“సంజు… సినిమా ఎన్నింటికి??”
“4:30 కి”
“ఇంకా చాలా టైం ఉంది…”
“ఇక్కడ తినేసి అక్కడకు వెళ్లే సరికి సరిపోతుంది లే”
“యా…..”
“నువ్వు మూవీస్ బాగానే చూస్తావా ??”
“పర్లేదు….ఒకప్పుడు బాగా చూసేదాన్ని….కానీ TV చూస్తాను ”
“నేను ఎక్కువగా సాంగ్స్ వింటాను….సినిమాలు తక్కువే….”
“నేనుకూడా పాటలు బాగా వింటాను…..”
“నీకు ఇష్టం అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు??”
“ఇళయరాజా…..ఎస్ రాజేశ్వర రావు…. విశ్వనాథన్…..కే వి మహదేవన్ ”
“ఏంటీ ఎస్ రాజేశ్వర రావు…. విశ్వనాథనా ??…. మీరు కొత్త పాటలు వినరా అండి ??” అని అడిగాను.
ప్రియా నవ్వి “చిన్నపుడు పాడినవన్నీ అవేగా…..ఎప్పుడు పాత పాటలే పాడించేవారు… అలా పాత పాటలు అంటే బాగా ఇష్టం వచ్చింది”
“hmmm…..కంపెటిషన్స్ లో పాడేదానివా ??”
“అవును”
“మీరు కొత్త పాటలు వినరా స్వీటీ గారు ??”
“తక్కువే సంజయ్ గారు” అని కొంచెం నవ్వుతు చెప్పింది
“ఇలా అయితే చాల కష్టమే….స్వీటీ గారు ”
తను నవ్వి “మరి నువ్వు ??”
“రెహమాన్ అండ్ హర్రీస్ జయరాజ్”
“hmmm…”
“నువ్వు ఓల్డ్ సాంగ్స్ వినవా?” అని ప్రియ అడిగింది
“లేదు….”
“ఒకే”
ఒక అరా నిమిషం నిశ్శబ్దం
“నీ హబ్బీస్ ఏంటి సంజు??”
“ఈటింగ్ ఫుడ్, డ్రింకింగ్ వాటర్ & స్లీపింగ్”
తాను నవ్వేసింది “ఏంటి ??”
“ఆఫీస్ పనులకే టైం లేదు….హబ్బీస్ కి ఎక్కడ టైం దొరుకుతుంది…రోజు ఇంటికొచ్చి చేసేది అదే”
“నేను అంతే అనుకో….. నేనడిగేది వీకెండ్స్ ఎం చేస్తావు ??”
“ఏదో ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాను…… ప్రతి వీకెండ్ బయట షటిల్ ఆడతాము…బుక్స్ చదువుతాను…..టీవీ టైం పాస్ కి”
“అదేలే…..”
“స్వీటీ నీ హాబీస్ ఏంటి??”
“పాటలు పడతాను… టీవీ లో కూడా పాటల ప్రోగ్రాములో చూస్తాను”
“అదేలే”
నెమ్మదిగా ఫుడ్ తినేసి థియేటర్ కు వెళ్ళాము. నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి. అవి మాట్లాడుతూ కూర్చున్నాను. తను అక్కడ మాల్ లో షాపింగ్ అని వెళ్ళింది. మేము వెళ్తుంది హారర్ సినిమా అని తనకు తెలియదు. ఏదో ఇంగ్లీష్ సినిమా అని చెప్పి తీసుకొని వచ్చాను. నేను సుర్ప్రైస్ అని సినిమా పేరు తనకి చెప్పాలేదు కారులో అడిగిన.
తను వచ్చిన తర్వాత, సినిమా థియేటర్ కి వెళ్లి కూర్చున్నాము. ఫస్ట్ టైం ప్రియతో ఇలా పక్కపక్కన ఒంటరిగా కూర్చోవటం.
“సంజు….ఇది హారర్ సినిమానా??”
“అవును ఏ??” అని తెలియనట్లు అడిగాను.
“ఆమ్మో నాకు చాలా భయం హారర్ అంటే…..”
“స్వీటీ….నువ్వు ఇప్పుడు 18+, ఇంకా భయపడితే ఎలా ??”
“సంజు ప్లీస్……. వేరే సినిమాకి వెళదాం”
“ఈ రోజు సండే అన్ని థియేటర్స్ ఫుల్, అందుకే ఈ సినిమాకి తీసుకున్నాను, ఇదికూడా ఫుల్ అయ్యింది”
“ఒక్క నిమిషం ఆగు, పాప్ కార్న్ తెస్తాను, అది తింటూ సినిమా చూడు, భయం ఉండదులే”
నన్ను కొంచెం నవ్వుతు కొంచెం కోపంతో చూసింది.
“ఏంటి ??” అని అడిగాను.
“సంజు…..ఆకలేస్తే…. వెళ్లి తెచ్చుకో…..పాప్ కార్న్ తింటే భయం పోదన్ని పిచ్చి పిచ్చి గా చెప్పకు…..”
ఇద్దరం నవ్వుకున్నాం “సర్లే…..నీకేమన్నా కావల ??”
“ఎం వద్దులే”
నేను వెళ్లి ఒక శాండ్విచ్ తేనెసీ లోపలికి వచ్చాను.
టు బి కంటిన్యూడ్……