సూరిగాడు క్షణం కూడా వృధా చేయకుండా పద్మావతిని కలుసుకున్నాడు. వీలైనంత సేపు మారుతి పెళ్లాం అయిన యశోదను తనింటి నుండి దూరంగా వుండేటట్లు చూడమని అర్థించాడు. ఆమె వప్పుకుని “యశోదా” అని కేకేసింది. “ఏమొదినా” అని బయటికి వచ్చింది యశోద.
“నీతో పనుంది ఇంటికిరా” అని ఇంట్లోకి పిలుచుకుంది. ఆమె ఇల్లుదాటిన మరుక్షణం కొంపలో దూరి ప్లాస్టిక్ కవరుని మాయం చేశాడు సూరిగాడు. మారుతి అందరూ రహస్యాలను దాచే చోటే ఆ కవరుని దాచాడు దేవుని పటాల వెనక.
అగ్రహారం వూరు అడవికి దూరంగా విసిరేసినట్లు వుంటుంది. రంగనాథ స్వామి గుడికి వూరికి మద్య దూరం ఒక మైలీ పైనే వుంటుంది. దాన్ని చేరుకోవాలంటే రంగనాయక కుంట చెరువుని దాటాల్సిందే. ఆ చెరువుని రంగానాయకుడే తవ్వించాడు. ఆ చెరువుకి ఒక వైపు గుట్ట వుంటే మరో వైపు రామలింగా రెడ్డి ఎస్టేట్. ఆ గుట్ట పైన ఒక పెద్ద బండ మీద రంగనాథ స్వామి ఆలయం వుంటుంది.
మారుతి మరియు అతని వెంట ఇద్దరు అనుచరులతో రంగనాథ ఆలయములోకి ప్రవేశించాడు. వారి వెనకే రాజు నీడలా అనుసరించాడు. వాళ్లు గుడిలోకి ప్రవేశించగానే రాజు కూడా అందులోకి ప్రవేశించాడు. గుడంతా వెతికినా వాళ్ల జాడ తెలియలేదు. ఆ గుట్ట వెనకున్న గోడ వరకు వెతికినా కనపడలేదు.
రెండోసారి గుడిలో వెతుకుతుంటే మాత్రం ముగ్గురు మూడు వైపుల నుండి రాజుని చుట్టు ముట్టారు.
స్కూల్ డేస్:
రాజుని మారుతి అతని ఇద్దరు అనుచరులు చుట్టుముట్టారు. వాడిప్పుడు ఎక్కడికి పోలేడు. వెనకాల గోడ ముందు వీళ్లు. పారిపోవడం పిరికితనమని పించుకుంటుంది. ఎదిరించడానికి వాళ్లకి సంఖ్యాబలం ఎక్కువ. వాళ్లు ముగ్గురు తనొక్కడే. కాబట్టి ఎదిరించాలనుకోవడం మూర్ఖత్వం.
పూర్తీగా చీకటి పడిపోయింది. వెలుగు అంతగా లేదు. గుడి మండపంలో వెలుగుతున్న విద్యుత్ బల్బు కాంతిలో వాళ్లతనిని చుట్టుకున్నారు. ఎవరూ మాట్లాడటం లేదు. రాజు గుండెల్లో రేగుతున్న అలజడిని, భయాన్ని మొఖంలో వ్యక్త పరచకుండా వుండటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
మాట్లాడటం మొదలుపెడితే గొంతులో వణుకుని ఎక్కడ పసిగడతారోనని మాట్లాడలేదు. గాలి హోరున వీస్తొంది. వాళ్ల చేతులలోని టార్చ్ లైట్ల కాంతి రాజు మొఖం మీద పడగానే చేతిని అడ్డం పెట్టుకున్నాడు.
ఆ కాంతిలో రాజు ముఖాన్ని మారుతి గుర్తు పట్టాడు. “ఓరి నాగప్ప కొడుకా నువ్వా, ఇక్కడేమ్ చేస్తున్నావు రా” అని అడిగాడు.
“ఎంటి నీకు వీడు తెలుసా” అనుచరులలో ఒకడు అడిగాడు.
