గుంపులో ఎవ్వరికి తెలీకుండా సుబ్బు తప్పించుకోడానికి హెల్ప్ చేసిన ఆ నలుగురు అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. వాసు సాయంతో శృతిని పరిచయం చేసుకుని అక్కడి నుంచి ఇక నేరుగా సంధ్య దెగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుని మానస తన అమ్మా నాన్నని కలిసి అక్కడనుంచి అరవింద్ ని కలిశారు. చీకటి పడింది.
మానస : వాడు రాలేదా
అరవింద్ : ఇంకా లేదు, కానీ వస్తాడు.
మానస : ఆ శరణ్య, ఎలా ఉంది.
అరవింద్ : బానే ఉంది.
మానస : మేము వెళుతున్నాం.. వాడు వస్తే నేను క్షమించానని చెప్పు.. వాడికి నీతో పాటు మేము కూడా ఉన్నామని మర్చిపోవద్దని చెప్పు. అని అక్కడ నుంచి బండి ఎక్కి వెళ్ళిపోయింది.
మానస వాళ్ళు వెళ్ళిపోగానే సుబ్బు అరవింద్ ఇంట్లోకి అడుగుపెడుతూ, మానస కి సారీ అని మెసేజ్ పెట్టాడు. తిరిగి మానస నుంచి మెసేజ్ వచ్చింది చూసి చదివాడు.. సారీ ఫర్ ఎవరీథింగ్.. యువర్ లవ్లీ సిస్టర్.. టేక్ కేర్ అని చదువుకుంటూ లోపలికి వెళ్ళాడు.
అరవింద్ : రేయి ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు.
సుబ్బు : చూసే వచ్చాను, నేను కూడా బైలుదేరుతున్నా నీకు చెప్పి వెళదామని వచ్చాను.
అరవింద్ : ఎక్కడికి
సుబ్బు : ఎక్కడికైనా దూరంగా, నాకు పరిచయం లేని వాళ్ళు నా మొహం తెలిసిన వాళ్ళకి దూరంగా కొన్ని రోజులు ఎటైనా వెళ్ళొస్తాను.
అరవింద్ : మరి శరణ్య
సుబ్బు : శరణ్య లేదు అరణ్య లేదు.. ఇక నా కళ్ళకి నచ్చిన వాళ్ళని కాకుండా మనసుకి నచ్చిన వాళ్ళని వెతుకుతాను.. వెళుతున్నా
అరవింద్ : డబ్బులు..
సుబ్బు : ఉన్నాయి..
అరవింద్ : జాగ్రత్త అని కౌగిలించుకున్నాడు.
సుబ్బు అక్కడనుంచి బైటికి వచ్చి సందు మలుపు తిరగగానే సుబ్బు మెడ మీద ఒకడు గట్టిగా గొట్టంతో ఊదగానే అందులోనుంచి ఒక పుల్ల వచ్చి సుబ్బు మెడ మీద గుచ్చుకుని సుబ్బు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే సుబ్బుని భుజానికి ఎత్తుకుని చీకటిలో కలిసిపోయారు.
అందులో ఒకడు ఎవరికో ఫోన్ చేసాడు.
“”అక్కా మనకి కావాల్సిన వాడు దొరికాడు”
అక్షిత : త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేయండి.. టైం లేదు వాళ్ళు వచ్చేస్తున్నారు..
“అలాగే”
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
పొద్దు పొద్దునే ఐదు గంటల సమయం.. శివరాం ఇంట్లోకి పది మంది చడిచప్పుడు లేకుండా లోపలికి వెళ్లారు.. పడుకున్న శివరాం దెగ్గరికి వెళ్లి తన పీక మీద కత్తి పెట్టారు.. చిన్నగా కొయ్యగానే శివరాం కళ్ళు తెరిచాడు.
శివరాం : రాబర్ట్.. ప్లీజ్ వదిలేయి.. నేను మీ గురించి ఎవ్వరికి చెప్పలేదు.. నా టైం బాలేక.. ఈ పనులు వదిలేసాను.
రాబర్ట్ : సారీ.. శివరాం.. నిన్ను చంపక పోతే నన్ను చంపేస్తారు.. కావాలంటే నీకొక ఫేవర్ చేస్తాను.. నీ భార్యకి ఏమి తెలియకుండా నొప్పి లేకుండా చంపేస్తాను.. రేయి కానివ్వండ్రా.. అనగానే ఒకడు మంచం దెగ్గరికి వెళ్లి ప్రశాంతంగా పడుకున్న మానస అమ్మ పీక మీద కత్తి పెట్టి ఒక్క వేటు వేసాడు.. శివరాం ఇంకెవరైనా ఉన్నారా ఇంట్లో..
శివరాం : లేరు.. అన్నాడు ఏడుస్తూనే
రాబర్ట్ : రేయి చెక్ చెయ్యండి.. బై శివరాం.. ఆ మర్చిపోయాను ఇన్ని రోజులు మన బాస్ పేరు చెప్పమని అడిగే వాడివి కదా.. మన బాస్ పేరు మానస్… అని తన మీద పెట్టిన కత్తితో శివరాం పీక కోసేసాడు.
రాబర్ట్ మనుషులు ఇల్లంతా వెతికి చివరి రూంలోకి వెళ్లి అక్కడనుంచి బైటికి వస్తుంటే డౌట్ వచ్చి లైట్ వేసాడు.. అక్కడే కింద కూర్చుని ఏడుస్తూ నాని అరవకుండా నోటి మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంది పని మనిషి రమ
రేయ్ సస్పెన్స్ నవల చదువుతున్నటుగా ఉంది చాలా బాగుంది
కంటిన్యూ చేయి ప్లీజ్
కథ bhagundhi midlo apakandi commedy nundi realloki tisukuvacharu story continue cheyandi.