ప్రేమికుడు – Part 3

మానస : పదండి వస్తున్నా…అని వెనక్కి తిరిగి.. మొహమాట పడకు నేను లేనా ఏంటి దా, అప్పుడెప్పుడో తిన్నాం.. అయినా ఇప్పుడు ఎక్కడికని వెళ్తావ్ కొన్ని రోజులు ఇక్కడే మాతో ఉండు. కొత్త ఊరు కొంచెం రిఫ్రెష్ అవ్వు.. ఆ తరువాత ఏం చెయ్యాలనుకుంటున్నావో అలోచించి నిర్ణయం తీసుకుందువు.. ఇంకేం మాట్లాడకు నీకు ఎవ్వరు లేరనుకుంటున్నావేమో నీ ఫ్రెండ్ అరవింద్, మీ మావయ్యతొ పాటు నేను కూడా నీ ఫ్రెండ్ నే… దా అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది.

సుబ్బుతొ పాటు ఆదిత్య, విక్రమ్ రాము అందరూ భోజనాలకి కూర్చుంటే మానస అనులు ఇద్దరు అందరికీ వడ్డించి వాళ్ళు కూడా కూర్చున్నారు, మానస సుబ్బుకి చికెన్ వడ్డించింది.

సుబ్బు : థాంక్స్

మానస : దేనికి

సుబ్బు : నీ స్నేహానికి

మానస : నేనే నీకు రుణపడి ఉన్నాను సుబ్బు, రిస్క్ అని తెలిసి కూడా ఒక్కదాన్ని ఉన్నానని నాకు తోడుగా ఇంత దూరం నన్ను సేఫ్ గా తీసుకొచ్చావ్.. నేనే నీకు థాంక్స్ చెప్పాలి.

అను : మానస ఒక్కటే కాదు నేను కూడా, రేపు మా వాళ్లు చేసింగ్ కి వస్తే మాకు కూడా హెల్ప్ చెయ్యాలి.

సుబ్బు : హహ.. (అమ్మాయిల వెనక పడే దెగ్గర నుంచి ఇప్పుడు బ్రోకర్ పనులు చేస్తున్నా)

మానస : రేయి బైటికి వినిపిస్తుంది..

ఇంతలో బైట ఏదో గొడవ గొడవగా అర్ధంకానీ భాషలో అరుస్తుంటే ఆదిత్య లేచాడు.. అందరూ ఆదిత్యని చూసారు.

ఆదిత్య : ప్రశాంతంగా అన్నం కూడా తిననివ్వట్లా, అర్ధంకాలా నా కొరియన్ బ్యాచ్ వచ్చారు.

విక్రమ్ కూడా లేచాడు, ఇద్దరు చేతులు కడుక్కుని లేచారు.

సుబ్బు : ఏమైంది

ఆదిత్య : అన్ని డోర్స్ లాక్ చేసి ఉన్నాయిగా, ఎవ్వరు బైటికి రాకండి.. జాగ్రత్త.

మానస : ఎవరో ఎటాక్ చెయ్యడానికి వచ్చారు..

సుబ్బు నేను వెళతాను అని లేచి చెయ్యి కడుక్కుని బైటికి వెళ్లి, ఎలా వెళ్ళాడో అలానే లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి అందరితొ పాటు కూర్చుని మెలకుండా అన్నం తింటున్నాడు.

మానస : ఏమైంది?

సుబ్బు : వాళ్ళ దెగ్గర గొడ్డళ్లు ఉన్నాయి

మానస : (నవ్వుతూ) మరి ఓ పోటుగాడిలా పోయావ్

సుబ్బు : ఇంకొంచెం పులుసు పొయ్యి.

మానస నవ్వింది, అది చూసిన అనుకి కూడా మన సుబ్బిగాడి గురించి కొంచెం కొంచెం అర్ధం అవ్వసాగింది.. చిన్నగా నవ్వింది.

సుబ్బు : నవ్వకండి ఇట్స్ ఎ సీరియస్ మాటర్.. అక్కడ గొడ్డళ్లు పట్టుకుని చంపడానికి వస్తుంటే మీరేమో నవ్వుతారు.. నేనేదో చిన్న గొడవ తోపులటకె కదా అనుకున్నా.. వాడు నన్ను చూడగానే అసలోళ్ళని వదిలేసి నా మీదకి గొడ్డలి విసిరాడు వెంట్రుక వాసిలో తప్పిపోయింది.