విక్రమ్ : మానస అదేం లేదు..
మానస : ఆదిత్య నిజమే చెప్పాడేమో… అని కళ్ళలో నీళ్లు తెచ్చుకుంది.
ఇంతలో అరవింద్ మాట్లాడగానే అందరూ తన వైపు చూసారు.
అరవింద్ : అవును, నేను వాడిని కలిసింది వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాకే.. మొదట్లో ఎప్పుడు ఒంటరిగా కూర్చునేవాడు నాలుగేళ్లు పట్టింది నాతో కాకుండా వాడు వేరే వాళ్ళతో మాట్లాడడానికి.. మొదట్లో ఎప్పుడు వాళ్ళ అమ్మనే గుర్తు చేసుకుంటూ ఉండేవాడు ఆ తరువాత మాత్రం అన్నిటికి నవ్వే వాడు. ఏమైందిరా అంటే హాస్పిటల్లో వాళ్ళ అమ్మ చివరి నిమిషంలో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని మాట తీసుకుందట.. మర్చిపోయా.. ఇన్నేళ్లు మా అమ్మ లేదన్న బాధలో అని చెప్పి ఆప్పటి నుంచి వాడికి ఆనందం వేసినా బాధ ఒచ్చినా ఏమైనా ఒక్కడే ఒంటరిగా కూర్చుని తన పర్సులో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ కూర్చుంటాడు. అందుకే సుబ్బు అస్సలు ఎవ్వరి మాట వినట్లేదు ఆవేశంలో ఉన్నవాడైతే కొంత సేపటికి తగ్గిపోయి ఆగిపోతాడు కానీ వీడు అలా కాదు.
ఇంతలో ఆదిత్య కంటికి ఒక చిన్న పిల్లవాడు అన్ని కార్ల వెనుక ఏదో బూచక్రం ఆకారంలో ఉండే దాన్ని ప్రతీ కారుకి తగిలిస్తుండడం చూసి అటు వైపు పరిగెత్తాడు, అందరూ ఆదిత్య వైపు చూసేసరికి ఆదిత్య ఆ పిల్లవాడి చొక్కా గట్టిగా పట్టుకుని వాడి చేతిలో ఉన్న దాన్ని లాక్కున్నాడు అది మాగ్నెట్ లాఉంది మధ్యలో చిన్న లైట్.. అందరూ ఆదిత్య వైపు వెళ్లారు.
ఒక్క నిమిషానికి శరణ్య కూడా గుంపుగా ఉండడం గమనించి అటు వైపు వెళ్ళింది, ఈలోగా ఒక పెద్ద విజిల్ వినిపించే సరికి అందరూ అటువైపు చూసారు గ్రౌండ్ ఫెన్సింగ్ బైట ఒక నల్లటి కారు ముందు పెద్దగా రాడ్లతో బంపర్, చూస్తే అందులో సుబ్బు ఇంకా విజిల్ వేస్తూనే ఉన్నాడు. ఆదిత్య సుబ్బుని చూస్తూనే పట్టుకున్న పిల్లాడిని వదిలేసాడు, వాడు పారిపోగానే సుబ్బు విజిల్ ఆపేసి చేతిలోకి రిమోట్ తీసుకున్నాడు, అది చుసిన ఆదిత్యకి అర్ధం అయ్యి వెంటనే చేతిలో ఉన్న దాన్ని పక్కకి విసిరేసాడు అది ఆఖరి కారు కిందకి వెళ్లి పడింది. మానస సుబ్బునే చూస్తుంటే సుబ్బు రిమోట్ నొక్కేసాడు. అంతే.. అక్కడున్న ప్రతీ ఒక్క కారుకి కరెంటు షాక్ కొట్టినట్టు అద్దాలు పేలిపోయి సౌండ్స్ వచ్చాయి. వెంటనే సుబ్బు కారు నుంచి పెద్ద సౌండ్..
