు నిన్ను అడుగుతోంది అలాగా” అని మాములు గొంతుతో అన్నాను.

“ఏంటి ??” అని నవ్వేసింది.

“ప్రియ గారు, నన్ను తీసుకోండి ప్లీజ్….” అని మళ్ల గొంతు మార్చి పువ్వు మాట్లాడుతున్నట్లు మిమిక్రీ చేశాను.

“చూడు స్వీటీ, పువ్వు గారు ఎలా బాధపడుతున్నారో”

తను ఆ పువ్వును తీసుకొని, పువ్వుతో “పువ్వు గారు, మిమ్మల్ని పెళ్లయ్యాక తీసుకుంటాను ఓకేనా??” అని అడిగాను.

“ప్లీజ్ ప్రియ గారు, ఇప్పుడే తీసుకోండి నన్ను, నేను వాడిపోతాను లేదంటే…ప్లీజ్” అని మిమిక్రీ చేశాను.

ఒక అర నిమిషం అలాగే నన్ను ఒక దాగి ఉన్న చిరునవ్వుతో చూసి, తాను ఆ పువ్వును కూడా జుట్టు వెనకాల పెట్టుకొని “ఇప్పుడు హాపీ నా ??” అని నన్ను అడిగింది.

“నన్ను కాదు, పువ్వు గారిని అడుగు”

తాను కొంచెం నవ్వుతు “పువ్వు గారు ఇప్పుడు హ్యాపీనా??”

“హాపీ” అని గొంతు మార్చి అన్నాను.

“హ్యాపీ అంట స్వీటీ” అని మాములుగా చెప్పాను.

ఇద్దరం నవ్వుకున్నాం.

కొంచెం గ్యాప్ తర్వాత “స్వీటీ… వెళ్దామా మరి ??” అని అడిగాను.

తను సరే అని తల ఊపింది. ఇక బయలుదేరాము.

ఒక రెండు నిమిషాలు నిసెబ్దం.

“బాగుంది పువ్వు గారి గుంతు” అని చెప్పింది

“పువ్వు గారు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నారు” అని నేను అన్నాను.

“బాగా తెలుస్తోంది”

మళ్ల ఇద్దరిలో కొంచెం నవ్వు.

నెమ్మదిగా అపార్ట్మెంట్ దగ్గరకు చేరాము. అక్కడ ఫోన్ చేస్తే వాచ్ మాన్ దగ్గర తాళాలు ఉన్నాయి అని చెప్తే, అతని దెగ్గరికి వెళ్ళాము. పైకి తీసుకొని వెళ్లి ఇల్లు చూపించాడు. బడ్జెట్ లేదు కాబట్టి ఒక మాములు రెండు గదుల ఫ్లాట్ మాత్రమే సిటీ లో దొరుకుతుంది. ప్రియకి ఫ్లాట్ నచ్చింది కానీ ఏరియా అంతగా నచ్చలేదు.

తర్వాత మిగిలిన రెండు ఫ్లాట్స్ కూడా ప్రియకు చూపించాను.

అక్కడినుంచి ఒక రెస్టారెంట్ కి లంచ్ కోసం వెళ్ళాము. అక్కడ ఒక టేబుల్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసాము.

“సో నీకు రెండవది నచ్చింది….ఉన్నవాటిలో”

“యా అవును”

“hmmm”

“నీకు ??”

“నాకు మూడు ఒకే అనిపించాయి”

అయితే ప్రియకు రెండవది బాగా నచ్చింది కాబట్టి, ఇంకా అదే అని ఫిక్స్ అయ్యాను.

“ఓకే”

ఇంక ఒకటున్నారా నెలలో మా ఇద్దరికీ పెళ్ళైపోతుంది. ఈ ఒకటున్నారా నెల ఒక యుగం లాగా గడిచింది నాకు.

అయితే ప్రియకు నేను ఒక సెక్సీ చీర గిఫ్ట్ గా ఫస్ట్ నైట్ లో ఇద్దామనుకుంటున్నాను. చీర అయితే ఒకే కానీ జాకెట్ సైజు గురించి నాకేమి తెలియదు. నాకు ఆఫీస్ లో ఒక అమ్మాయికి ఎవరో తెలుసు అంటే అక్కడికి వెళ్తే, వాళ్లు జాకెట్ సైజు అడిగారు. ఉన్న విషయం చెప్తే, ఆమె ఏమందంటే ప్రియ జాకెట్ ఒకటి తెచ్చిస్తే, ఆ జాకెట్ చూసి క్రొత్తది కొడతాను అని చెప్పింది.

“ప్రియ…..నేను నిన్ను ఒకటి అడగొచ్చా ??”