“వారిని యెంగటమ్మ మేనల్లుడు, యెంగటప్ప అన్న నాగప్ప కొడుకు” అన్నాడు మారుతి రాజు భుజం మీద చేయి వేస్తు. వాడి చేయు రాజు భుజం మీద బలంగా పడింది. అది ఆప్యాయతతోవేసింది కాదు నాగప్ప మీద గౌరవంతో వేసింది. కొడుకుని ఏమైనా చేస్తే నాగప్ప వారి మీద కోపగించుకుంటాడని వాడి భయం. వాణ్నేమ్ చేయాలో తెలీక ఎక్కువ సేపు మౌనాన్ని భరించలేక మారుతి మాట్లాడి వాణ్ని దగ్గరకు తీసుకున్నాడు.
భుజం మీద చేతులు అలాగే వుంచి మంటపం లోకి నడిపించాడు. “ఇప్పుడు చెప్పరా ఇక్కడేమ్ చెత్తాన్నావు” అన్నాడు. రాజుకి ఇంకా భయం గానూ, అనుమానంగానే వుంది. అవేమి ముఖంలో కనిపించకుండా, గొంతులో ద్వనించకుండా “అదన్నా, నేనూ, నాఫ్రెండ్ సూరిగాడు సాయంత్రంగా యీ గుడిని చూద్దామని వచ్చినాము. సూరిగాడంటే వాడేన్నా మొన్న నాతో పాటు వూరికి వచ్చినోడు ” అని చెప్పి వాళ్ల ముఖాలని పరికించాడు. చెప్పింది నమ్మారో లేదోనని అనుమానంతో.
వారి ముఖాల్లో ఎటువంటి భావన కనపడలేదు. పైగా మొద్దు ముఖాలు గుర్రుగా చూస్తున్నారు. “అన్నా చీకటి పడినంక ఇంటికి పోదామని చెరువులో దావన నడిచినా మన్న. అప్పుడే వానా కొడుకు సూరిగానికి దొడ్డికి వచ్చింది. అరే ఈడే వుండు నేనిప్పుడే వచ్చేస్తానని పోయినాడు. అర్దగంట అయినా రాలే. అదే టైంలో గుడిలో ఎదో అలికిడి అయితే వాడేనేమో నని ఈడకొచ్చినా. మీరేమో గుడి దొంగను పట్టుకున్నట్టు ముఖాలు పెడతాండారు” భయపడినట్టు ముఖం పెట్టి అన్నాడు.
ఆ మాటకి వాళ్లు విరగబడి నవ్వేరు. “ఓరిని ఇంతలేని దానికే బయపడినావా. మేము మనుషులమే పైగా మీ నాయన నాకు గురు సమానులు” అన్నాడు మారుతి నవ్వుతూ. రాజు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. ప్రమాదం తప్పిందని అనుకుంటుండగానే “మరి మీ ఫ్రెండేడరా” అన్నాడొక మొద్దు ముఖం.
“యాడికి పోయినాడో దొంగ నాకొడుకు, ఇంటికాడ దొరికుతాడు గదా గుద్ద పగల దెంగుతా నాకొడుక్కి” అన్నాడు ముఖం కోపంగా పెట్టి.
సమయానికి ఆపబ్దాందవుడిలా సూరిగాడు గుడికాడికి వచ్చాడు. “లే రాజు యాడుండావు” అని అరుస్తూ.
“అదిగో వచ్చేసినాడు” అరిచినాడురాజు ఆనందంతో. నక్కల మద్య నుండి లేడి పిల్ల తప్పించుకున్నట్టు పరిగెత్తుకుని సూరిగాన్ని చేరుకున్నాడు. “యాడికి పోతివి వై” అని కసురుకున్నట్టు నటించాడు.
“నేనాడికి పోయినా కడుకునెందుకు నీళ్లని యెతుక్కుంటా పోయినా. నువ్వెంటికి యీడ కొచ్చినావ్” అన్నాడు సూరిగాడు సమాదానమిస్తూ.
“నువ్వు గుడికాడికి వచ్చినావేమోనని” అన్నాడు.
“ఆ. . . ఆ . . . సరే ఇంగ ఇంటికి పొండి. రాత్రి పూట ఇట్ల గుళ్లెంబడి తిరగడం మంచిది కాదు పొండి” మారుతి దారి చూపిస్తూ.
“వుంటాం న్నో పొయ్యొసాం. . . ” అని జారుకున్నాడు రాజు గాడు.
కొంత దూరం కిందకి దిగి వాళ్లు కనపడటం లేదు, మాట్లాడతినే వినపడదని నిశ్చయం చేసుకున్నాక “వాళ్లకి చిక్కావేమి గురూ నువ్వు” అన్నాడు సూరిగాడు.
“చిక్కడమా నువ్వు రాకపోయి వుంటే ఏమయ్యోదో” అన్నాడు.