సుబ్బు కారు వేగంగా దూసుకుంటూ సెక్యూరిటీని గుద్దేసి లోపలికి వచ్చింది, గట్టిగా హారన్ కొట్టాడు అందరూ భయంతో పారిపోతుంటే కూర్చున్న కుర్చీలనుంచి ఒక పది మంది మనుషుల వరకు గుద్దుకుంటూ ముందుకు వెళ్ళాడు. అందరూ పారిపోయారు కానీ శివరాం మాత్రం ఒక్కడే గ్రౌండ్ లో నిల్చొని ఉన్నాడు. సుబ్బు శివరాంని చూసి ఇంకా స్పీడ్ పెంచాడు, ఇంతలో విక్రమ్ ఒక పెద్ద బొంగు తీసుకుని కారు మీదకి విసిరాడు. సుబ్బు కనీసం దాన్ని పట్టించుకోకుండా డ్రిఫ్ట్ చేస్తూ ఐదో గేరు నుంచి ఒకేసారి మూడో గేర్లోకి మార్చి గట్టిగా ఆక్సిలరేటర్ మీద తొక్కి పట్టాడు.. ముందు రెండు టైర్లు గాల్లోకి లేచి ముందుకు దూకి ఇంకా వేగంగా పెద్ద శబ్దం చేస్తూ శివరాం ముందుకు వెళ్ళింది..
అరవింద్ : సుబ్బు…
అను అయోమయంగా చూస్తుండగానే..
స్టేజి మీద నుంచి శృతి లేచి నిలబడి చూస్తుంది
శరణ్య ఇంకా షాక్ లోనే ఉంది
ఇంకొక్క సెకండ్ అనగా శివరాం ముందు మానస అడ్డంగా నిలబడి భయంతో కళ్ళు మూసుకుంది..
విక్రమ్ : మాన…. స్….ఆ.. అ..
సుబ్బు వెంటనే హ్యాండ్ బ్రేక్ గట్టిగా పైకి లాగి, స్టీరింగ్ మొత్తం పక్కకి తిప్పేసి అక్కడే ఉన్న ఒకటిన్నర అడుగు బండ మీదకి పోనించాడు కింద కాలు మొత్తం బలంగా బ్రేక్ మీద తొక్కుతూ.. చూస్తుండగానే సుబ్బు కారు మానస, శివరాం మీదుగా గాల్లోనే ఒక పల్టీ కొట్టి నేల మీద ల్యాండ్ అయ్యి ఆగిపోయింది.. సుబ్బు వెంటనే తేరుకుని కారులోనుంచి బైటికి వచ్చి మానసని ఒక్క నెట్టు నెట్టి శివరాం మీదకి దూకి దవడ మీదే పిడిగుద్దులు గుద్దడం మొదలు పెట్టాడు.. సుబ్బు మొహం మీద గుద్దుతుంటే శివరాం చిన్నగా కింద పడిపోతుంటే అప్పటికే అక్కడికి చేరుకున్న ఆదిత్య విక్రమ్ ఇద్దరు కలిసి సుబ్బుని పక్కకి లాగాడు.. సుబ్బు వెంటనే ఆదిత్య మొహం మీద గుద్దుతుంటే ఆదిత్య మూడు గుద్దులని ఓర్చుకుని నాలుగో గుద్దు తప్పించుకుని మొహం మీద ఒక్కటి పీకాడు.. సుబ్బు కింద పడి లేచి చూసేసరికి అప్పటికే సెక్యూరిటీ ఆఫీసర్లు రౌండ్ అప్ చెయ్యడంతో సుబ్బు ఒక్క ఉదుటున వెళ్లి కార్ ఎక్కాడు. ఇంతలో శరణ్య షూట్ చెయ్యబోతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ గాల్లో నుంచి ఒక పుల్ల ఎగురుకుంటూ వచ్చి శరణ్య మెడ మీద గుచ్చుకుంది, శరణ్య స్పృహ తప్పి పోవడంతో అందరూ చూసారు.. ఆ వెంటనే ఇంకో నలుగురు పడిపోగానే అందరూ హడావిడిలో ఉండగా సుబ్బు కార్ అక్కడనుంచి దంచి కొట్టాడు.
అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా విక్రమ్ శరణ్య దెగ్గరికి వెళ్లి తన మెడ మీద ఉన్న పుల్లని గమనిస్తుంటే సెక్యూరిటీ ఆఫీసర్లు చుట్టు ముట్టారు ఈ సారి శృతి అరెస్ట్ చేయించింది అందరినీ.. ఈ సారి ఏం జరగలేదు.
అనురాధ వెంటనే ఫోన్ తీసింది : హలో వాసు అన్నయ్య..
రేయ్ సస్పెన్స్ నవల చదువుతున్నటుగా ఉంది చాలా బాగుంది
కంటిన్యూ చేయి ప్లీజ్
కథ bhagundhi midlo apakandi commedy nundi realloki tisukuvacharu story continue cheyandi.