ప్రేమికుడు – Part 4 150

అరవింద్ : అది బైటిది.. ఇది ఇంట్లోది లేడీస్ కోసం మాత్రమే.. మీకు ఏ డిస్టర్బన్స్ ఉండదు.. ఏమైనా కావాలంటే ప్రియా ఉంది తను చూసుకుంటుంది.. ప్రియా ప్రియా

ప్రియా : అన్నయ

అరవింద్ : మేడం వాళ్ళని చూసుకో మేము అలా వెళ్లి వస్తాం.. ముందు ఏమైనా తినండి ఆ తరువాత ఎంజాయి చెయ్యండి.. ప్రసాద్ రావోయి నీకు సెపెరేట్ గా చెప్పాలా

ప్రసాద్ : సర్ నేను మీతో

అరవింద్ : గ్లాస్ లేవదా ఏంటి.. అని నవ్వాడు.. ప్రసాద్ కూడా వాళ్ళతో పాటే లోపలికి వెళ్ళాడు.

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

తెల్లారే మానస అందరినీ లేపింది.. తన నాన్నకి ఫోన్ చేద్దామని ఫోన్ తీసి మళ్ళీ ఆలోచిస్తూ కూర్చుంది. విక్రమ్ భుజం మీద చెయ్యి వేసి చూడటంతో మళ్ళీ ఫోన్ చేసింది.

మానస : హలో నాన్నా

శివరాం : ఇన్ని రోజులకి గాని నన్ను క్షమించలేక పోయావా, తప్పులన్నీ ఒప్పుకున్నానుగా

మానస : వాడు మీ కోసం వస్తున్నాడు.

శివరాం : తెలుసు, తప్పు నాదే తన అమ్మని తిట్టాను.. ఏడ్చాడు కానీ ఇంత సీరియస్ గా తీసుకుంటాడు అనుకోలేదు.. క్షమాపణలు చెపుతాను.

మానస : వాడు అస్సలు మమ్మల్ని కలవలేదు, కలవడు కూడా జాగ్రత్త. నేను వస్తున్నాను.

శివరాం : లేదు వద్దు నిన్నేమైనా చేస్తాద్లాడేమో

మానస : ఆ భయం అక్కర్లేదు, కానీ నాన్న నువ్వు నిజంగానే మారిపోయావా.. నిన్ను చులకనగా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది, ఈ సారి తేడా వస్తే ఆదిత్య నుంచి నేను నిన్ను కాపాడలేను.

శివరాం : లేదమ్మా నేను మారిపోయాను, నాకు పని ఇచ్చే వాళ్ళ ఫోన్ కూడా ఎత్తడం లేదు.. అన్ని మానేసి ఇంట్లోనే ఉంటున్నాను.

మానస : మీరు గ్రౌండ్ కి వెళ్ళకండి

శివరాం : లేదు వెళతాను, ఒక వేళ ఆ అబ్బాయి అవకాశం ఇస్తే ఆ అబ్బాయికి క్షమాపణలు చెపుతాను.. నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసాడు.

అందరూ గ్రౌండ్ కి వెళ్లారు శివరాం మ్యాచ్ లో పాల్గొనడానికి అందరితో పాటు గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు, చీఫ్ గెస్ట్ గా, IAS శృతి వచ్చింది. అప్పటికే శరణ్య చుట్టు వెహికల్స్ తో బందొబస్తుతో రెడీగా ఉంది, ఇంకో వైపు విక్రమ్ అలెర్ట్ గా ఉన్నాడు, ఆదిత్య మాత్రం తడిగుడ్డ ఏసుకుని చైర్ లో కూర్చుని పడుకున్నాడు.

విక్రమ్ : రేయి ఇప్పుడు పడుకున్నావేంటి

ఆదిత్య : నా వల్ల కాదు, సుబ్బు గాడు కామెడీ చేస్తాడు అని తెలుసు, కానీ వాడు సీరియస్ అయితే ఎలా ఆలోచిస్తాడో మనకేం తెలుసు, అంతగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడంటే వాడి జీవితంలో ఎంత కోల్పోయి ఉంటాడు, ఎన్నెన్ని చూసి ఉంటాడు.. మాములుగా అయితే బూతులు తిడితే తిరిగి తిట్టొ లేక కొట్టొ వదిలేస్తారు కానీ వాళ్ళ అమ్మని అనగానే ఒక మనిషిని చంపేంత కోపం వచ్చిందంటే వాడి సర్వసం వాడి ఎమోషన్ వాళ్ళ అమ్మే అయ్యుండాలి.. సారీ నేను వాడికి అడ్డు రాను… నా సలహా నువ్వు కూడా మెలకుండా కూర్చో.. అనగానే అప్పుడే అటు వచ్చిన మానస, అరవింద్ ఇద్దరు ఆ మాటలు విన్నారు.

2 Comments

  1. రేయ్ సస్పెన్స్ నవల చదువుతున్నటుగా ఉంది చాలా బాగుంది
    కంటిన్యూ చేయి ప్లీజ్

  2. కె.ఎం.శ్రీనివాస్

    కథ bhagundhi midlo apakandi commedy nundi realloki tisukuvacharu story continue cheyandi.

Comments are closed.