“అంటే”
“ఆల్మోస్ట్ యుద్దం తప్పినట్టయింది” అన్నాడు గుండె చేతులో పట్టుకుంటూ.
“ఎందన్నా వాన్నట్ల వదిలేస్తివి” అనింది మొద్దు ముఖాల్లో ఒకటి. “వైదిలెయ్యక ఏమ్ చేత్తాం, వాడు నాగప్ప కొడుకురా ” అన్నాడు మారుతి.
“నాగప్ప ఎవడన్నా, వాడెవడి కొడుకో అయితే మనకెంది, మనల్ని ఎంట పడినోన్ని యానాపొద్దు వదులుండ్లా వీన్నొదలడం మంచిదేనా” అనింది ఇంకో మొద్దు ముఖం.
“నాగప్ప ఎవడా, ముందుకు పోనూ నీకే తెలుస్తుంది” అన్నాడు.
“సరే పదన్నా, ఆ ముసలి నాకొడుకు ఏమి చేస్తున్నాడో” అని గుడి వెనక్కు పోయారు. గుడంతా రాతి కట్టడం. సరిగ్గా మూల విగ్రహానికి వెనక రాతి గోడకి ఇంకో విగ్రహం చెక్క బడివుంది. చూడటానికి అది గుడిలో ఒక భాగమనే అనిపిస్తుంది. దాన్ని తల భాగంలో పట్టుకుని ముందుకి లాగగానే చేతిలోకి వూడి వచ్చినట్టయింది. కానీ అది వూడి రాలేదు. దాని కిందున్న పెద్ద బండ లోపలికి జరిగి ఒక మనిషి పట్టేన్త దారిచ్చింది. ఒకరి తరవాత మరొకరు లోపలికి దూరారు.
“నేను చెప్పిందేమి చేశావు” అనడిగాడు రాజు ఇంటికి పోయాక. యెంగటమ్మ వాళ్లకి దొడ్లో చాప వేసింది. దాని పక్కనే పశువుల కొట్టం. దోమలు లాంటి కీటకాలు కొట్టం లోకి రాకుండా పగిలిని మట్టికుండలో నిప్పులు వేసి, ఆ నిప్పుల మీద వేపాకు మండలను వేశాడు. ఆ పచ్చి వేపాకులు పొగను వెదజల్లుతున్నాయి.
ఆ కొట్టంలో ఒక విద్యుత్తు బల్బు వెలుగుతొంది. ఆ వెలుగులో సూరిగాడిచ్చిన ప్లాస్టిక్ కవరును తెరిచాడు రాజు. అమ్మాయిల ఫోటొలు. అందమైన బుట్టబొమ్మలు. అందంగా అలంకరించబడి వున్నారు. ఆ అలంకరణ వారికి మరింత అందంగా వున్నారు. అలంకరణ లేకుండా వారిని చూస్తే గుర్తు పట్టడం చాలా కష్టం. ఎనిమిది ఫోటోలు వున్నాయి. ఆ ఫోటోల వెనకాల వారి వివరాలున్నాయి.
వాటిని చూస్తున్నప్పుడు రాజుకో విషయం గుర్తుకు వచ్చింది. తను రుక్సానాని సొరంగంలో నుండి విడిపించినప్పుడు కూడా ఇలాంటి వేషం లోనే వుంది. సొరంగంలో రుక్సానాతో పాటు వున్నా అమ్మాయిలు ఎవరైనా వున్నారేమోనని మళ్లొక్కసారి పరిశీలనగా చూశాడు. అలా రెండోసారి చూసినప్పుడు సూరిగాడు” అన్నా ఆగు” అరిచినంత పని చేశాడు.
“ఎమైంది సూరి” అన్నాడు రాజు. వాడా ఫోటోలను లాక్కుని దాంట్లో నుండి ఒక ఫోటో బయటికి లాగాడు. “ఇది పద్మావతి కూతురు” అని ఒక ఫోటో రాజుకి అందించాడు. ఆ ఫోటోలో వున్న అమ్మాయి ఎంత అందంగా వుందని. చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదు. ఫోటో వెనక్కి తిప్పి చూశాడు.

Sir miru evaro thelidhu Naku kani stories mataram verey rastunnaru opika techukoni mari madhyalo matram apakandi story ni evaru support chesina cheykapoina story continue chyndi plzz
Continue chei bro
Bro indhulo sagam sagam stories rasi apeykandi bro memu chala disappoint avuthnam
Since four days there is no continuation stories.