లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 260

ప్రియా చాల పాజిటివ్ గా ఫీల్ అయ్యింది. కొంచెం తన మోహంలో ఇప్పుడే కంఫర్ట్ వచ్చింది.

“ఒకే…..”

“ఇంతక ముందు ఇక్కడికి వచ్చావ ఎప్పుడైనా??”

“లేదు సంజయ్”

“ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటది”

“hmmm…”

“అవును ప్రియ, నిన్ను ఇంట్లో అందరు ఏమని పిలుస్తారు జనరల్ గా?? ప్రియ అనే అంటారా ??”

తను సైలెంట్ గా ఉంది

“స్వీటీ….. ”

“స్వీటీ న?”

“అవును….”

“ఒకె….. ”

“నిన్నేమని పిలుస్తారు ??”

“సంజు”

“huh ??”

“సంజు అని పిలుస్తారు”

“ఓ, క్యూట్ గా ఉంది పేరు… సంజు”

“నీది ఇంకా క్యూట్ గా ఉంది ….. స్వీటీ అని…….. హే నేను నిన్ను స్వీటీ అని పిలవచ్చ్చా పెళ్లయ్యాక??”

“ప్రియ బాలేదా ??”

“ఆలా అని కాదు, మన జనరల్ పేర్లు బానే ఉంటాయి, కానీ మనకి క్లోస్ గా ఉండే వాళ్ళు మనకి ఒక్క ముద్దు పేరుతో పిలిస్తే ఆ ఫీలింగ్ వేరు”

“ఏమో….. నేను అలోచించి చెప్తాను…..నన్ను ప్రియా అనే పిలువు”

“నన్ను కావాలంటే సంజు అని పిలవచ్చు నువ్వు”

“ఫ్రాంక్ గా చెప్పాలంటే నీకు సంజు నే బాగుంది సంజయ్ కన్నా”

“సో సంజు అనే పిలువు…..”

“hmmmm”

“అవును సంజయ్, మొన్న శారీ ఫొటోస్ వాట్సాప్ మెసేజ్ చేస్తే అన్నిటికి thumbs up ఇచ్చావ్ ??”

“అన్ని శారీస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావ్ స్వీటీ…. ”

“నన్ను ప్రియా అనే పిలువు ప్లీజ్…… ”

“ఒకే….. సొరీ”

“సంజయ్, నేను నీకు ఫొటోస్ పంపింది ఉన్నవాటిలో బెస్ట్ సెలెక్ట్ చేయమని….”

“మనిషి అందంగా ఉన్నపుడు, అన్ని ఫొటోస్ బెస్టుగానే ఉంటాయి”

“సంజయ్……నీకు శారీస్ గురించి ఏమి తెలియదని అర్థమయ్యింది”

“నా షర్ట్స్ గురించే నాకు సరిగ్గా తెలీదు…. ”

ప్రియ ఒక్కసారిగా నవ్వింది. నేను నవ్వాను.

“నిజం….. ”

కొంచెంసేపు ఇద్దరి వైపు నుంచి ఏ సెబ్దం లేదు.

“సంజు, పొద్దున్న నువ్వు అడిగినప్పుడు, నేను రాకూదనుకున్నాను, ఇప్పుడేమో ఇక్కడ అన్ని మరచిపోయి నీతో కలసి నవ్వుతున్నాను, ఇప్పుడు సంజు అని నిన్ను పిలుస్తున్నాను….. ఏంటో తెలియదు….. నీ మాటలో ఏమో కానీ….. నేను ఇంత ఫ్రీ గా ఈ మధ్య కాలంలో ఎవ్వరితో మాట్లాడలేదు…… నా ఫ్రెండ్స్ తో కూడా……”

“ఎందుకో చెప్పనా ??”

“ఎందుకు ??”

“ఎందుకంటే….. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావ్ కాబట్టి……..మనకి ఇష్టమైన వాళ్లతో ఉన్నపుడే ఆలా ఫీల్ అవుతాం”

ఒక నిమిషం అలోచించి “hmmmm నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది…… నేను నిన్ను ఇష్టపడుతున్ననెమో……”

ఒక నిమిషం పాటు సైలెంట్ అయిపోయింది

ఈ లోపల వెయిటర్ తినటానికి ప్లేట్స్, ఫుడ్ తెచ్చ్చాడు. ప్లేట్స్ పెట్టి, అంత వడ్డించి వెళ్ళాడు వెయిటర్.

మరి సైలెంట్ గా ఉందని నేను “స్వీటీ…. ఆ పెప్పర్ sprinkler ఇవ్వు”

తను నా వైపు చూసి “స్వీటీ కాదు ……. ప్రియ”

ఇద్దరం ఒకళ్ళను చూసి ఇంకొకళ్ళం నవ్వుకున్నాం.

టు బి కంటిన్యూడ్………

“ప్రియ ఎందుకు స్వీటీ వద్దంటున్నావ్??”

“అమ్మ నాన్న ఇంట్లోవాళ్ళు తప్ప ఆలా నన్నెవ్వరు అలా పిలవలేదు….. ”

“ప్రియ గారు, నా పేరు సంజయ్ అండి, నేను మీకు కాబోయే హస్బెండ్ అండి…….ఇంకొక వారంలో మన ఎంగేజ్మెంట్ అండి….. ”

ప్రియ నవ్వి “సంజు, ఆలా అని కాదు”